news

News November 23, 2024

BREAKING: ఝార్ఖండ్‌లో ఆధిక్యంలో JMM

image

ఝార్ఖండ్‌లో అధికార JMM ఆధిక్యంలోకి వచ్చింది. ఆ పార్టీ 38 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. BJP 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 81 అసెంబ్లీ సీట్లున్న ఝార్ఖండ్‌లో అధికారం చేపట్టాలంటే 41 సీట్లు అవసరం. కాగా బర్హత్‌లో సీఎం హేమంత్ సోరెన్, గండేలో ఆయన భార్య కల్పన సోరెన్ లీడింగ్‌లో ఉన్నారు. మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి సెరైకెల్లాలో చంపై సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు.

News November 23, 2024

మహారాష్ట్ర: కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వెనుకంజ

image

మహారాష్ట్ర ఓట్ల లెక్కింపు ఎర్లీ ట్రెండ్స్‌లో బడా నేతలు వెనకంజలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ నానా పటోలే (సకోలి), మిలింద్ దేవర (వర్లి), జీషన్ సిద్ధిఖీ (వాంద్రె ఈస్ట్) వెనుకంజలో ఉన్నాయి. సీఎం ఏక్‌నాథ్ శిండే (కోప్రి), అజిత్ పవార్ (బారామతి) ఆధిక్యాలు మారుతున్నాయి. కాసేపు ఆధిక్యం, మరికాసేపు వెనుకంజలో ఉంటున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (నాగ్‌పుర్ సౌత్‌వెస్ట్) జోరుమీదున్నారు.

News November 23, 2024

మహారాష్ట్రలో మహాయుతి హవా

image

మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్‌లో మహాయుతి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ కూటమి మొత్తం 132 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అలాగే మహా వికాస్ అఘాడీ కూటమి 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది. అలాగే ఝార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. 33 సీట్లలో ఎన్డీయే కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇండియా కూటమి 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

News November 23, 2024

24వేల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక

image

వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె 24వేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

News November 23, 2024

అమెరికా కోర్టులో మరో భారతీయుడిపై కేసు

image

USలోని ఓరెగావ్ కోర్టులో ఓ భారతీయుడిపై నేరాభియోగాలు నమోదయ్యాయి. సంజయ్ కౌశిక్ ఓ వైమానిక పరికరాన్ని రష్యాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నించినట్టు DOJ తెలిపింది. కొన్ని దేశాలకు US నుంచి ఎగుమతి చేయాలంటే లైసెన్స్ అవసరం. భారత్‌లోని తన కంపెనీకి పంపిస్తున్నాని కౌశిక్ లైసెన్స్ తీసుకొని మోసగించాడని DOJ పేర్కొంది. దేశం దాటకముందే దానిని స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. OCT17నే ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.

News November 23, 2024

ఝార్ఖండ్: 23 సీట్లకు పెరిగిన బీజేపీ+ ఆధిక్యం

image

ఝార్ఖండ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే దూసుకుపోతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం 23 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 41. మరో 20 సీట్లలో ఆధిపత్యం చెలాయిస్తే విజయానికి చేరువైనట్టే. ఇక ఇండియా కూటమి 7 సీట్లలో ముందంజలో ఉంది. 81కి గాను ప్రస్తుతం 30 సీట్ల ఆధిక్యాలే అందుబాటులో ఉన్నాయి.

News November 23, 2024

తొలి రౌండ్‌లో ప్రియాంకకు 3వేల ఓట్ల ఆధిక్యం

image

వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీ దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్‌లో ఆమె సమీప ప్రత్యర్థి నవ్య హరిదాస్(బీజేపీ)పై 3వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌‌లో ప్రియాంకకు 600 ఓట్ల లీడింగ్ వచ్చింది. మరోవైపు విజయంపై నవ్య ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు.

News November 23, 2024

కపిల్ దేవ్ సరసన జస్ప్రీత్ బుమ్రా

image

టీమ్ ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో సేనా దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌గా బుమ్రా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 7 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (7) రికార్డును సమం చేశారు. కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు.

News November 23, 2024

ఇద్దరి తనయుల తడాఖా

image

మహారాష్ట్ర ఎన్నికల్లో ఠాక్రే కుటుంబీకుల యువతరం ఆధిక్యత కనబరుస్తోంది. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లిలో లీడింగ్‌లో ఉన్నారు. ఇక వీరి బంధువైన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ మహిమ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.

News November 23, 2024

బ్యాలెట్ ఓట్లలో మహాయుతిదే పైచేయి

image

మహారాష్ట్రలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో అధికార మహాయుతి పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆ కూటమి 76కు పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇక ఈవీఎంలు ఇప్పుడే తెరిచారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కనీసం 20-25 నిమిషాల సమయం పట్టనుంది. బారామతిలో ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మళ్లీ లీడింగ్‌లోకి వచ్చారు. నాగ్‌పూర్ సౌత్‌ వెస్ట్‌లో ఫడణవీస్ ఆధిక్యంలో ఉన్నారు.