India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పదో తరగతి పరీక్షలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘విద్యాశాఖ సూచన మేరకు పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి. ‘విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి ఫ్రీగా ప్రయాణించవచ్చు. క్షేమంగా వెళ్లి ప్రశాంతంగా పరీక్ష రాయండి’ అని పేర్కొన్నారు.
AP: 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి కేంద్రం బర్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సమీక్షించిన సీఎస్ జవహర్‌రెడ్డి.. ‘ఇకపై పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం ఇదే. స్కూళ్లలో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు, పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, వివాహ నమోదు సహా పలు ప్రయోజనాలకు ఇది తప్పనిసరి. పుట్టిన 7 రోజుల్లోనే ఈ సర్టిఫికెట్ ఇవ్వాలి’ అని ఆదేశించారు.
TG: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో కామారెడ్డిలో 20వేలు, నిజామాబాద్‌లో 6వేలు, సిరిసిల్లలో 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలతో పాటు గోధుమ, ఉల్లి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తప్పుగా ఉన్నాయని పిటిషన్ వేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ మరో అనుమానం వ్యక్తం చేశారు. ‘నేను ఏప్రిల్-2018లో ఒక్కొక్కటి రూ.1000 చొప్పున 2ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశా. కానీ, ఎస్బీఐ రిలీజ్ చేసిన డేటాలో 20 అక్టోబర్ 2020లో కొన్నట్లు చూపారు. ఇది పొరపాటున జరిగిందా? లేక నా పేరుతో ఉన్న ఇంకెవరైనా బాండ్‌ను కొన్నారా? చెప్పాలి’ అని SBIని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ వల్లే WC ఫైనల్‌లో భారత్ ఓడిందని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. పిచ్ విషయంలో వారిద్దరూ జోక్యం చేసుకుని స్లో పిచ్ ఇవ్వాలని క్యురేటర్లకు సూచించారని చెప్పారు. అదే టీమ్‌ఇండియా ఓటమికి పెద్ద కారణమని అభిప్రాయపడ్డారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ స్వభావం మారిపోయిందని, దీంతో వారు టార్గెట్‌ను సులభంగా ఛేదించారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
హీరో నితిన్, డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో త్వరలో మరో సినిమా రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘ఇష్క్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. విక్రమ్ ‘దూత’ వెబ్ సిరీస్‌తో గత ఏడాది మరో హిట్ అందుకున్నారు.
TS: BRS ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన ప్రమేయం లేకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తన ప్రమేయంపై ఆధారాలు లేవని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రతివాదిగా చేర్చారు.
టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్ పెళ్లి చేసుకున్నారు. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న పృథ్వీ వెంపటితో మార్చి 6న నిశ్చితార్థం చేసుకున్న ఆమె.. నిన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. స్టార్ సింగర్ రేవంత్ తన ఇన్‌స్టాలో కొత్త జంట ఫొటోలు పోస్ట్ చేశారు. నిహారిక ‘సూర్యకాంతం’ సినిమాతో గాయనిగా కెరీర్ ప్రారంభించిన హారిక.. RRR, సర్కారు వారి పాట, బింబిసారతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడారు.
దేశంలోని ఎన్నికల్లో ఓటర్లకు తొలుత కేవలం పేరుతో ఉండే స్లిప్పులు ఇచ్చేవారు. ఫొటో గుర్తింపు కార్డులు ఇవ్వడంపై 1957లో ఆలోచన చేశారు. 1960లో కోల్‌కతా నైరుతి పార్లమెంటరీ ఎన్నికలో ప్రయోగాత్మకంగా ఈ ప్రయత్నం చేయగా, విఫలమైంది. 1979లో సిక్కిం ఎన్నికల్లో, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో ఐడెంటిటీ కార్డు ప్రవేశపెట్టారు. 1994లో దేశవ్యాప్తంగా అమలు చేశారు. 1997లో ఓటర్ల జాబితా కంప్యూటరీకరణ మొదలైంది.
<<-se>>#ELECTIONS2024<<>>
AP: గ్రూప్-1(2018) మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని APPSC ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ‘ఈ పరీక్షలను హైకోర్టు రద్దు చేయడంపై అప్పీల్‌కు వెళ్తాం. కమిషన్‌పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో, సరైన వివరణ ఇస్తాం. పరీక్షలు, నియామకాలు పారదర్శకంగా జరిగాయి. CCTV నిఘాలో జరిగిన మూల్యాంకనం ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఈ విషయంలో మాపై మచ్చ పడిందని అనుకోవడం లేదు’ అని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.