India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనకు నిర్ణీత సమయంలో వధువును వెతకడంలో కేరళ మ్యాట్రిమొనీ సంస్థ విఫలమైందంటూ ఓ వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 2019 జనవరిలో తాను ఫీజు చెల్లిస్తే నెలలు గడిచినా సంస్థ స్పందించలేదని అతను తెలిపారు. ఫిర్యాదుదారుడికి మ్యాట్రిమొనీ సరైన సేవలు అందించలేదని న్యాయమూర్తి గుర్తించారు. అతను చెల్లించిన రూ.4,100+వడ్డీ, పరిహారంగా రూ.25,000, ఖర్చుల కింద రూ.3,000 ఇవ్వాలని ఆదేశించారు.
AP: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఈవో J శ్యామలారావు తిరుమలలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆలయం, రిసెప్షన్, అన్నప్రసాదం, ఇంజినీరింగ్ విభాగాలను తనిఖీ చేసి సమీక్షించారు. సమాజంతో తిరుమలకు భావోద్వేగ సంబంధం ఉందని ఈవో పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, సరైన సౌకర్యాలు అందించడం మన ప్రాథమిక కర్తవ్యాలు అని సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.
అన్ని తరగతుల సోషల్ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ అని రాయొచ్చని NCERT ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై విమర్శలు రావడంతో సంస్థ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ స్పందించారు. రాజ్యాంగం ప్రకారం రెండింటినీ సందర్భానికి అనుగుణంగా వాడుకోవచ్చని, ప్రస్తుతం దీనిపై చర్చ అనవసరమని స్పష్టం చేశారు. ఆ రెండు పదాల పట్ల తమకు వ్యతిరేక భావన లేదన్నారు.
అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. 2024 డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్న కారణంగా తొలుత ప్రకటించిన ఆగస్టు 15న సినిమా విడుదల చేయలేకపోతున్నామని వివరించింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప1’ సెన్సేషన్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
* మేడ్చల్ DCP – కోటిరెడ్డి
* ఆదిలాబాద్ PTC SP – లిఖితా పంత్
* సికింద్రాబాద్ రైల్వే SP – చందనా దీప్తి
* సెంట్రల్ జోన్ DCP – షేక్ సలీమా
* నార్త్ జోన్ DCP – లక్ష్మీ పెరుమాళ్
* వెస్ట్ జోన్ DCP – రాజమహేంద్రనాయక్
* మంచిర్యాల DCP – భాస్కర్
* శంషాబాద్ DCP – రాజేశ్
* వికారాబాద్ SP – నారాయణరెడ్డి
రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. HYD ట్రాఫిక్ DCPగా రాహుల్ హెగ్డే, జగిత్యాల SPగా అశోక్ కుమార్, సూర్యపేట SPగా సన్‌ప్రీత్ సింగ్, గద్వాల SPగా శ్రీనివాసరావు, MBNRకు SPగా జానకీ ధరావత్, ఆసిఫాబాద్ SPగా డీవీ శ్రీనివాసరావు, బాలనగర్ DCPగా సురేశ్, సైబర్ సెక్యూరిటీ SPగా హర్షవర్ధన్, CID SPగా విశ్వజిత్, ACB జాయింట్ డైరెక్టర్‌గా సాయి చైతన్య ఉంటారు.
AP: రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం, పంచదారతోపాటు కందిపప్పు అందించనున్నట్లు తెలిపింది. ఎంత మొత్తంలో అనేది త్వరలో వెల్లడి కానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం లేదని సమాచారం.
T20WC గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్ జట్టుపై కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జట్టులో ఐక్యత లేదు. అంతా విడిపోయారు. దీన్ని ఎవరూ జట్టు అనరు. నేను చాలా జట్లతో పని చేశాను. ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదు’ అని అన్నారు. ఇదిలా ఉంటే పాలిటిక్స్‌తో నిండిన పాక్‌ను విజేతగా నిలిపేందుకు గ్యారీ కిర్‌స్టెన్ ఏమీ మాంత్రికుడు కాదని ఆ జట్టు మాజీ క్రికెటర్ కనేరియా చెప్పుకొచ్చారు.
AP: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచే అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవులో ఉండటంతో మార్పు చేశారు. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత నూతన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది.
TG: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పక్షనేతగా కేఆర్ సురేశ్ రెడ్డిని నియమిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. కె.కేశవరావు స్థానంలో సురేశ్‌కు అవకాశం ఇచ్చినట్లు రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటూ దక్కలేదు.
Sorry, no posts matched your criteria.