news

News March 18, 2024

ALERT: మీ పళ్లు పుచ్చిపోయాయా?

image

పళ్లు పుచ్చిపోయిన వ్యక్తికి గుండెలో నొప్పి రావడంపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఓ వైద్యుడు రిప్లై ఇచ్చారు. ‘గట్టిగా ఏదైనా కొరికినప్పుడు పుచ్చిపళ్లలో ఉన్న బ్యాక్టీరియా సరాసరి రక్తంలోకి వెళ్లి అక్కడి నుంచి గుండెలోకి వెళ్తుంది. గుండె కవాటాల (వాల్వ్స్)లో పుండ్లు పుట్టిస్తుంది. దీంతో జ్వరం, ఛాతినొప్పి వస్తుంది. వెంటనే వైద్యం చేయకపోతే గుండె పాడై చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే అందరిలో ఇలా జరగదు’ అని తెలిపారు.

News March 18, 2024

జీవితం కష్టమైనది: మాజీ క్రికెటర్

image

మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆసుపత్రిలో చేరారు. బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ‘జీవితం కష్టమైనది’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. ‘మీరు త్వరగా కోలుకోవాలి సార్. మీ కామెంట్రీ వినడానికి ఎదురుచూస్తున్నా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ‘అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు’ అంటూ శివరామకృష్ణన్ రిప్లై ఇచ్చారు. ఆయన ఆసుపత్రిలో చేరడానికి గల కారణాలు తెలియరాలేదు.

News March 18, 2024

ప్రియుడి కోసం తండ్రి, తమ్ముడిని చంపేసింది!

image

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి ఓ 15 ఏళ్ల బాలిక తండ్రిని (52), సోదరుడిని (8) చంపేసింది. మొదట బాలికపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇంట్లో సోదా చేయగా ఫ్రిజ్‌లో మృతదేహాలు లభించాయి. ఆమె ఓ 19ఏళ్ల యువకుడితో పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా అతడు గత ఏడాది పోక్సో చట్టం కింద శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదల కావడం గమనార్హం.

News March 18, 2024

BREAKING: చంద్రబాబుకు ఈసీ నోటీసులు

image

AP: YSRCP ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. FB, ట్విటర్, యూట్యూబ్ ద్వారా జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. దీంతో 24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని సీఈవో ఆదేశించారు.

News March 18, 2024

పోలింగ్ బూత్‌ మార్చుకోవచ్చా?

image

ఈ సందేహం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే.. వారు కొన్నిసార్లు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే పోలింగ్ కేంద్రాన్ని మార్చుకునే హక్కు ఓటర్లకు లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. పోలింగ్ స్టేషన్‌ను నిర్ణయించే అధికారం జిల్లా రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు కేటాయించిన కేంద్రంలో మాత్రమే మీరు ఓటు వేయాల్సి ఉంటుంది.

News March 18, 2024

విజయ్ కొత్త లుక్‌

image

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఓ వైపు ఓల్డ్‌ మ్యాన్‌గా, మరోవైపు యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్.. మీసాలు, గడ్డం తీసేసి క్లీన్ షేవ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే దళపతి 68గా వస్తున్న తాజా చిత్రం The GOAT కోసమే విజయ్ లుక్ మార్చినట్లు తెలుస్తోంది.

News March 18, 2024

MI జట్టులోకి కొత్త ప్లేయర్

image

IPL: ముంబై ఇండియన్స్ చివరి నిమిషంలో ఆటగాడిని రీప్లేస్ చేసుకుంది. గాయపడ్డ పేసర్ బెరండార్ఫ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ ల్యూక్ వుడ్‌ను తీసుకుంది. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇంగ్లండ్ తరఫున 2 వన్డేలు, 5 టీ20లు ఆడారు. ఇతడికి రూ.50 లక్షలు చెల్లించి MI దక్కించుకుంది.

News March 18, 2024

తాత్కాలికంగా ప్రజావాణి వాయిదా

image

TS: లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిని వాయిదా వేశారు. ఈ మేరకు ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి సమాచారమిచ్చారు. ప్రజాభవన్‌లో ప్రజావాణి సేవలను తిరిగి జూన్ 7న ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

News March 18, 2024

సోనియా, ప్రియాంకా గాంధీలతో సీఎం రేవంత్ భేటీ

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, ప్రియాంకలతో భేటీ అయ్యారు. ఈ రోజు ముంబై నుంచి నేరుగా హస్తినకు వెళ్లిన సీఎం.. రాహుల్ గాంధీతోనూ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేసిన హామీలపై మాట్లాడినట్లు సమాచారం.

News March 18, 2024

జూనియర్ NTR కొత్త లుక్

image

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ‘దేవర’ సినిమా షూటింగ్ కోసం ఆయన తన ఫిట్‌నెస్ ట్రైనర్‌తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్‌లో తారక్ సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణ ఉండే అవకాశం ఉంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి కొరటాల డైరక్టర్. ఈ సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలో విడుదల కానుంది.