India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్ 2024లో హోమ్ టీమ్‌లదే హవా నడుస్తోంది. ఆయా జట్లు సొంత వేదికల్లో విజయాలను నమోదు చేశాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచులు జరగగా వీటిలో ఆతిథ్య జట్లే గెలుపొందడం గమనార్హం. మరి ఇవాళ చెపాక్ వేదికగా చెన్నై, గుజరాత్ మ్యాచులో ఈ జోరుకు బ్రేక్ పడుతుందేమో వేచి చూడాలి.
ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు HCL హెల్త్ కేర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 56వేల మందికి మెడికల్ టెస్టులు చేయగా, 77% మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. 22% మంది ఊబకాయం, 17% ప్రిడయాబెటిస్, 11% రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడైంది. జంక్ ఫుడ్స్, గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం, సరైన డైట్ పాటించకపోవడం, నిద్రలేమి, ఆల్కహాల్, సిగరెట్ల వల్ల సంతానలేమి సమస్యా పెరుగుతోందట.
TG: నిన్న హోలీ పండుగ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ఘటనల్లో 17 మంది దుర్మరణం పాలయ్యారు. రంగులు చల్లుకున్న తర్వాత స్నానానికి నదులు, వాగులు, చెరువుల్లోకి దిగి 16 మంది మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఆరుగురు, రంగారెడ్డిలో ఇద్దరు, జగిత్యాలలో ఒకరు మృతి చెందారు. నారాయణపేటలో నీటి ట్యాంక్ కూలి ఓ చిన్నారి కన్నుమూసింది.
AP: సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్‌షోలతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.
TG: ✒ నాగార్జున సాగర్: ప్రస్తుత నిల్వ-137.8TMC, పూర్తి సామర్థ్యం 312.5 TMC
✒ శ్రీరాంసాగర్: ప్రస్తుత నిల్వ-17.5 టీఎంసీలు, సామర్థ్యం 90 TMC
✒ మల్లన్నసాగర్: ప్రస్తుత నిల్వ-9.9TMC, సామర్థ్యం 50 టీఎంసీలు
✒ మేడిగడ్డ బ్యారేజీ: ప్రస్తుత నిల్వ-0 టీఎంసీలు, సామర్థ్యం 16.17 TMC
✒ ఎల్లంపల్లి: ప్రస్తుత నిల్వ-8.73 టీఎంసీలు, సామర్థ్యం 20.17 టీఎంసీలు
✒ సింగూరు: ప్రస్తుత నిల్వ-18.78 టీఎంసీలు సామర్థ్యం 29.917 TMC
AP: విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి చేస్తూ EO రామారావు ఆదేశాలు జారీ చేశారు. ₹100, ₹300, ₹500 టికెట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేయకుండా పలువురు సిఫార్సుల పేరుతో నేరుగా దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. ఇకపై అంతరాలయ దర్శనం చేసుకునే భక్తులకు ₹500 టికెట్ ఉండాల్సిందేనని ఈవో స్పష్టం చేశారు. నిత్యం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.
TG: డిగ్రీ విద్యార్థినులకు వసతి కష్టాలు వచ్చి పడ్డాయి. వివాహమైన వారికి గురుకులాల్లో అనధికారికరంగా ప్రవేశాలు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. డిగ్రీ మధ్యలోనే పెళ్లైనా వసతి గృహంలో ఉండేందుకు అనుమతించట్లేదని సమాచారం. దీనిపై ప్రిన్సిపల్, ఆర్‌సీఓలకు ఫిర్యాదు చేసినా పర్మిషన్ లభించట్లేదట. మరోవైపు అనుమతులపై ప్రిన్సిపల్, RCOలు నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు గురుకుల సొసైటీ వర్గాలు పేర్కొన్నాయి.
బిహార్‌లో ఆసక్తికర రాజకీయానికి తెరలేచింది. దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కంచుకోట హాజీపూర్‌లో బాబాయి పశుపతిపై అబ్బాయి చిరాగ్ పోటీ చేయనున్నారు. చిరాగ్ పార్టీతో BJP <<12883342>>పొత్తు<<>> పెట్టుకోవడంతో ఇటీవల పశుపతి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనతోపాటు నలుగురు సిట్టింగ్ ఎంపీలు RLJP నుంచి పోటీ చేస్తారని తెలిపారు. మరోవైపు హాజీపూర్‌లో పశుపతిని ఓడించి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తానని చిరాగ్ చెబుతున్నారు.
AP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతన స్కేలు అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సవరించిన పే స్కేల్‌ను 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. బకాయిల మొత్తాన్ని 12 వారాల్లో చెల్లించాలని పేర్కొంది. అయితే కేజీబీవీల్లోని బోధనా సిబ్బంది బదిలీలను నిలుపుదల చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
అమూల్ పాలు ఇక అమెరికా మార్కెట్లలోనూ లభించనున్నాయి. మరో వారం రోజుల్లో లాంచ్ చేయనున్నట్లు అమూల్ మాతృసంస్థ ఎండీ జయేన్ మెహతా ప్రకటించారు. దీని కోసం 108ఏళ్ల చరిత్ర కలిగిన మిషిగన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ విధానాన్ని ఆ అసోసియేషన్ చూసుకుంటుందని వెల్లడించారు. త్వరలో పన్నీరు, పెరుగు, మజ్జిగను కూడా ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.