news

News March 18, 2024

BREAKING: ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

image

AP: ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి 20 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని, 25 సభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్నికల బహిరంగసభల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నాయి.

News March 18, 2024

బ్రెజిల్‌లో 62.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత!

image

బ్రెజిల్‌లోని రియోలో రికార్డు స్థాయిలో 62.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తాజాగా నమోదైంది. 2014లో రియో ఉష్ణోగ్రత నమోదు ప్రక్రియ మొదలైన తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఉష్ణోగ్రత 60ల్లో ఉన్నా, ఉక్కబోత కారణంగా 100 డిగ్రీల సెల్సియస్‌లా అనిపిస్తుందని అధికారులు తెలిపారు. అక్కడ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు తరచూ నమోదవుతున్నాయన్నారు. వేడికి తాళలేక రియో వాసులు భారీ సంఖ్యలో బీచ్‌లకు చేరుకుంటున్నారు.

News March 18, 2024

బ్యాంకులకు RBI హెచ్చరిక!

image

సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని పలు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ (CSITE) సమీక్ష నిర్వహించిన అనంతరం RBI ఈ సూచనలు చేసింది. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని RBI డిప్యూటీ గవర్నర్ రవి శంకర్ సైతం ఇటీవల పేర్కొనడం గమనార్హం.

News March 18, 2024

పల్టీలు కొట్టిన ఆర్సీబీ ప్లేయర్

image

ఆర్సీబీ 16 ఏళ్ల కలను నెరవేర్చిన మహిళా ప్లేయర్లు మైదానంలో సంతోషంతో కేరింతలు కొట్టారు. టైటిల్ గెలుపు ఆనందంలో ఆ టీమ్ ఓపెనర్ సోఫీ డివైన్ పల్టీలు కొడుతూ సందడి చేశారు. పలువురు ప్లేయర్లు సెల్ఫీలు తీసుకుంటూ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఇక బెంగళూరులో ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. ‘ఈ సాలా కప్‌ నమదే’ నిజమైందంటూ నినాదాలు చేశారు.

News March 18, 2024

రేపు ‘కంగువ’ టీజర్

image

శివ డైరెక్షన్‌లో సూర్య నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కంగువ’ టీజర్‌ను రేపు సా.4.30 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో 10 భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన హీరో ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

News March 18, 2024

20న కోస్తాంధ్రలో భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు విభిన్న వాతావరణం ఉంటుందని IMD వెల్లడించింది. విపరీతమైన ఎండలు, ఉక్కపోతతోపాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఈ నెల 20న ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

News March 18, 2024

టాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం

image

ఆస్ట్రేలియాలో టాక్సీ డ్రైవర్లకు రూ.1,475 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఉబర్ అంగీకరించింది. దేశ చరిత్రలో ఇది ఐదో అతిపెద్ద సెటిల్‌మెంట్‌గా న్యాయ నిపుణులు వెల్లడించారు. తమ దేశంలోకి ఉబర్ ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ 8వేల మంది టాక్సీ డ్రైవర్లు 2019లో కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఎట్టకేలకు పరిహారం ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించడంతో వివాదానికి తెరపడింది.

News March 18, 2024

ఏప్రిల్ 8న పుష్ప-2 తొలి సింగిల్ రిలీజ్?

image

అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 మూవీ నుంచి తొలి సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐకాన్ స్టార్ బర్త్‌డే రోజున విడుదల చేసిన టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

News March 18, 2024

కడప నుంచి షర్మిల పోటీ?

image

AP: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారట. కడప నుంచి పోటీ చేయాలని ఆమెకు పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలూ ఈసారి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈనెల 25న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని సమాచారం.

News March 18, 2024

‘ఎలక్టోరల్ బాండ్ల’పై డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు

image

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలక్టివ్‌గా ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ పార్టీకి ఎంత ఇచ్చారో తెలిపేలా యునిక్ నంబర్లను ఈసీకి అందజేయాలని ఇవాళ <<12876842>>ఆదేశించిన<<>> సుప్రీంకోర్టు.. ఇందుకోసం డెడ్‌లైన్ విధించింది. కచ్చితంగా ఈ నెల 21న సాయంత్రం 5లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. బాండ్ల విషయంలో ప్రతి సమాచారం బయటకు రావాలని, సందేహాలకు తావుండకూడదని తేల్చిచెప్పింది.