India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన 82.82 లక్షల దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
APలో పెన్షన్ల పెంపుపై సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ జీవో విడుదల చేశారు. ఇక నుంచి వృద్ధులు, వితంతువులు, మత్స్యకారులు, తదితరులకు నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ అందనుంది. పెరిగిన పెన్షన్లను APR నుంచే ఇస్తామని గతంలో CBN చెప్పగా.. జులై 1న రూ.7వేల పెన్షన్ అందనుంది. అంటే APR, మే, జూన్ నెలల అరియర్స్ రూ.3వేలు వస్తాయి.
టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో సూపర్-8కు దూసుకెళ్లింది. ఇందులో భాగంగా ఈ నెల 20న గ్రూప్ Cలోని అఫ్గానిస్థాన్, 22న గ్రూప్ Dలోని బంగ్లాదేశ్‌తో ఇండియా మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఉంది. అలాగే 24న గ్రూప్ Bలోని ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఏవైనా అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఇదే జట్లతో భారత్ సూపర్-8 మ్యాచులు ఆడనుంది. కాగా రేపు ఫ్లోరిడాలో కెనడాతో టీమ్ ఇండియా చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
టీ20 WCలో అఫ్గానిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్లను 100 పరుగుల్లోపే ఆలౌట్ చేశారు. వీరి ధాటికి ఉగాండా 58, న్యూజిలాండ్ 75, పపువా న్యూ గినియా 95 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. ఫారూఖీ 3 మ్యాచుల్లో 12 వికెట్లతో టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నారు. రషీద్‌ఖాన్ 6 వికెట్లు పడగొట్టారు.
*ఆరోగ్యంగా ఉన్న 18-60 ఏళ్లలోపు వారు రక్తదానానికి అర్హులు.
*హెపటైటిస్ B, C, HIV, హై బీపీ ఉన్నవారు చేయొద్దు.
*స్మోకింగ్ చేసే వారు కూడా చేయొచ్చు.
*డయాబెటిస్‌కు ఇన్సులిన్ తీసుకుంటున్న వారు చేయకూడదు.
*ఆరోగ్యవంతులైన పురుషులు ప్రతి 3 నెలలకోసారి, ఆరోగ్యవంతమైన మహిళలు ప్రతి 4 నెలలకోసారి చేయొచ్చు.
* ఏ రకమైన క్యాన్సర్ ఉన్నా రక్తదానానికి అనర్హులు.
>>నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించడంతో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. KNR, PDPL, BPL, NLG, SPT, MHBD, WGL, HMK, SDPT, BNR, RR, HYD, VKD, SND, MDK, ములుగు, జనగామ జిల్లాల్లో రేపు ఉదయం వరకు వర్షాలు పడతాయని తెలిపింది. అటు APలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికలను అడ్డుకునే లక్ష్యంతోనే జమ్మూలో ఉగ్రదాడులు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పాక్ ఆగడాలకు చెక్ పడడంతోనే టెర్రరిస్టులు జమ్మూపై దృష్టి పెట్టారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్‌లో ఉన్నంత ఇంటెలిజెన్స్, భద్రత జమ్మూలో లేదని, అందుకే టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, దాడులు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు .
AP: వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది. 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.
వయనాడ్, రాయ్‌బరేలి నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉంది. దీంతో అక్కడి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘మా ప్రియమైన పెద్దన్న రాహుల్ గాంధీ. మమ్మల్ని వదిలి వెళ్లకండి. కచ్చితంగా వెళ్లాల్సి వస్తే.. మీ సోదరి ప్రియాంకాగాంధీని మమ్మల్ని చూసుకోమని చెప్పండి’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.
TG: సింగరేణి కార్మికులు, ఉద్యోగుల గృహ రుణాల వడ్డీ రాయితీపై యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఇంటి నిర్మాణం ప్రారంభించిన/ కొనుగోలు చేసిన ఏడాదిలో బ్యాంకు రుణం పొందితేనే రాయితీని ఇచ్చేది. ఇప్పుడా కాలపరిమితిని ఎత్తేసింది. అలాగే ప్రస్తుతం 8.33% కన్నా తక్కువ వడ్డీకి రుణం తీసుకున్నవారికి మాత్రమే 6-7% రాయితీ ఇస్తుండగా, ఇకపై 8.3% వరకు వర్తింపజేయనుంది. ఈ నిర్ణయంతో 4వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.
Sorry, no posts matched your criteria.