news

News June 11, 2024

బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ

image

T20WCలో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత 20 ఓవర్లలో 113/6 స్కోరు మాత్రమే చేసిన ప్రొటీస్ టీమ్.. తర్వాత బంగ్లాదేశ్‌ను 109/7 స్కోరుకే కట్టడి చేసింది. చివరి ఓవర్‌లో బంగ్లా 11 రన్స్ చేయాల్సి ఉండగా, స్పిన్నర్ మహరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 6 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి జట్టుకు అపురూప విజయాన్ని అందించారు.

News June 10, 2024

ప్రేయసితో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ వివాహం

image

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియెల్ వ్యాట్ తన ప్రేయసి జార్జి హోడ్జ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. సుదీర్ఘ కాలం నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జోడీకి భారత మహిళా క్రికెటర్ షఫాలీ, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ వాన్ అభినందనలు తెలియజేశారు. గతంలో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు నాట్ స్కీవర్, కేథరిన్ బ్రంట్ కూడా పెళ్లి చేసుకున్నారు.

News June 10, 2024

రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం

image

APలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ హిందూపురంలో ప్రారంభమైంది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా రూ.5కే ఆహారం అందించే ఈ క్యాంటీన్‌ను స్థానిక MLA నందమూరి బాలకృష్ణ పున:ప్రారంభించారు. NBK స్వయంగా వడ్డించి వృద్ధులకు ఆహారం తినిపించారు. తాము అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ ప్రకటించింది. ఆ దిశగా ఇవాళ తొలి అడుగు పడటంతో మిగతా చోట్ల కూడా త్వరలోనే ప్రారంభమయ్యే ఛాన్సుంది.

News June 10, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్‌చరణ్?

image

ఈ నెల 12న ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారట. ఇప్పటికే ప్రభుత్వం నుంచి చెర్రీకి ఆహ్వానం కూడా వెళ్లిందట. విజయవాడ కేసరపల్లి IT పార్క్ సమీపంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. దీంతో చంద్రబాబు, చెర్రీ ఫొటోలను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

News June 10, 2024

నటి మృతి.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని తల్లిదండ్రులు

image

బాలీవుడ్ నటి నూర్ మాలాబికా దాస్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు రాలేదు. వారిది అస్సాం కాగా ఇటీవల నూర్‌ను చూసేందుకు ముంబై వచ్చి తిరిగి వెళ్లారట. వృద్ధాప్య దశలో ఉన్న తాము మృతదేహం కోసం మళ్లీ రాలేమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నూర్ స్నేహితుడు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అంత్యక్రియలు జరిపించారు.

News June 10, 2024

ALERT: వర్షంలో వాహనాలు నడుపుతున్నారా?

image

వర్షాకాలం ప్రారంభమవడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ డీజీపీ X వేదికగా అవగాహన కల్పిస్తున్నారు.
– వాహనాల టైర్ల గ్రిప్/ థ్రెడ్ బాలేకపోతే వెంటనే మార్చుకోండి
– వాహన టైర్లలోని గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి
– వర్షం పడే సమయంలో పరిమిత వేగంతో వెళ్లడం మంచిది
– బ్రేక్ ప్యాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ చెక్ చేయించండి.
– వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్ ఉంచుకోండి

News June 10, 2024

స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్ను?(2/2)

image

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పార్టీలు సభాపతి స్థానాన్ని ఆశిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా స్పీకర్ సభలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. గతంలో స్పీకర్‌గా ఎన్నికైన నీలం సంజీవరెడ్డి పారదర్శకంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు జరగలేదు. అయితే మిత్రపక్షాలకు సభాపతి పదవిని BJP కట్టబెడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

News June 10, 2024

స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్ను?(1/2)

image

NDA ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న TDP, జేడీయూ పార్టీలు స్పీకర్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. CBN, నితీశ్ ఇద్దరూ ఈ పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో ఏదైనా తిరుగుబాటు తలెత్తితే స్పీకర్ పదవి కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యులపై వేటు వేసే శక్తివంతమైన హక్కు ఆ పదవికి ఉంటుంది.

News June 10, 2024

రాష్ట్రాలకు పన్నులు పంపిణీ చేసిన కేంద్రం

image

రూ.1,39,750 కోట్ల పన్నులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అత్యధికంగా UPకి ₹25,066.88 కోట్లు, బిహార్‌కు ₹14056.12 కోట్లు, మధ్యప్రదేశ్‌కు ₹10,970.44కోట్లు, ప.బెంగాల్‌కు ₹10,513.46 కోట్లు విడుదలయ్యాయి. ఇక ఏపీకి ₹5655.72 కోట్లు విడుదలవగా, తెలంగాణకు రూ.2937.58 కోట్లు మంజూరయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

News June 10, 2024

డీజీపీ కార్యాలయానికి చేరిన సిట్ నివేదిక

image

AP ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై 264 పేజీలతో కూడిన పూర్తి నివేదికను డీజీపీకి సిట్ సమర్పించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 37 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 6 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. నిందితుల్ని ప్రశ్నించకపోవడం, సరైన సెక్షన్లు నమోదు చేయకపోవడం వంటి అంశాల్లో పల్నాడు జిల్లా పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని అభిప్రాయపడింది.