India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TS: హైదరాబాద్ మహానగరంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పలుచోట్ల నీటికొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో HMWS&SB నగరవాసులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. డ్రింకింగ్ వాటర్‌ను తాగేందుకు మాత్రమే ఉపయోగించాలని, ఇతర అవసరాలకు వాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెనాల్టీలు వేయడంతో పాటు నల్లా కనెక్షన్ తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
గతంతో పోలిస్తే ఈసారి హోలీ పండగకు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1970 నుంచి ఏటా మార్చి, ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని.. మార్చి ఆఖరులో భానుడి భగభగలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. మార్చి ఆఖరి వారంలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటే ఛాన్స్ 1970ల్లో ఒక్క మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లోనే ఉండేదట. ఇప్పుడు ఈ జాబితాలో AP, తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు చేరాయట.
పాక్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ యూటర్న్ తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాది ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నారు. ‘PCB అధికారులను కలిశాక నా మనసు మార్చుకున్నా. పొట్టి ఫార్మాట్‌లో నా అవసరాన్ని గుర్తించినందుకు సంతోషిస్తున్నా. జూన్‌లో జరగనున్న T20WC ఆడేందుకు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నా. పాకిస్థాన్‌కు ట్రోఫీ అందించేందుకు నా వంతు కృషి చేస్తా’ అని ఇమాద్ వసీమ్ ట్వీట్ చేశారు.
AP: చంద్రబాబు ఇవాళ నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్ చేశారని బొండా ఉమా ఆరోపించారు. ట్యాపింగ్ చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని పట్టుకున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఐజీ పంపితేనే వచ్చానని పట్టుబడిన కానిస్టేబుల్ చెప్పాడని, ఉన్నతాధికారి సీతారామాంజనేయులు నేతృత్వంలో ట్యాపింగ్ జరుగుతోందని బొండా ఉమా ఆరోపించారు.
IPLలో పాల్గొనే 10 జట్లకు రోహిత్ శర్మే కెప్టెన్ అని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నారు. ఈ సీజన్‌లో ముంబైకి సారథిగా లేనప్పటికీ.. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా అన్ని జట్లకు అతడే నాయకుడని అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ శర్మ దేశంలో ఎక్కడికి వెళ్లినా బలమైన అభిమాన సైన్యం ఉంటుంది. 2 నెలల తర్వాత ఈ 10 ఐపీఎల్ జట్ల నుంచే ప్రపంచకప్ కోసం టీంను ఎంచుకోవాలని అతడికి తెలుసు. కాబట్టి అతను కెప్టెన్ కాదని చెప్పలేం’ అని తెలిపారు.
AP: పి.గన్నవరంలో కచ్చితంగా జనసేనే గెలుస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ స్థానం నుంచి గిడ్డి సత్యనారాయణ పేరును ప్రకటించిన జనసేనాని.. నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘స్థానిక ఎన్నికల్లో YCP వాళ్లు దౌర్జన్యాలకు పాల్పడి, కనీసం నామినేషన్ వేయనివ్వలేదు. అయినా సత్తా చాటాం. ఇదే స్ఫూర్తిని ఇప్పుడు చూపించాలి. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దశదిశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే’ అని తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలిస్తారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. జైల్లో కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పారు. ‘జైలుకు వెళ్లినంత మాత్రాన నేరస్థుడు కాదని చట్టం చెబుతోంది. కాబట్టి సర్కారును నడిపేందుకు జైల్లోనే కార్యాలయం ఏర్పాటు చేయాలని సుప్రీం, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం’ అని తెలిపారు.
హీరోయిన్ నేహా శర్మ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఛాన్సుంది. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బిహార్‌లోని భగల్‌పూర్ సీటు కాంగ్రెస్‌కు వస్తే తాను లేదా తన కూతురు పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆమె తండ్రి అజయ్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఆయన భగల్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాము పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సంప్రదిస్తున్నట్లు ఆయన మీడియాతో చెప్పారు.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. సీఎం అరెస్టు, కస్టడీపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. కాగా, ఈడీ మార్చి 28 వరకు కస్టడీకి అప్పగించడం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టి, వెంటనే ఆయనను విడుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
TS: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండో విడత ట్రైనింగ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుందని TSSP ప్రకటించింది. తొలి దశలో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభం కాగా, సరిపడా వసతులు లేకపోవడంతో మిగతా వారి ట్రైనింగ్ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు వసతులు కల్పించామని, 4250 మంది కానిస్టేబుళ్లకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని TSSP తెలిపింది.
Sorry, no posts matched your criteria.