India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: KTR అరెస్ట్‌ని BJP అడ్డుకుంటోందన్న విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన KTR కేంద్ర మంత్రులెవరినీ కలవలేదని స్పష్టం చేశారు. గవర్నర్ ఏ ఫైల్‌పై సంతకం పెడుతున్నారనేది కేంద్రం పర్యవేక్షించదని వెల్లడించారు. మాజీ సీఎం KCR తరహాలోనే CM రేవంత్ రెడ్డి కూడా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అబద్ధపు, అరాచక పాలన కొనసాగిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల CMలు అక్కడ వేర్వేరుగా పర్యటించనున్నారు. చంద్రబాబు ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వెళ్లి ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం10గంటలకు చంద్రాపూర్ వెళ్లే రేవంత్ నేడు, రేపు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారసభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కూడా 16, 17తేదీల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

TG: వివిధ శాఖల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలను TGPSC సిద్ధం చేసింది. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-3 ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని TGPSC సూచించింది.

దక్షిణాఫ్రికాపై నిన్న సాధించిన టీ20 సిరీస్ విజయం తనతో ఎప్పటికీ నిలిచిపోతుందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ గెలవడం అంత సులువు కాదని గుర్తుచేశారు. ‘సౌతాఫ్రికా పర్యటన ఎప్పుడైనా సవాలే. యువ జట్టుతో ఇక్కడికొచ్చి ఇలా గెలుపొందడం అద్భుతం. ఫలితం గురించి ఆలోచించకుండా ఆడాం’ అని తెలిపారు. భారత్ ఈ ఏడాది ఆడిన 26 టీ20ల్లో 24 మ్యాచుల్లో గెలవడం విశేషం.

అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమితులైన తొలి హిందూ మహిళ తులసీ గబ్బార్డ్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సోల్జర్ నుంచి Lt.కల్నల్ వరకు 21 ఏళ్లుగా USకు సేవలందిందించారు. మీతో కలిసి పలు వేదికల్లో పాల్గొనడం సంతోషకరం. మీ ఆలోచనల్లో స్పష్టత, అంకితభావం నన్ను ఆకట్టుకున్నాయి’ అని Xలో పోస్టు చేశారు.

‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో హీరోహీరోయిన్లుగా నాగ చైతన్య, పూజా హెగ్డే నటిస్తారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ టాక్. ‘ఒక లైలా కోసం’ మూవీలో వీరిద్దరూ జంటగా నటించిన విషయం తెలిసిందే. కాగా చైతూ, సాయి పల్లవి కాంబోలో చందూ మొండేటి రూపొందిస్తున్న తండేల్ మూవీ FEB 7న విడుదల కానున్న విషయం తెలిసిందే.

TG: పదో తరగతి పరీక్షలకు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతేడాది వరకు టెన్త్ విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ఫీజు చెల్లింపునకు అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది నుంచి కచ్చితంగా 6-10వ తరగతి విద్యార్థుల వివరాలు నమోదు చేయాలనే నిబంధన తీసుకొచ్చారు. దీంతో ఒక్కరి డేటాను ఎంటర్ చేయకపోయినా మిగతావారి ఫీజు చెల్లింపులో ఇబ్బంది తలెత్తుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

TG: ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కంప్లైంట్ బాక్సులు పెట్టాలని హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. వినతులు, ఫిర్యాదులు వస్తే రిజిస్ట్రార్ లేదా ఆపై అధికారులు పరిశీలించి విచారణ చేపట్టాలని చెప్పింది. రంగారెడ్డి(D) జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది.

ఢిల్లీలో 3రోజులుగా వాయు నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో విద్యార్థులు కచ్చితంగా మాస్కులు ధరించాలని స్కూళ్లు ప్రకటించాయి. ప్రైమరీ స్కూళ్లు చాలా వరకు నిన్న ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాయి. అటు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రేప్-3) <<14615655>>ఆంక్షలు<<>> కొనసాగుతున్నాయి. మరోవైపు, దేశ రాజధానిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వ ఆఫీసుల పని వేళల్లో మార్పులు చేస్తూ సీఎం ఆతిశీ నిర్ణయం తీసుకున్నారు.

‘2024’.. భారత క్రికెట్ అభిమానులకు చాలా స్పెషల్‌గా మారింది. ఎందుకంటే భారత జట్టు ఇదే ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచింది. మొత్తం 26 టీ20 మ్యాచ్‌లు ఆడితే ఏకంగా 24 గెలిచింది. కేవలం రెండింట్లో ఓడింది. ఈ ఏడాది తన చివరి టీ20ని సౌతాఫ్రికాతో ఆడేసింది. మళ్లీ టీ20లు వచ్చే ఏడాదిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు టీ20 ఫార్మాట్లో తీపి గుర్తులు ఇచ్చిన ‘2024’కు థాంక్స్ చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.