news

News June 12, 2024

పాండ్య విఫలమైతే జట్టుపై ప్రభావం పడేది: బౌలింగ్ కోచ్

image

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విఫలమైతే జట్టుపై ప్రభావం పడేదని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నారు. హార్దిక్ బౌలింగ్ సత్తాపై ఎలాంటి అనుమానాలు లేవని, ఎప్పుడూ నమ్మకంతోనే ఉన్నామని చెప్పారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఈ ఆల్‌రౌండర్ రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచులు గెలిచిన భారత్ ఇవాళ అమెరికాతో తలపడనుంది.

News June 12, 2024

చిరంజీవిని హత్తుకున్న సీఎం చంద్రబాబు(PHOTOS)

image

AP: తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు వీడ్కోలు పలికారు. స్వయంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన CBN మెగాస్టార్‌ను ప్రేమగా హత్తుకున్నారు. అనంతరం రామ్‌చరణ్, చిరంజీవి సతీమణి సురేఖలతో కాసేపు ముచ్చటించారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు CM ధన్యవాదాలు తెలిపారు.

News June 12, 2024

ధర్మవరం ప్రజలకు రుణపడి ఉంటా: సత్యకుమార్ యాదవ్

image

AP: బీజేపీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ‘ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రిగా అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, అమిత్ ​షా, జేపీ నడ్డా, సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, నన్ను ఆదరించిన ధర్మవరం ప్రజలకు రుణపడి ఉంటా. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని ట్వీట్ చేశారు.

News June 12, 2024

సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర

image

AP: సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

News June 12, 2024

కువైట్ అగ్నిప్రమాదంపై స్పందించిన జైశంకర్

image

కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారని, 50 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. ‘ప్రమాద స్థలానికి భారత రాయబారి వెళ్లారు. మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ ఎంబసీ సహాయం చేస్తుంది’ అని X వేదికగా తెలియజేశారు.

News June 12, 2024

టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం

image

TG: టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల టెట్-2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ టెట్ <<13426430>>ఫలితాలు<<>> వెలువడిన సంగతి తెలిసిందే.

News June 12, 2024

ఇప్పటికైనా విభజన హామీలు నెరవేరుస్తారా?: జైరాం రమేశ్

image

ఏపీ విభజన హామీల అమలుపై ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘APకి ప్రత్యేక హోదాను అందిస్తారా? పోలవరం పెండింగ్ నిధులు విడుదల చేస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తారా? కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌, కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టు, వ్యవసాయ విద్యాలయం వంటి వాటిని ఇప్పటికైనా మంజూరు చేస్తారా?’ అని ప్రశ్నించారు.

News June 12, 2024

తొలి రోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్

image

తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. అయితే స్కూళ్లు తెరుచుకున్న తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత యూనిఫామ్స్, పుస్తకాలు అందజేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు స్వయంగా యూనిఫామ్స్, పుస్తకాలు అందించారు.

News June 12, 2024

ఆధార్-రేషన్ అనుసంధాన గడువు పెంపు

image

ఆధార్-రేషన్ కార్డు అనుసంధాన గడువును కేంద్రం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. జూన్ 30తో గడువు ముగియనుండగా మరో 3 నెలలు పొడిగించింది. రేషన్ కార్డుల దుర్వినియోగం నేపథ్యంలో అవకతవకలు అరికట్టేందుకు కేంద్రం ఈ విధానం తీసుకొచ్చింది. ఇంకా లింక్ చేయని వారు సమీప రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో చేసుకోవచ్చు. ఆధార్, రేషన్ కార్డుతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.

News June 12, 2024

YCP మాజీ నేతలిద్దరికి మంత్రి పదవులు

image

AP: ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో ఇద్దరు నేతలు మాత్రమే చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. కొలుసు పార్థసారథి (నూజివీడు), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు) మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), వసంత వెంకటకృష్ణప్రసాద్ (మైలవరం), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), గుమ్మనూరి జయరాం(గుంతకల్లు)కు అవకాశం దక్కలేదు.