India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: గ్రూప్1 అభ్యర్థులు తాము చేసుకున్న దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు TSPSC అవకాశం కల్పించింది. రేపటి నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ నెల 23 ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27 సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తుల్లోని వ్యక్తిగత వివరాలు సవరించుకోవచ్చని పేర్కొంది.
CBI, ED కేసులు ఎదుర్కొంటున్నవారు BJPతో కలిస్తే ఏ కేసులూ ఉండవని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ఆ పార్టీతో సంబంధాలున్నవారు ఎన్ని అక్రమాలు చేసినా శిక్షలుండవని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష CMలను లక్ష్యంగా చేసుకొని అరెస్టులు చేయడం దారుణమని వాపోయారు. కేజ్రీవాల్ అరెస్టును ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతానని ఆమె పేర్కొన్నారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నామని, ఇది అప్రజాస్వామికమని మమత స్పష్టం చేశారు.
మారుతీ సుజుకీ 16వేల కార్లను రీకాల్ చేసింది. ‘2019లో JUN 30 నుంచి NOV 1 మధ్య సేల్ అయిన 11,851 బాలెనో.. 4,190 వాగన్-ఆర్ కార్లలో ఫ్యూయెల్ పంప్ మోటార్‌లో లోపం ఉన్నట్లు గుర్తించాం. దీంతో ఇంజిన్ స్టార్ట్ కాకపోవడం లేదా ఆగిపోవడం వంటి సమస్యలు రావొచ్చు. సంబంధిత కస్టమర్లను సంప్రదించి ఉచితంగా రిపేర్ చేస్తాం’ అని తెలిపింది. కాగా 2023లో స్టీరింగ్ రాడ్ లోపం కారణంగా 87,599 ఎస్-ప్రెసో, ఎకో కార్లను రీకాల్ చేసింది.
హోలీ పండుగ ఆదివారం జరుపుకోవాలా? సోమవారం జరుపుకోవాలా? అనే దానిపై పండితులు స్పష్టతనిచ్చారు. ప్రతి ఏడాది ఫాల్గుణం శుక్ల పక్షం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. దృక్ పంచాంగం ప్రకారం ఆదివారం (మార్చి 24) ఉదయం 9.54 నుంచి సోమవారం (మార్చి 25) మ.12.29 వరకు పౌర్ణమి తిథి ఉంది. అందుకే మార్చి 24న లేదా మార్చి 25న ఉదయం కూడా హోలీ జరుపుకోవచ్చని చెప్పారు.
తమ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ సుప్రీంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇటీవల కవిత సైతం ఇలాగే చేశారు. రౌస్ అవెన్యూ కోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ విచారణ ఒకే రోజు ఉండటంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు కేజ్రీవాల్ లాయర్ చెప్పారు. కాగా కవిత పిటిషన్‌పై స్పందించిన SC.. లోయర్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. తమ విషయంలోనూ ఇదే జరుగుతుందనే కేజ్రీవాల్ విత్‌డ్రా చేసుకున్నారని తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య రంగాన్ని దెబ్బతీయొచ్చని ఊహాగానాలు వస్తున్న వేళ ప్రముఖ సర్జన్ డాక్టర్ అతుల్ గవాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వైద్య రంగంలో ఏఐ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఏఐ డాక్టర్లను భర్తీ చేయదు. కానీ ఏఐని ఉపయోగించని డాక్టర్ స్థానంలో ఆ టెక్నాలజీ వాడే మరో డాక్టర్ వస్తారు. ఏఐతో వ్యాధులను ముందస్తుగా గుర్తించడమే కాక మరింత వేగంగా చికిత్స అందించొచ్చు’ అని పేర్కొన్నారు.
రన్ మెషీన్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నారు. T20 క్రికెట్‌లో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా అవతరించారు. మొత్తంగా 6వ క్రికెటర్‌గా నిలిచారు. గతంలో గేల్(14562), మాలిక్(13360), పొలార్డ్(12900), హేల్స్(12319), వార్నర్(12065) ఈ ఫీట్ సాధించారు. కాగా తక్కువ ఇన్నింగ్సుల్లో(360) ఈ మైలురాయి అందుకున్న 2వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచారు. గేల్(345) టాప్‌లో ఉన్నారు.
దేవర సినిమాలో తాను నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి మరాఠే స్వయంగా ప్రకటించారు. ‘దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రుతి. ఇప్పటికే ఈ మూవీలో జాన్వీ కపూర్ ‘తంగం’ అనే పాత్రలో కనిపించనుండగా, శ్రుతి రెండో హీరోయిన్. ఎన్టీఆర్ కూడా డ్యూయల్ రోల్ చేస్తారని టాక్.
ఇటీవల ఇండియాపై విషం కక్కుతున్న మాల్దీవ్స్ దారికొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ దేశ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జు తాజాగా ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు అత్యంత సన్నిహిత దేశమని అభివర్ణించారు. అంతేకాదు.. ఇటీవల మాల్దీవ్స్ నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని హుకుం జారీ చేసిన ముయిజ్జు ఇప్పుడు భారత్ నుంచి రుణ విముక్తి కోరుతున్నారు. మాల్దీవ్స్‌కు సహాయం అందించడంలో భారత్ ముందుంటుందని కొనియాడారు.
AP: పల్నాడు(D) నరసరావుపేటలో మరోసారి ఆసక్తికర పోరు జరగనుంది. TDP నుంచి చదలవాడ అరవింద బాబు, YCP తరఫున గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. వృత్తి రీత్యా వీరిద్దరూ ఎముకలు, కీళ్లకు సంబంధించిన సీనియర్ వైద్యులు కావడం గమనార్హం. నియోజకవర్గ పరిధిలో సొంత హాస్పిటల్స్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గోపిరెడ్డికి లక్ష ఓట్లు రాగా, చదలవాడకు 68 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.