India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో గైనకాలజిస్ట్ డా.ప్రీతి చల్లాకు మూడుముళ్లు వేశారు. వీరిద్దరి ఫొటోను సినీవర్గాలు షేర్ చేస్తూ విషెస్ తెలియజేస్తున్నాయి. కాగా, ఈనెల 16న రిసెప్షన్ కూడా ఉంటుందని, దీనికి సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. 2016లో మొదటి వివాహం చేసుకున్న క్రిష్ 2018లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

AP: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)తో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలోని ఉద్యోగులు గౌరవ వేతనం కోసం గత ప్రభుత్వ హయాంలో 21రోజులు సమ్మె చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నేడు ఆ ఉత్తర్వులు జారీ అయినట్లు లోకేశ్ పేర్కొన్నారు.

TG: మాజీ మంత్రి KTR ఢిల్లీ పర్యటనపై BRS, INC మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ‘అమృత్’ స్కామ్‌లో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని KTR అన్నారు. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన హస్తినకు వెళ్లారని మంత్రులు ఆరోపించారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన KTR ‘ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా. అప్పుడే HYDలో ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పుడే వణికితే ఎలా?’ అని సెటైర్ వేశారు.

TG: సీఎం రేవంత్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తారని సమాచారం. అనంతరం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్న ఆయన, అక్కడ రెండు రోజులు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం <

సోమవారం మిడ్ సెషన్ వరకు 251 పాయింట్ల లాభంతో సాగిన నిఫ్టీ చివరికి 6 పాయింట్ల నష్టంతో 24,141 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కూడా 808 పాయింట్ల లాభం నుంచి 9 పాయింట్ల లాభానికి పతనమై 79,496 వద్ద చలించింది. నిఫ్టీలో 24,300 వద్ద, సెన్సెక్స్‌లో 80,100 వద్ద ఉన్న కీలకమైన రెసిస్టెన్స్‌ను సూచీలు అధిగమించలేకపోయాయి. Power Grid 4.35%, Trent 2.60% లాభపడగా, Asian Paint 8%, Britannia 2.60% నష్టపోయాయి.

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో హిందూ, ముస్లింలను ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తుందని CM రేవంత్ తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హిందూ ముస్లింల మధ్య విభజన రాజకీయాలు దేశానికి నష్టం చేకూర్చుతాయని, ఇవి దేశాన్ని బలహీనపరిచే చర్యలని అన్నారు. తమ ప్రభుత్వంలో మైనారిటీలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్నారు.

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఫార్మావిలేజ్‌కు భూసేకరణ విషయంలో కొద్దిసేపటి క్రితం కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చి, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈనెల 17న సాయంత్రం 6.03 గంటలకు బిహార్‌లోని పట్నాలో ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. కాగా, డిసెంబర్ 5న ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ట్రైలర్ కోసం మీరూ ఎదురుచూస్తున్నారా? కామెంట్ చేయండి.

Flipkart, Amazonపై ED కొరడా ఝుళిపించనున్నట్టు తెలుస్తోంది. కొంత మంది సెల్లర్లను మాత్రమే ప్రోత్సహిస్తూ భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఈ సంస్థలపై ఆరోపణలు ఉన్నాయి. విదేశీ సంస్థలు సెల్లర్లకు వేదికగా ఉండాలే తప్ప వస్తువులపై నియంత్రణ ఉండకూడదని చట్టం చెబుతోంది. ఇటీవల ED జరిపిన సోదాల్లో ఉల్లంఘనలు రుజువైనట్లు తేలింది. ఈ-కామర్స్ వ్యాపార విధానాలపై ముందు నుంచీ విమర్శలున్నాయి.
Sorry, no posts matched your criteria.