India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరవు భత్యం(DA) చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. వేతన సవరణ తర్వాత ఉండే మూలవేతనంపై DAని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు. ఇటీవల HRAలో కోత <<12870113>>విధించడంతో<<>> జీతం తగ్గి నిరాశలో ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు ఊరట లభించింది. త్వరలోనే డీఏపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,438 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై వచ్చే నెల 8 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ ప్రారంభించనుంది. తెలంగాణ విజ్ఞప్తితో నీటి పునఃపంపిణీకి ట్రైబ్యునల్ గత ఏడాది విధివిధానాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. పరీవాహక ప్రమాణాలను అనుసరించి తమకు 789 TMCలు లేదా కనీసం 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 555 TMCలు ఇవ్వాలని తెలంగాణ SOC(స్టేట్‌మెంట్ ఆఫ్ కేస్) సమర్పించింది. ఏపీ వారంలో SOC దాఖలు చేయనుంది.
ముంబైపై నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలుపొందింది. ఛేజింగ్‌కి దిగిన ముంబై ఒక దశలో గెలుస్తున్నట్లే కనిపించినా, గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా తమ బౌలర్లకు సూచనలిస్తూ గెలుపువైపు నడిపించారు. చివరికి జీటీయే గెలిచింది. దీంతో ఆ జట్టు ఇన్నాళ్లుగా సాధిస్తున్న విజయాల వెనుక ఉన్నది నెహ్రాయే అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. కేవలం పెన్ను, పేపర్‌తో నెహ్రా అద్భుతాలు సాధిస్తున్నారంటూ కితాబిస్తున్నారు.
TS: ఖమ్మం బీజేపీ ఎంపీ టికెట్ జలగం వెంకట్రావుకు దక్కుతుందని భావించినా.. అనూహ్యంగా తాండ్ర వినోద్ రావుకు అదృష్టం వరించింది. వినోద్ స్వస్థలం భద్రాద్రి జిల్లా ములకలపల్లి మం. తిమ్మంపేట. ఈయన తాత సుదర్శన్ రావు భద్రాచలం రామాలయం ట్రస్టీగా ఉండేవారు. వినోద్ 20 ఏళ్లుగా HYDలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈటల సన్నిహితుడైన ఈయన.. గత నెలలోనే బీజేపీలో చేరారు. ఈటల అండతోనే టికెట్ దక్కినట్లు సమాచారం.
LSG.. RCBని రెచ్చగొడుతూ పోస్ట్ పెట్టింది. పాయింట్స్ టేబుల్‌లో ఆర్సీబీ 9, LSG 10వ స్థానంలో ఉండటంపై ‘ఈ రాత్రి మా బెస్ట్ ఫ్రెండ్స్‌తో హాయిగా గడిపాను’ అని ట్వీట్ చేసింది. దీనికి పాయింట్స్ టేబుల్ క్లిప్పింగ్‌ను జత చేసింది. దీనిపై RCB ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రెచ్చగొట్టడం మానుకోవాలంటూ హితవుపలుకుతున్నారు. గతేడాది కోహ్లీ-గంభీర్ గొడవతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంటోంది.
AP: టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణ ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని ఈసీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ‘ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు టెట్‌ను ప్రభుత్వం నిర్వహించింది. వీటి ఫలితాల వెల్లడితోపాటు 6,100 టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణను వాయిదా వేయాలి’ అని కోరారు. కాగా ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.
మైనింగ్ వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి తిరిగి BJP గూటికి చేరనున్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని BJPలో విలీనం చేయనున్నారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన.. మైనింగ్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. తర్వాత సొంతంగా పార్టీని ఏర్పాటుచేసి 2023 ఎన్నికల్లో MLAగా గెలిచారు.
ప్రస్తుతం హార్దిక్ పాండ్యపై ఉన్న ద్వేషం ఏ క్రికెటర్‌పై ఉండి ఉండదు. రోహిత్ శర్మను కాదని ముంబై ఫ్రాంచైజీ పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వడంతో వ్యతిరేకత పెరిగింది. పాండ్య సీనియర్లకు గౌరవం ఇవ్వరని, ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లేయర్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. గాయాల బెడదతో అంతర్జాతీయ మ్యాచులకు దూరమైనా.. ఐపీఎల్ సమయానికి ఫిట్ అవుతారని చెబుతున్నారు. అయితే హార్దిక్ మ్యాచ్ విన్నర్ అని మరికొందరు గుర్తుచేస్తున్నారు.
హోలీ రోజు రాహువు చాలా కోపంగా ఉంటారట. దీని వల్ల పండుగ రోజు ఇంట్లో వాళ్లతో, బయటి వ్యక్తులతో గొడవలు జరగడం, తెలియకుండానే నోరు జారడం వంటివి జరిగే అవకాశం ఉంటుందట. అందుకే రాహువు కోపం నుంచి తప్పించుకోవడానికి తెలుపు దుస్తులు ధరిస్తారని సనాతన ధర్మం చెబుతోంది. సైన్స్ ప్రకారం పండుగ నాటికి ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి, ఎండ నుంచి రక్షణ కోసం తెలుపు దుస్తుల్ని ధరిస్తారని నిపుణులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.