India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోద్రేజ్ కన్స్యూమర్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ నిసాబా <<13156804>>గోద్రేజ్<<>> వీఐపీ ఇండస్ట్రీస్ స్వతంత్ర డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 3నుంచే తన రాజీనామా అమల్లోకి వచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. నాయకత్వ బాధ్యతలు, వారసత్వ ప్రణాళికపై భిన్నాభిప్రాయాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీఐపీ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా దిలీప్ పిరమల్ ఉన్నారు. దీని మార్కెట్ విలువ రూ.6,900 కోట్లుగా ఉంది.
AP: వాలంటీర్ వ్యవస్థలో కీలక మార్పులు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వాలంటీర్ ఉన్నత వర్గాలు తెలిపాయి. దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఫేక్ వార్తలను నమ్మకండని సూచించాయి. కాగా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణతను ప్రామాణికంగా తీసుకొని 1994 నుంచి 2003 వరకు వయోపరిమితిగా నిర్ణయించనున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ సోషల్ మీడియాలో ఓ క్యూట్ ఫొటో షేర్ చేశారు. రోహిత్ 2007 T20 వరల్డ్ కప్ నాటి ఫొటో, 2024 WC ఫొటో కలిపి ఆమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 WC తొలి మ్యాచ్‌లో రోహిత్ హాఫ్ సెంచరీ చేయడంతో ఆమె ఈ పిక్ షేర్ చేశారు. కాగా రోహిత్ తల్లి పూర్ణిమ విశాఖపట్నానికి చెందినవారే. తండ్రి గురునాథ్ శర్మ మహారాష్ట్రకు చెందినవ్యక్తి.
AP: ఈ నెల 11న టీడీపీ శాసన సభ్యులు సమావేశం కానున్నారు. పార్టీ చీఫ్ చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. మరుసటి రోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
AP: అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో స్టేజీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అధికారంలోకి వస్తే ప్రమాణస్వీకారం అమరావతిలోనే చేస్తానని చంద్రబాబు గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే.
కరణ్ అన్షుమాన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ సీజన్ గురించి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా, సీజన్ 2 &3లను నెట్‌ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వెంకీ ‘రానా నాయుడు’ సీజన్-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాబోయే కాలమంతా తనకు గడ్డు కాలమేనని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తప్ప ఇతర విషయాల్లో తనకు అవగాహన లేదని మీడియాతో చెప్పారు. కుటుంబ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోలేదని, కష్టాలను ఎలా అధిగమించాలో తెలియడం లేదన్నారు. కాగా బెంగాల్‌లోని బర్హంపూర్ నియోజకవర్గంలో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో అధీర్ ఓడిపోయారు.
T20WCలో ఉగాండా బౌలర్ ఫ్రాంక్ ఎన్‌సుబుగా సంచలనం సృష్టించారు. 43 ఏళ్ల ఈ బౌలర్ పపువా న్యూగినియాతో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 4 పరుగులే ఇచ్చారు. అందులో రెండు వికెట్లు, 20 డాట్ బాల్స్ ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ఎకానమీ (1.00). ఇదివరకు సౌతాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ పేరిట ఉన్న అత్యుత్తమ ఎకానమీ(2.25) రికార్డును ఫ్రాంక్ బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్‌లో ఉగాండా గెలుపొందింది.
YCP కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తోందన్న వైఎస్ జగన్ ట్వీట్‌పై టీడీపీ మండిపడింది. ‘నువ్వు మారవు.. నీ రాజకీయ బతుకే ఫేక్‌తో ముడిపడి ఉంది. దాడులు చేయాలనే ఆలోచనే మాకు ఉంటే నువ్వు ఈ ట్వీట్ కూడా పెట్టేవాడివి కాదు. మీ నేతలు రాష్ట్రాలు, దేశాలు దాటి పారిపోయేవారు కాదు. ఇప్పటికైనా నీ నీలి మందతో, నీలి వేషాలు వేయకుండా హుందాగా రాజకీయం చేయి. లేకపోతే ఆ పులివెందులను కూడా ప్రజలు మిగల్చరు’ అని రిప్లై ఇచ్చింది.
ఎన్నికలకు ముందు మణిపుర్, అయోధ్య, సందేశ్‌ఖాలీ యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం BJPకి మైలేజ్ ఇస్తుందని విశ్లేషణలూ వినిపించాయి. అయితే ఫలితం దానికి విరుద్ధంగా వచ్చింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ స్థానంలో BJPకి పరాభవం ఎదురైంది. బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో <<12759465>>బాధితులకు<<>> అండగా ఉంటామన్నా BJPని ప్రజలు విశ్వసించలేదు. తమను మోదీ విస్మరించారని <11204670>>మణిపుర్<<>> సైతం తిరస్కరించింది.
Sorry, no posts matched your criteria.