news

News November 26, 2024

ప్రేమ కోసమై వలలో పడెనే..

image

ఉక్రెయిన్ యువతితో ప్రేమలో పడిన బ్రిటిష్ యువకుడు రష్యాకు చిక్కిన ఘటన ఇది. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ స్కాట్(22) అనే వ్యక్తి ఉక్రెయిన్‌ యువతిని ప్రేమించాడు. ఆమె మీద ప్రేమ ఉక్రెయిన్‌పైకి కూడా మళ్లడంతో ఆ దేశ సైన్యం తరఫున రష్యాపై యుద్ధంలో పాల్గొన్నాడు. ఈక్రమంలో పట్టుబడ్డాడు. తన బిడ్డను రష్యా హింస పెట్టి చంపుతుందేమోనంటూ అతడి తండ్రి స్కాట్ ఆండర్సన్ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది.

News November 26, 2024

కొత్త బంతితో బౌల్ట్‌ మెరుస్తారు: ఆకాశ్ అంబానీ

image

MI జట్టులో చేరిన బౌల్ట్ కొత్త బంతితో మెరుస్తారని జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. బౌల్ట్‌తో పాటు టోప్లే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు కావడంతో వారిని తీసుకోవాలని ముందే అనుకున్నట్లు చెప్పారు. గతంలో బౌల్ట్ MIకు ఆడినప్పుడు కొత్త బంతిని స్వింగ్ చేస్తూ అద్భుతంగా రాణించారన్నారు. ఐపీఎల్‌లో 104 మ్యాచ్‌లు ఆడిన ఈ పేసర్ 121 వికెట్లు తీశారు. వేలంలో ఇతడిని MI రూ.12.50కోట్లకు కొనుగోలు చేసింది.

News November 26, 2024

రాజ్యాంగం లక్ష్యం అదే: సీఎం చంద్రబాబు

image

AP: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని సీఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేదే రాజ్యాంగం లక్ష్యం. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి దీనిని రచించారు. రాజ్యాంగ పరిషత్‌లో తెలుగు వాళ్లు కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగాన్ని కొందరు తమ చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కుల్ని కాలరాశారు’ అని వ్యాఖ్యానించారు.

News November 26, 2024

ఢిల్లీని వీడుతూ పంత్ ఎమోషనల్ పోస్ట్

image

IPL వేలంలో లక్నోకు వెళ్లిపోయిన రిషభ్ పంత్ ఢిల్లీ అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘టీనేజర్‌గా ఇక్కడ అడుగుపెట్టి 9 ఏళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాను. అందుకు అభిమానులే కారణం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచారు. కఠిన సమయాల్లో అండగా ఉన్నారు. వేరే జట్టుకు వెళ్తున్నా మీ ప్రేమను గుండెలో పదిలంగా దాచుకుంటా. మిమ్మల్ని ఎప్పటిలాగే అలరిస్తా’ అని పంత్ రాసుకొచ్చారు.

News November 26, 2024

మోదీ స్ఫూర్తితో రాజ్యాంగ దినోత్సవం: స్పీకర్ ఓంబిర్లా

image

ప్రజల కొన్నేళ్ల తపస్సు, త్యాగం, చాతుర్యం, బలం, సామర్థ్యాల ఫలితమే రాజ్యాంగమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. భౌగోళిక, సామాజిక వైవిధ్యాలను ఒకే దారంలో కూర్చేందుకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో మూడేళ్లు శ్రమించామని తెలిపారు. PM మోదీ స్ఫూర్తితో 2015 నుంచి NOV 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నేడు కోట్లాది మంది కృతజ్ఞతా పూర్వకంగా రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేస్తున్నారని వెల్లడించారు.

News November 26, 2024

రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి

image

రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. రాజ్యాంగ వజ్రోత్సవ విషెస్ తెలిపిన ఆమె చరిత్రాత్మక ఘటనలో దేశ పౌరులందరూ భాగస్వాములు అవుతున్నారన్నారు. ‘75ఏళ్ల క్రితం ఇదే రోజు రాజ్యాంగం ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రూపకల్పన జరిగింది. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి పొందుపరిచారు’ అని చెప్పారు.

News November 26, 2024

‘పుష్ప-2’ రన్ టైమ్ ఎంతంటే?

image

మరో 9 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 15 నిమిషాలు అని సినీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

News November 26, 2024

ఆర్థికవేత్త పాలనలో ‘అరాచకం’!

image

ఎకనామిక్స్‌లో నోబెల్ పొందిన మహ్మద్ యూనస్ పాలనలో బంగ్లాదేశ్ మరింత అంధకారంలోకి వెళ్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అదానీకి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ లేక టెక్స్‌టైల్ ఇండస్ట్రీ పడకేసిందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి కరవైందన్నారు. మరోవైపు జమాతే ఇస్లామీ ఆయన దిగిపోవాలని అల్లర్లు చేస్తుండటాన్ని ఉదహరిస్తున్నారు. ఇక మైనార్టీల పరిస్థితి మరింత దిగజారిందని, దాడులు పెరిగాయని అంటున్నారు.

News November 26, 2024

IPL: పృథ్వీ షాను అందుకే తీసుకోలేదా?

image

ముంబై బ్యాటర్ పృథ్వీ షా IPL-2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలారు. ఫామ్ లేమి, అధిక బరువు, ఫిట్‌నెస్ సమస్యలు, వ్యక్తిగత వివాదాలు ఇందుకు కారణమని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. తరచూ గాయాలబారిన పడుతున్న అతడు సీజన్ మొత్తం ఆడగలడనే నమ్మకం ఫ్రాంచైజీల్లో కలగలేదని అంటున్నాయి. IPLలో DC తరఫున 2018లో అరంగేట్రం చేసిన షా ఆ సీజన్‌లో 153 స్ట్రైక్ రేటుతో రాణించారు. ఆ తర్వాతి సీజన్లలో అతడి SR 134, 137కి తగ్గింది.

News November 26, 2024

RGV ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను AP హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పోలీసులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు ఎస్పీ ప్రత్యేక బృందాలను పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టారని RGVపై మద్దిపాడు PSలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.