India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత్-న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం పుణే స్టేడియంలో స్లో పిచ్ సిద్ధమవుతోంది! బెంగళూరు పిచ్‌తో పోలిస్తే ఫ్లాట్‌గా ఉండి తక్కువ బౌన్స్‌తో ఉంటుందని తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్‌లో ఓటమి తరువాత రెండో మ్యాచ్‌లో గెలుపు కోసం భారత్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. WTC ఫైనల్ రేసులో ముందుండాలంటే 2-1తో సిరీస్ గెలవడం భారత్‌కు అత్యవసరం.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

తేది: అక్టోబర్ 22, మంగళవారం
షష్ఠి: రాత్రి 1.29 గంటలకు
ఆరుద్ర: తెల్లవారుజామున 5.38 గంటలకు
వర్జ్యం: మధ్యాహ్నం 2.10-3.45 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 08.22-09.08 గంటల వరకు
2) రాత్రి 10.37- 11.27 గంటల వరకు

AP: దీపావళి నుంచి ఫ్రీ సిలిండర్లు: సీఎం చంద్రబాబు
☛ పవన్ కళ్యాణ్‌కు HYD సిటీ సివిల్ కోర్టు సమన్లు
☛ అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: ఏపీ ప్రభుత్వం
☛కష్టాల్లో ప్రజలు.. సుఖాల్లో చంద్రబాబు: YCP
TG: తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్
☛ గ్రూప్-1 వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
☛ అమరులైన కానిస్టేబుల్ కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం రేవంత్
☛ జీవో 29పై న్యాయపోరాటం చేస్తాం: KTR

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. EC బీజేపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఝార్ఖండ్‌లో DGPని మార్చాలని BJP కోరగానే ఈసీ ఆయనపై వేటువేసింది. అదే, మహారాష్ట్రలో ప్రస్తుత డీజీపీని తప్పించాలని కాంగ్రెస్ కోరగా ఈసీ అందుకు నిరాకరించింది. దీంతో ఇది ద్వంద్వ వైఖరి అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలకడ మండలం గుట్టపల్లి వద్ద కడప-చిత్తూరు హైవేపై ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. సీఎంఆర్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తండ్రి, అప్పుడే పుట్టిన శిశువుతో సర్ఫరాజ్ దిగిన ఫొటో వైరల్ అవుతోంది. 26 ఏళ్ల సర్ఫరాజ్ గతేడాది ఆగస్టు 6న రొమానా జహూర్‌ను J&Kలో వివాహమాడారు. ఇటీవల NZపై ఈ యువ సంచలనం అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియాలో పర్యటించే ఇండియా-A జట్టును బీసీసీఐ ప్రకటించింది. రుతురాజ్ కెప్టెన్సీలోని ఈ జట్టు AUS-Aతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచులు, భారత జట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ (NOV 15-17) ఆడనుంది.
>> జట్టు: రుతురాజ్ గైక్వాడ్(C), అభిమన్యు ఈశ్వరన్, సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, పోరెల్, ముకేశ్, ఖలీల్, యశ్ దయాల్, సైనీ, మనవ్, తనుశ్.

బాలీవుడ్‌లో భారీ డీల్ కుదిరింది. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్‌లో 50% వాటాను బిజినెస్ టైకూన్ అదార్ పూనావాలా ₹1,000 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. మిగిలిన వాటా కలిగిన కరణ్ సంస్థను నడిపిస్తారు. ఐకానిక్ ప్రొడక్షన్స్ హౌస్‌లో భాగస్వామ్యమైనందుకు పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. ధర్మా ప్రొడక్షన్స్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చుతామని కరణ్ పేర్కొన్నారు.

TG: ఇవాళ జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 72.4% హాజరు నమోదైంది. మెయిన్స్‌కు మొత్తం 31,383 అభ్యర్థులు అర్హత సాధించగా, నేడు 22,744 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ ఎగ్జామ్స్ ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి. జీవో 29 రద్దు చేయాలని, పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, తాము జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.