news

News June 19, 2024

దుబాయ్ పోలీసుల పెట్రోలింగ్‌లో సైబర్ ట్రక్

image

టెస్లా తయారు చేసిన సైబర్ ట్రక్‌ను దుబాయ్ పోలీసులు వినియోగిస్తున్నారు. ‘టెస్లాకు చెందిన అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు సైబర్ ట్రక్‌‌ పోలీస్ లగ్జరీ పెట్రోలింగ్ ఫ్లీట్‌లో యాడ్ అయింది’ అని దుబాయ్ పోలీస్ కమాండ్ ట్వీట్ చేసింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు అందించే సెక్యూరిటీలో ఈ సైబర్ ట్రక్‌ను ఉంచారు. ఆ దేశ పోలీసులు హై-ఎండ్ కార్లను వినియోగిస్తారు.

News June 19, 2024

పేలవ ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీలు

image

పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి పేలవ ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 8 రాష్ట్రాల్లో కమిటీలు నియమించింది. ఇందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. కురియన్, రకిబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్‌ తెలంగాణలో ఓటమికి గల కారణాలు తేల్చనున్నారు.

News June 19, 2024

నాటుసారా తాగి 13 మంది మృతి

image

తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగి 13 మంది మరణించారు. మరో 30 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. రోజువారీ కూలీలు కరుణాపురంలో నాటుసారా కొనుగోలు చేసి తాగడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు, దృష్టి లోపం, విరేచనాలు లాంటి లక్షణాలు బయటపడ్డాయి.

News June 19, 2024

సామర్థ్యానికి తగ్గ పదవి ఇచ్చారు: నాగబాబు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తగిన పదవులు, శాఖలు వచ్చాయని జనసేన నేత నాగబాబు అన్నారు. పవన్ సామర్థ్యానికి తగిన పదవి దక్కిందని చెప్పారు. పవన్‌ అన్ని విషయాల్లో అవగాహన ఉన్న వ్యక్తి అని, డిప్యూటీ సీఎంగా చూడడం ఆనందంగా ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

News June 19, 2024

ధరలు పెరిగిన పంటలివే(క్వింటాళ్లలో)

image

వరి ధాన్యం రూ.117 పెరిగి ధర రూ.2,300కి చేరింది. జొన్న (రూ.191 పెరిగి) రూ.3,371, మొక్కజొన్న(రూ.135) రూ.2,225, సజ్జలు(రూ.125) రూ.2,625. రాగి(రూ.444) రూ.4,290, కంది(రూ.550) రూ.7,550, పెసర్లు(రూ.124) రూ.8,682, మినుములు(రూ.450) రూ.7,400, వేరు శనగ(రూ.406) ధర రూ.6,783, సన్ ఫ్లవర్(రూ.520) రూ.7,280, సోయా(రూ.292) రూ.4,892, నువ్వులు(రూ.632) రూ.9,267, ఒడిసలు(రూ.983) రూ.8,717, పత్తి (రూ.501) రూ.7,121.

News June 19, 2024

బేబీ బంప్‌ ఫొటో రివీల్ చేసిన దీపిక

image

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు రివీల్ చేశారు. గత ఫిబ్రవరిలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించిన ఆమె తాజాగా బేబీ బంప్‌తో ఫొటో షూట్‌కు పోజులిచ్చారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. 2018లో వివాహం చేసుకున్న దీపిక, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ వచ్చే సెప్టెంబర్‌లో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు.

News June 19, 2024

‘బేటీ పఢావో.. బేటీ బచావో’ రాయలేకపోయిన కేంద్ర మంత్రి

image

కేంద్ర శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ‘బేటీ పఢావో, బేటీ బచావో’ నినాదాన్ని హిందీలో రాయలేకపోయారు. మధ్యప్రదేశ్‌లోని బ్రహ్మకుండిలో గల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డుపై స్లోగన్‌ను సరిగ్గా రాయలేకపోయారు. అయితే, అఫిడవిట్‌లో ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై విమర్శలొస్తున్నాయి.

News June 19, 2024

APలో IASల బదిలీ

image

*కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
*పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్
*సివిల్ సప్లై కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్
*CRDA కమిషనర్‌గా కాటమనేని భాస్కర్
*ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్
*పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్
*ఉద్యాన, మత్స్య, సహకార కార్యదర్శిగా అహ్మద్ బాబు
*వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్

News June 19, 2024

FLASH: APలో భారీగా IASల బదిలీ

image

ఏపీలో భారీగా IASలు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్‌లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌లను నియమించింది.

News June 19, 2024

21న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు

image

నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీ యూనిట్లతో నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. విద్యార్థులకు న్యాయం అందేలా చేసేందుకే ఆందోళనలకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కాగా నీట్ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.