India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మక్కా వద్ద నెలకొన్న తీవ్ర వేడిగాలులు హజ్ యాత్రికుల్ని బలి తీసుకుంటున్నాయి. ఈ ఏడాది 645మంది యాత్రికులు చనిపోగా వారిలో కనీసం 90మంది భారత ముస్లింలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో కొంతమంది వృద్ధాప్య కారణాలతో కన్నుమూసినవారూ ఉండొచ్చని పేర్కొన్నారు. అనేకమంది భారతీయుల ఆచూకీ గల్లంతైందని వెల్లడించారు. మొత్తంగా ఈ ఏడాది 18 లక్షలమంది యాత్రికులు హజ్ సందర్శించారని స్పష్టం చేశారు.
NEET పేపర్ లీక్ సూత్రధారి అమిత్ ఆనంద్ పరీక్షకు ఒక రోజు ముందే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు అంగీకరించాడు. రూ.30 లక్షలు తీసుకొని ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాలను అభ్యర్థులకు ఇచ్చినట్లు పోలీసుల అంగీకార పత్రంలో వెల్లడించాడు. దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో JE సికందర్‌తో కలిసి నలుగురికి ప్రశ్నాపత్రం ఇచ్చాడట. అతని ఫ్లాట్‌లో జవాబు పత్రం కాలిపోయిన అవశేషాలను పోలీసులు కనుగొన్నారు.
AP: YCP సోషల్ మీడియా వ్యవహారాలకు ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతలను నాగార్జున యాదవ్‌కు జగన్ అప్పగించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం జగన్‌ని కలుస్తూ పార్టీ వ్యవహారాలపై సమీక్షిస్తున్నా.. భార్గవ్ దూరంగా ఉంటున్నారట. YCP హయాంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ విపక్షాలు భార్గవ్‌పై తీవ్ర విమర్శలు చేశాయి.
TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరి ఆల్ఫా హోటల్‌లో పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు ఫుడ్ టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో తేలింది. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ వండి ఫ్రిజ్‌లో పెడుతున్నారని, కస్టమర్లు రాగానే వేడి చేసి ఇస్తున్నారని అధికారులు తెలిపారు. కిచెన్‌లో దారుణమైన వాసన వస్తోందని, నాణ్యతాప్రమాణాలు ఏమాత్రం లేవని వెల్లడించారు. కేసు నమోదు చేసి రూ.లక్ష ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వస్తున్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అనురాగ్ యాదవ్ (22) అనే విద్యార్థి లీకైన పేపర్‌ను బయటపెట్టాడు. అది ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్‌తో సరిపోలిందని అంగీకరించాడు. జూనియర్ ఇంజినీర్ అయిన తన అంకుల్ మే 4న పేపర్ ఇవ్వడంతో ఆ రాత్రికి రాత్రే పూర్తిగా ప్రిపేర్ అయ్యానని నేరాంగీకార పత్రంలో పేర్కొన్నాడు.
AP: రాష్ట్రంలోనే పేరొందిన ఉలవపాడు బంగినపల్లి మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను రూ.90 వేలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో గరిష్ఠ ధర రూ.50 వేలు. ఇటు కవర్ కట్టిన కాయలైతే టన్ను రూ.లక్షపైనే పలుకుతుండగా స్టాక్ ఉండటం లేదు. కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడమే ఇందుకు కారణం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనేందుకు ఎగబడుతున్నారు.
AP: జులై ఒకటో తేదీ నాటికి రూ.10 వేల కోట్లను సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా వృద్ధులు, దివ్యాంగులకు పెంచిన పింఛను ఇవ్వాల్సి ఉంది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి వృద్ధులకు పెంచిన పింఛను బకాయిలు రూ.1000 చొప్పున ఇవ్వాలి. వీటికి రూ.4408.31 కోట్లు అవసరమవుతాయి. ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చేందుకు రూ.5500 కోట్లు కావాలి.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ మెగాస్టార్ చిరంజీవిని ‘విశ్వంభర’ సెట్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. దీనిపై చిరు స్పందిస్తూ.. ‘నా మిత్రుడు దుర్గేశ్ ఏపీ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
AP: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవకు అంకితమైన నాకు ఎల్లవేళలా అండగా నిలిచావు. కష్ట సమయాల్లోనూ చిరునవ్వు చెదరకుండా ధైర్యంగా నాకు తోడుగా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే భువనేశ్వరి. నా సర్వస్వం’ అని పోస్ట్ చేశారు.
AP: వైఎస్ జగన్ అధ్యక్షతన నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన జగన్.. నేడు మరోసారి అందరితో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాలు, రాజకీయ దాడులు, ఈవీఎంలపై చర్చించే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.