India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐస్‌క్రీమ్‌లో <<13432138>>మనిషి వేలు<<>>, హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్‌లో చనిపోయిన <<13468152>>ఎలుక<<>> వచ్చిన ఘటనలు మరువకముందే మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.
గుజరాత్ అహ్మదాబాద్‌లోని ప్రసిద్ధ దేవి దోస రెస్టారెంట్‌లో సాంబార్ గిన్నెలో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెస్టారెంట్‌ను సీజ్ చేసి మేనేజ్మెంట్‌కు నోటీసులిచ్చారు.
హైదరాబాద్ నగరంలో దాదాపు 3వేల మందికి పైగా యాక్టివ్ బెగ్గర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సిగ్నల్స్ వద్ద, రద్దీ ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ బెగ్గింగ్ మాఫియాను నిర్మూలించాలని నగరవాసులు కోరుతున్నారు. పోలీసులు, GHMC అధికారులు వీరిని గుర్తించి పునరావాసం కల్పించినా వారు అక్కడి నుంచి పారిపోతున్నారట. పసిపిల్లల పట్ల జాలి చూపుతారనే నెపంతో వారిని బెగ్గింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
శరీరంలోని కీలకమైన అవయవాల్లో గుండె ఒకటి. హార్ట్ అటాక్‌ల వల్ల గుండె కండరాలు(కార్డియోమయోసైట్స్) దెబ్బతిన్నప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పటివరకు వీటిని పునరుత్పత్తి చేయడం సాధ్యం కాలేదు. అయితే బైపాస్ సర్జరీ తర్వాత రోగి గుండె కణాల సాయంతో వీటిని రీజనరేట్ చేయొచ్చని తొలిసారి ఆస్ట్రియా సైంటిస్టులు నిరూపించారు. ఇందుకు space hairdryer అనే పరికరాన్ని ఉపయోగించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాలన్నారు.
పేటీఎంలో వేటుకు గురైన పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. ఎలాంటి పరిహారం చెల్లించకుండా తమను తొలగించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. తమ ఉద్యోగాలను సంస్థ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 50 మంది ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.
AP: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా కూటమి తరఫున అయ్యన్న ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇంకెవరూ ఆ పదవి కోసం పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
T20 WC తర్వాత నుంచి వచ్చే ఏడాది FEBలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు భారత్ 20 T20లు, 10 టెస్టులు, 6 వన్డేలు ఆడనుంది. జింబాబ్వేతో 5 T20లు (JULY), లంకతో 3 వన్డేలు, 3 T20లు (JUL, AUG), బంగ్లాతో 2 టెస్టులు, 3 T20లు (AUG, SEP), న్యూజిలాండ్‌తో 3 టెస్టులు (OCT, NOV), సౌతాఫ్రికాతో 4 T20లు (NOV), ఆస్ట్రేలియాతో 5 టెస్టులు (NOV, JAN), ఇంగ్లండ్‌తో 5 T20లు, 3 వన్డేల్లో (JAN, FEB) తలపడనుంది.
TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది. కాగా పంట రుణాల మాఫీకి రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.
AP: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందని వైసీపీ విమర్శించింది. ‘బాపట్లలో యువతిపై పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. రాష్ట్రంలో మహిళలపై అప్పుడే దారుణాలు మొదలయ్యాయి. ఆడబిడ్డలకు మీరు కల్పించే రక్షణ ఇదేనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందీశ్వరి?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది.
లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. 2-3 రోజుల్లో తీర్పు వెలువరిస్తామని, అప్పటి వరకు తీర్పు రిజర్వ్ చేస్తున్నామని తెలిపింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయగా దాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు ఉదయమే స్టే విధించిన హైకోర్టు ఇరుపక్షాల వాదన అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.
నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కుట్రలు, మోసాలతో గెలవడం కంటే యోధునిగా ఓడిపోవడం మేలు అని రాసుకొచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల గురించే ఆమె పోస్టు చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈవీఎంల గురించి చర్చ జరుగుతున్న వేళ పూనమ్ ఇలా స్పందించారని పేర్కొంటున్నారు.
Sorry, no posts matched your criteria.