India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆయన పేరుతో టీడీపీ అధిష్ఠానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఇందులో గంటాకు సానుకూలంగా ఫలితం రావడంతో టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. త్వరలో ప్రకటించబోయే నాలుగో జాబితాలో ఆయన పేరు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి, సోము వీర్రాజు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. అయితే కొన్ని స్థానాల్లో టీడీపీ, బీజేపీ మధ్య పంచాయితీ ఇంకా తేలలేదు. ఇవాళ ఆ సీట్లపై స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇవాళ దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గంటపాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరింది. వాతావరణంలో మార్పులు, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా ఏటా ఒకసారి దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఈ కార్యక్రమం పాటిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ మనీలాండరింగ్ నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి లేఖ రాశారు. ‘తిహార్ క్లబ్‌కు బాస్‌గా మీకు స్వాగతం పలుకుతున్నా. ఖట్టర్ ఇమాందార్(నిజాయితీపరుడు) అనే డ్రామాలకు ముగింపు పడింది. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతమవుతోంది. నిజమే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల కవితపై ఆరోపణలు చేస్తూ అతను లేఖ రాసిన విషయం తెలిసిందే.
AP: కడప జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట(M) కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. అతడి భార్య పద్మావతి, కూతురు వినయ ఇంట్లో బలవన్మరణం చెందారు. రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభించింది. మూడెకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేశారని, మనస్తాపంతో చనిపోతున్నామని లేఖలో రాసి ఉంది.
కుళ్లిన ఆహార పదార్థాలు, పండ్ల నుంచి డ్రై ఈస్ట్ తయారవుతుంది. విశాఖలో ఈ డ్రై ఈస్ట్ మాటునే భారీగా డ్రగ్స్ తరలిస్తుండగా CBI పట్టుకుంది. యూరప్ దేశాల్లో చాలా కంపెనీలు ఈస్ట్‌ని చౌకగా విక్రయిస్తాయి. ఇందులో ప్రొటీన్లు, C విటమిన్, అమైనో ఆమ్లాలుంటాయి. పశువులు, రొయ్యల మేత కోసం APలో దీన్ని ఎక్కువగా వాడుతారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తి కావడంతో నిఘా తక్కువగా ఉంటుందని ఈ ముసుగులో దందా చేశారు.
రష్యాలోని మాస్కోలో జరిగిన దారుణమైన <<12907109>>ఉగ్రదాడిని<<>> ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ‘ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు ఇండియా సంఘీభావం తెలుపుతోంది. బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. కాగా ఉగ్రదాడిలో 62 మంది మరణించగా, 100 మందికి పైగా పౌరులు గాయపడ్డారు.
మానవాభివృద్ధి కోసం AI టెక్నాలజీని ఉపయోగిస్తామని Nvidia సీఈవో జెన్సన్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్లలో ఈ సంస్థ ఒకటి. ఓ ఇంటర్వ్యూలో జెన్సన్ మాట్లాడుతూ.. ‘మనుషులు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకునేంత స్మార్ట్‌గా కంప్యూటర్లు ఉండాలి. ఆ దిశగా మేం పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ప్రోగ్రామింగ్ అనేది ప్రత్యేకమైన స్కిల్ కాదు. యువత కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం ఉండదు’ అని పేర్కొన్నారు.
ఇకపై తాను బిడ్డను కనలేనని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ అన్నారు. ‘నాకు కూతురు పుట్టిన తర్వాత ఏడేళ్లు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించా. నాలుగేళ్ల క్రితం గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయా. ప్రస్తుతం నా వయసు 46 ఏళ్లు. ఈ వయసులో ఇక బిడ్డను కనలేను. నా కూతురికి చెల్లినో, తమ్ముడినో ఇవ్వలేకపోయాననే బాధ మెలిపెడుతోంది’ అని ఆమె పేర్కొన్నారు.
లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, కవిత బంధువులు, అనుచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీలోని ఆప్ MLA గులాబ్ సింగ్ ఇంటిపై రైడ్స్ జరుగుతున్నాయి. అదే సమయంలో హైదరాబాద్‌లోని కవిత ఆడపడుచు తదితర బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.