India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవకు అంకితమైన నాకు ఎల్లవేళలా అండగా నిలిచావు. కష్ట సమయాల్లోనూ చిరునవ్వు చెదరకుండా ధైర్యంగా నాకు తోడుగా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే భువనేశ్వరి. నా సర్వస్వం’ అని పోస్ట్ చేశారు.
AP: వైఎస్ జగన్ అధ్యక్షతన నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన జగన్.. నేడు మరోసారి అందరితో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాలు, రాజకీయ దాడులు, ఈవీఎంలపై చర్చించే అవకాశం ఉంది.
వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసినా తిరుమలలో రద్దీ మాత్రం సెలవుల స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,584మంది దర్శించుకున్నారు. వారిలో 31,848మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.18 కోట్లు సమకూరింది.
TG: పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
AP: మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఎన్నికలకు ముందు ముద్రగడ సవాల్ విసిరారు. మాట ప్రకారం తాజాగా పేరు మార్చుకున్నారు.
TG: మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో విస్తరణ ఉండొచ్చంటున్నారు. ఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్ చర్చించినట్లు సమాచారం. సీఎంతో పాటు కేబినెట్‌లో ప్రస్తుతం 11మంది మంత్రులున్నారు. ఇప్పటికైతే నలుగురికి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
AP: నేడు రాష్ట్ర సచివాలయంలో 8మంది మంత్రులు తమ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కార్మిక మంత్రిగా వాసంశెట్టి సుభాష్, జలవనరుల మంత్రిగా నిమ్మల రామానాయుడు, పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, దేవాదాయశాఖ మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రిగా సవిత, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ బాధ్యతల్ని చేపట్టనున్నారు.
ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ఏసీల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలోనే ధరలను స్వల్పంగా పెంచిన కంపెనీలు.. తాజాగా మరోసారి 6 నుంచి 8 శాతం వరకు సవరించాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో వోల్టాస్, LG, లాయిడ్ సంస్థలు తమ కెపాసిటీని రెండింతలు చేశాయి. విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏసీ స్టాకులను ఉత్తరాదికి తరలిస్తున్నాయి.
AP: టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఆ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నందున సీఎం చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారుని ఆయనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో నెగ్గారు.
TG: మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసులో డిస్మిస్ అయిన కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ వ్యవహారశైలి మొదటి నుంచే వివాదాస్పదంగా ఉంది. 2022లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతిని లైంగికంగా వేధించాడు. ఎత్తు, కొలతలు చూస్తానంటూ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా అత్యాచారం చేసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి.
Sorry, no posts matched your criteria.