news

News June 12, 2024

దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

image

దేశంలోని రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 12 నెలల కనిష్ఠానికి తగ్గి 4.75శాతంగా నమోదైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.28%, అర్బన్ ఏరియాల్లో 4.15%గా ఉంది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఇన్‌ఫ్లేషన్ ఏప్రిల్‌లో 4.83%గా రికార్డ్ అయింది. కొన్ని నెలలుగా ఆందోళన కలిగిస్తున్న ఆహార ద్రవ్యోల్బణమూ మే నెలలో 8.75 నుంచి 8.62%కు చేరి ఊరట కలిగించింది. అయితే 2023 మేలో రికార్డ్ అయిన 3.3% కంటే ఇది ఎక్కువే.

News June 12, 2024

T20WC: టాస్ గెలిచిన భారత్

image

అమెరికాతో మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: రోహిత్ శర్మ (C), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్, జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్.
USA: స్టీవెన్ టేలర్, జహంగీర్, గౌస్, ఆరోన్ జోన్స్ (C), నితీశ్ కుమార్, అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, జస్దీప్ సింగ్, నేత్రావల్కర్, అలీ ఖాన్.

News June 12, 2024

తొలి గెలుపుతోనే మంత్రివర్గంలో చోటు

image

AP: పెనుగొండ MLA ఎస్.సవిత. పూర్తి పేరు సంజీవరెడ్డిగారి సవిత. ఆమె టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారి MLAగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి ఉషశ్రీ చరణ్‌ను ఆమె ఓడించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన సవిత అనూహ్యంగా బీసీ మహిళ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆమె 2015 నుంచి TDPలో క్రియాశీల సభ్యురాలిగా ఉన్నారు. గత TDP ప్రభుత్వంలో AP కురుబ సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు.

News June 12, 2024

ఈ మ్యాచ్‌లో భారత్‌కే పాకిస్థాన్ సపోర్ట్?

image

T20WCలో భాగంగా మరికాసేపట్లో ఇండియా, USA మ్యాచ్ జరగనుంది. ఇందులో విజేత సూపర్8కు చేరుతుంది. ఓడిన జట్టు మరో మ్యాచ్‌ ఆడి గెలిస్తే సూపర్8కు వెళుతుంది. లేకపోతే పాకిస్థాన్‌కు ఛాన్స్ వస్తుంది. అయితే పాక్ ఐర్లాండ్‌పై గెలవాలి. కాగా భారత్‌ కంటే USA బలహీనమైంది కావడంతో ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓడి, తర్వాతి మ్యాచ్‌లోనూ ఓడాలని పాక్ కోరుకునే ఛాన్స్ ఉంది. అలా జరిగితే PAKకు సూపర్8 అవకాశం ఉంటుంది.

News June 12, 2024

ఆగస్టు 15న ‘తంగలాన్’ రిలీజ్!

image

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, డైరెక్టర్ రంజిత్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘తంగలాన్’ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదట జూన్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేద్దామని భావించగా షూటింగ్ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ విడుదల వాయిదా పడనుందని వార్తలు రావడంతో ఆ తేదీలో వచ్చేందుకు ‘తంగలాన్’ సిద్ధమైనట్లు సమాచారం.

News June 12, 2024

శాఖల వారీగా శ్వేతపత్రాలు: చంద్రబాబు

image

AP: జగన్ నాశనం చేసిన వ్యవస్థలను మనం బాగుచేయాలని మంత్రులతో భేటీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర పునర్మిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం’ అని సూచించారు.

News June 12, 2024

‘దోస్త్’ కౌన్సెలింగ్ గడువు పెంపు

image

డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే ‘దోస్త్’ కౌన్సెలింగ్ గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలి విడత సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు జూన్ 12 నుంచి 15కి, రెండో విడత రిజిస్ట్రేషన్ జూన్ 13 నుంచి 15కి, వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు జూన్ 14 నుంచి 15కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే <<13393164>>తొలి<<>> విడత సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.

News June 12, 2024

రేపటిలోగా శాఖలు కేటాయిస్తా: చంద్రబాబు

image

AP: పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గతంలో తాను సీఎం(2014-19)గా ఉన్నప్పటి పరిస్థితి, ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మంత్రులకు ఆయన వివరించారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్థత మేరకు రేపటిలోగా శాఖలు కేటాయిస్తా అని బాబు స్పష్టం చేశారు. ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అని చెప్పారు.

News June 12, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ నిరాకరణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వాళ్లను విచారించాల్సి ఉందని, బెయిల్ ఇవ్వొద్దన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. వారి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం వారు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

News June 12, 2024

చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ప్రమాణం.. హైలైట్ ఫొటోలు

image

AP CMగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై మోదీ-చిరంజీవి-పవన్ అభివాదం, మోదీ-చంద్రబాబు-పవన్ సంభాషణ, మోదీని చంద్రబాబు ఆత్మీయంగా హత్తుకోవడం, సోదరుడు పవన్‌ను చూసి చిరంజీవి ఆనందంతో ఉప్పొంగడం, అమిత్‌షా-బాలయ్య-రజనీకాంత్ ముచ్చట్లు, చిరంజీవి-బాలకృష్ణ స్టేజ్‌పై కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.