news

News June 17, 2024

రైల్వే మంత్రి తప్పుకోవాలని డిమాండ్!

image

<<13455686>>ప.బెంగాల్‌<<>>లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగించింది. ఇదిలా ఉంటే <<13455953>>వరుస<<>> ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పదవి నుంచి తప్పుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మోదీ చేసిన ట్వీట్‌ కింద కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నితీశ్ కుమార్ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని గుర్తు చేస్తున్నారు.

News June 17, 2024

రబీ కరవు అంచనాకు ఏపీకి కేంద్ర బృందాలు

image

AP: రాష్ట్రంలో రబీ సీజన్‌లో ఏర్పడిన కరవుపై అంచనా కోసం ఏపీకి కేంద్రం నుంచి 3 బృందాలు రానున్నాయి. రేపటి నుంచి శుక్రవారం వరకు ఒక బృందం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు, రెండో టీం కర్నూలు, నంద్యాల జిల్లాలు, మూడోది నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

News June 17, 2024

ఆదాయ వనరుగా ప్లాస్టిక్ వ్యర్థాలు

image

చార్ ధామ్ యాత్ర నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈక్రమంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో అధికారులు ‘యాంటీ వేస్ట్ డ్రైవ్‌‌’లను నిర్వహించారు. 3 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి విక్రయించడం ద్వారా జోషిమఠ్‌ మున్సిపాలిటీకి రూ.1.02 కోట్ల ఆదాయం వచ్చింది. పర్వతాలకు సమస్యగా మారుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

News June 17, 2024

బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన PMO

image

పశ్చిమ బెంగాల్‌‌లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

News June 17, 2024

ఐదు డిమాండ్లు అమలు చేయాలి: హరీశ్ రావు

image

TG: నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100గా ఎంపిక చేయాలి. గ్రూప్-2లో అదనంగా 2వేల పోస్టులు పెంచాలి. పరీక్షల మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలి. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. హామీ మేరకు 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ఈ 5 డిమాండ్లను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు’ అని హరీశ్ స్పష్టం చేశారు.

News June 17, 2024

అణ్వాయుధాలపై పోటాపోటీగా ఖర్చు!

image

అణ్వాయుధాలపై ప్రపంచ దేశాల ఖర్చు 2023లో 13% పెరిగి $91.4 బిలియన్లకు చేరినట్లు ICAN సంస్థ వెల్లడించింది. 2022తో పోలిస్తే ఖర్చు $10.7 బిలియన్లు పెరిగిందని తెలిపింది. US గరిష్ఠంగా $51.5 బిలియన్లు, చైనా $11.9 బిలియన్లు, రష్యా $8.3 బిలియన్లు వెచ్చించాయి. ఇక భారత్ $2.7 బిలియన్లు ఖర్చు చేయగా, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ $1బిలియన్ వెచ్చించింది. కాగా ప్రస్తుతం తొమ్మిది దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి.

News June 17, 2024

అందుకే తీవ్రత తగ్గింది.. లేదంటే..

image

బెంగాల్ న్యూజల్పాయిగుడిలో జరిగిన రైలు <<13455686>>ప్రమాదంలో<<>> 15 మంది మరణించారు. గూడ్స్ రైలు వెనుకనుంచి ఢీకొట్టడంతో కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్ చివరి 2 బోగీలు దెబ్బతిన్నాయి. అయితే వాటిలో ప్రయాణికులు లేరు. ఒకదాంట్లో ప్యాంట్రీ(క్యాంటీన్) ఉండగా మరోదాంట్లో లగేజ్ ఉంది. దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఆ రెండు బోగీల్లోనూ ప్రయాణికులు ఉండి ఉంటే మరణాల సంఖ్య భారీగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

News June 17, 2024

భారీగా పెరిగిన రైలు ప్రమాద మృతులు

image

పశ్చిమ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. తొలుత ఐదుగురు చనిపోగా, ఇప్పుడు మృతుల సంఖ్య 15కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 60 మందికిపైగా ప్రయాణికులకు గాయాలైనట్లు తెలిపారు. అటు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

News June 17, 2024

పోలవరానికి కేంద్రం సహకారం ఎప్పుడూ ఉంటుంది: పురందీశ్వరి

image

AP: పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి నుంచి కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని, ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అన్నారు. ‘బిల్లులు సమర్పించిన వెంటనే కేంద్రం నిధుల్ని విడుదల చేస్తోంది. పోయినసారి వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. గత ప్రభుత్వ హయాంలో పనులు అంగుళం కూడా కదల్లేదు. అమరావతికి నిర్మాణానికీ పూర్తి సహకారం ఉంటుంది’ అని స్పష్టం చేశారు.

News June 17, 2024

రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

image

బెంగాల్ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అక్కడికి బయల్దేరినట్లు చెప్పారు.