India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడ నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లో ఆయన క్యాంప్ ఆఫీసు ఉంది. దీంతో ఆ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్.. గౌ॥ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటిసరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు అని నేమ్ బోర్డుపై రాసి ఉంది.
ట్రేడింగ్ సెషన్ ఓపెనింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరు కొనసాగిస్తున్నాయి. ఈరోజు కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. గరిష్ఠంగా 77,581ను తాకిన సెన్సెక్స్ ప్రస్తుతం 160 పాయింట్ల లాభంలో 77,454 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఓ దశలో 23,630 మార్క్ అందుకున్న నిఫ్టీ ప్రస్తుతం 23,587 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో లాభాలు, బడ్జెట్‌పై అంచనాలు మార్కెట్లకు కలిసొచ్చాయి.
ఇవాళ దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు రెండో వన్డే ఆడనుంది. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచులో అన్ని విభాగాల్లో అదరగొట్టి జోరు మీదున్న హర్మన్ సేన అదే ఊపులో సిరీస్‌ను గెలుచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
AP: ఈవీఎంలపై వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని BJP నాయకురాలు సాధినేని యామినీ శర్మ మండిపడ్డారు. 2019లో YCPకి ప్రజలకు 151 సీట్లు కట్టబెట్టినపుడు ఉపయోగించింది ఇవే ఈవీఎంలు అని అన్నారు. అప్పుడు మాత్రం వాటి నిషేధం గురించి మాట్లాడలేదని దుయ్యబట్టారు. అంటే నాటి వైసీపీ విజయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఘోర ఓటమితో YCP భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు.
AP: రాజంపేట, తంబళ్లపల్లిలో TDP ఓటమిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలిచే సీట్లను చేజార్చారంటూ అభ్యర్థులు సుగవాసి సుబ్రహ్మణ్యం, జయచంద్రారెడ్డిలపై మండిపడ్డారు. రాజంపేట TDPకి కంచుకోట అని.. తాను, పవన్, లోకేశ్ వచ్చి ప్రచారం చేసినా ఓటమి చెందామని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పరాజయానికి గల కారణాలను అధినేతకు అభ్యర్థులు వివరించారు. ఇకపై పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని వారికి CBN సూచించారు.
AP: రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్యచౌదరికి శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని బుచ్చయ్యను కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. రేపు బుచ్చయ్యతో ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా సభలో సీనియర్ నేతను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తుంటారు. సీఎం చంద్రబాబు(9 సార్లు) తర్వాత గోరంట్లే అత్యధిక(7) సార్లు నెగ్గిన ఎమ్మెల్యేగా ఉన్నారు.
TG: ఆయిల్‌పామ్, అంతర పంటల రాయితీ డబ్బులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో పాటు సూక్ష్మ సేద్య కంపెనీలకు సైతం రూ.55.36 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్నారు. ఇకపై రైతులకు పంటల సాగు బకాయిలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అటు 2024-25 సంవత్సరానికి నిర్దేశిత ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
AP: వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి పార్టీ నేతలు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.
TG: దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను 41,553 మంది విద్యార్థులకు కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని చెప్పారు. జులై 2వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కాగా తొలి విడతలో 76,290 మందికి సీట్లు దక్కగా 57 వేల మందే ప్రవేశాలు పొందారు.
టీ20 WCలో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన దృష్ట్యా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2024-25 కాలానికి బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కూడా వదులుకున్నారు. కేన్ ఇప్పటికే టెస్టు కెప్టెన్సీకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టీ20 WCలో లీగ్ దశలోనే న్యూజిలాండ్ వెనుదిరగడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.