India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AI, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ టెక్నాలజీలపై 2 లక్షల మంది భారత విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఒరాకిల్ ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు నైపుణ్యాభివృద్ధి ఆధ్వర్యంలో నాన్ ముదల్వన్ అనే కార్యక్రమం ప్రారంభించింది. ఒరాకిల్ సర్టిఫికెట్‌ను ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా గుర్తిస్తారని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శైలేందర్ తెలిపారు. యువత జ్ఞానాన్ని పెంచడంతోపాటు కంపెనీలు కోరుకునే నైపుణ్యాలనూ అందిస్తామన్నారు.
AP: రాష్ట్ర అప్పులు, వాస్తవ ఆర్థిక పరిస్థితిపై 4 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు ఎంత? ఆ మొత్తాన్ని ఎందుకు కోసం ఖర్చు చేశారు? ఐదేళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లులపై లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి నివేదికలు కోరినట్లు తెలుస్తోంది.
TG: ఉచిత బస్సు సౌకర్యంతో బాలికలు స్కూళ్లకు వెళ్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం రేవంత్ చేసిన <<13438097>>ట్వీట్‌పై<<>> హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ద్వారానే బాలికలు పాఠశాలలకు వెళ్తున్నట్టు సీఎం గొప్పలు చెప్పడం హాస్యాస్పదం. విద్యార్థులకు ఫ్రీ జర్నీ BRS హయాం నుంచే అమల్లో ఉంది. గత ప్రభుత్వ పథకాలను INC నేతలు తమ ఖాతాలో వేసుకోవడం శోచనీయం’ అని ట్వీట్ చేశారు.
వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన <<12851165>>నివేదిక<<>> త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీనిపై సమగ్రంగా చర్చించిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి 100 రోజుల అజెండా సిద్ధం చేసుకోవాలని PM ఎన్నికలకు ముందే అన్ని శాఖలను ఆదేశించారు. దీనికనుగుణంగా జమిలి ఎన్నికలపై న్యాయ శాఖ శాసన విభాగం ప్రణాళిక సిద్ధం చేసింది.
AP: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో అధికారులు రంగంలోకి దిగారు. గతంలో నిర్మించిన భవనాల పరిస్థితి, అవసరమయ్యే ఫర్నీచర్, ఇతర అవసరాలపై నివేదిక రూపొందిస్తున్నారు.
ప్రపంచ అస్థిరతకు దక్షిణార్ధ దేశాలు బలవుతున్నాయంటూ ఇటలీలో జరుగుతున్న జీ-7 సదస్సులో ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దక్షిణార్ధ దేశాలను మేం మా ప్రాధాన్యాలుగా మార్చుకున్నాం. ఈ క్రమంలోనే మా నేతృత్వంలోని జీ-20 సందర్భంగా ఆఫ్రికా దేశాలను శాశ్వత సభ్యదేశాలుగా చేశాం. ఆ దేశాల ఆర్థిక, సామాజిక ప్రగతికి, స్థిరత్వానికి భారత్ కృషి చేస్తోంది. మెరుగైన భవిష్యత్తుకోసం పనిచేస్తోంది’ అని తెలిపారు.
దేశంలో రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా మహీంద్రా అండ్ మహీంద్రా నిలిచింది. మార్కెట్ విలువ పరంగా టాటా మోటార్స్(₹3.29L cr)ను వెనక్కు నెట్టింది. మారుతీ సుజుకీ ఇండియా(₹4.04L cr) మొదటి స్థానంలో ఉండగా, మహీంద్రా (₹3.63L cr) సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది మహీంద్రా స్టాక్ 65% పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఏడాదిలోనే ₹2L cr పెరిగింది.
✒ A stitch in time saves nine
Meaning: It is better to deal with problems immediately than letting them become bigger
✒ As you sow, so you shall reap
Meaning: Your actions determine your results
✒ The grass is always greener on the other side
Meaning: Other people always seem to be in a better situation, although it might not be true
డ్రగ్స్ రవాణాపై కంబోడియా ఉక్కుపాదం మోపుతోంది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో పట్టుబడిన రూ.584 కోట్ల విలువైన 7 టన్నుల మాదక ద్రవ్యాలను ఇటుక బట్టీలో ఉంచి ఒకే రోజు అధికారులు కాల్చేశారు. ఈ ఏడాది మే వరకు 3,800కు పైగా డ్రగ్స్ సంబంధిత కేసులను నమోదు చేసి, దాదాపు 10వేల మందిని అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. కాగా మనదేశంలోనూ పలుమార్లు రూ.వందల కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు నాశనం చేశారు.
వశిష్ఠ-చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచింది. సినిమాలో కునాల్ పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా నటిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.