news

News June 14, 2024

కంగ్రాట్స్.. పవన్ కళ్యాణ్‌: సీఎం చంద్రబాబు

image

AP: డిప్యూటీ సీఎంగా నియమితులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కంగ్రాట్స్ చెప్పారు. ‘మంత్రివర్గంలో వివిధ శాఖలు పొందిన నా సహచరులందరికీ అభినందనలు. అందరం రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలనకు నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మీరు కృషి చేస్తారనే నమ్మకం నాకుంది. నూతన ప్రయాణంలో మరోసారి అందరికీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్వీట్ చేశారు.

News June 14, 2024

అంకితభావంతో సేవ చేస్తా: మంత్రి సత్యకుమార్ యాదవ్

image

AP: రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక శాఖలు దక్కడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం&వైద్య విద్య శాఖలు నాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ పెద్దలు, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞుడను. ప్రజలకు అంకితభావంతో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నా. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తా’ అని ట్వీట్ చేశారు.

News June 14, 2024

సరికొత్త గరిష్ఠాలను తాకిన నిఫ్టీ

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఓ దశలో 23,490కి చేరి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన నిఫ్టీ, మార్కెట్ ముగిసే సమయానికి 66 పాయింట్ల లాభంతో 23,465 వద్ద స్థిరపడింది. మరోవైపు సెన్సెక్స్ సైతం 77వేల మార్క్ చేరుకుని 181 పాయింట్ల లాభంతో 76,992 వద్ద క్లోజ్ అయింది. కాగా నిఫ్టీ మిడ్‌క్యాప్ సైతం 55,262 పాయింట్లు చేరి జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

News June 14, 2024

ఇటలీలో మోదీకి భోజనం అందించే హోటల్ ఇదే!

image

జీ7 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి బారీలో ఉన్న ‘నమస్తే ఇండియా’ రెస్టారెంట్ ఆయనకు ఆహారాన్ని ఏర్పాటు చేయనుంది. నోరూరించే భారత వంటకాలకు ఈ హోటల్ ప్రసిద్ధి. శాకాహార భోజన తయారీలోనూ మంచి పేరుండటంతో, మోదీకి భోజనాన్ని అందించే బాధ్యతల్ని దీనికి అప్పగించినట్లు తెలుస్తోంది.

News June 14, 2024

గతంలో ఐదుగురు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే

image

AP డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండనున్నారు. పవన్ గౌరవం తగ్గించకూడదనే ఉద్దేశంతో మరెవరికీ ఈ పదవిని చంద్రబాబు కేటాయించలేదు. జగన్ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండగా, ఈ సారి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు జనసేనానికి దక్కాయి.

News June 14, 2024

త్వరలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ?

image

ఐపీఓకు అనుమతి కోరుతూ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నేడు సెబీకి డ్రాఫ్ట్ ఫైల్ చేసింది. ఈ ఐపీఓతో రూ.7వేల కోట్లు సమీకరించాలని సంస్థ భావిస్తోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.4వేల కోట్లు, మాతృ సంస్థ అయిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ.3వేల కోట్ల షేర్లు విక్రయించనున్నాయి. సెబీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈ ఐపీఓ అందుబాటులోకి రానుంది. కాగా షేర్ కొనుగోలు ధరను సంస్థ వెల్లడించాల్సి ఉంది.

News June 14, 2024

కాసేపట్లో ICET ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా..

image

తెలంగాణ ఐసెట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ICET అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను ఒక్క క్లిక్‌తో సులభంగా షేర్ చేసుకోవచ్చు.

News June 14, 2024

ప‌య్యావులకు పెద్ద పీట‌

image

AP: తొలిసారి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ఆర్థికశాఖను కేటాయించారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఐదేళ్లూ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌(పీఏసీ)గా విధులు నిర్వర్తించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ పలు సందర్భాల్లో ఆధారాలను బయటపెట్టారు. అంతేగాక మంచి వాగ్దాటి, సబ్జెక్టుపై పట్టున్న నేతగా గుర్తింపు పొందారు.

News June 14, 2024

ఐపీఓ ఫైలింగ్‌కు హ్యుందాయ్ రెడీ

image

ఐపీఓను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్న హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ నేడు సెబీకి డ్రాఫ్ట్ సమర్పించనుంది. ఈ ఐపీఓతో $3 బిలియన్లు సమకూర్చుకోవాలని, సంస్థ విలువను $20 బిలియన్లకు పెంచాలని ప్లాన్ చేస్తోంది. 140 నుంచి 150 మిలియన్ షేర్లు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ ప్లాన్స్ సక్సెస్ అయితే ఇది దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.

News June 14, 2024

బీజేపీకి కొత్త చీఫ్‌.. మహిళనే నియమిస్తారా?

image

తమ పార్టీకి తొలిసారి ఓ మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమించుకోవాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మాజీ మంత్రి స్మృతి ఇరానీని అధ్యక్షురాలిగా నియమించేందుకు అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వసుంధర రాజే సింథియా, దగ్గుబాటి పురందీశ్వరి పేర్లను కూడా పరిశీలిస్తుందట. కాగా బీజేపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టకపోవడం గమనార్హం.