news

News November 9, 2024

సంచలనం.. 400 పరుగులు చేశాడు

image

దేశవాళీ టోర్నీలో హరియాణా ప్లేయర్ యశ్‌వర్ధన్ దలాల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సీకే నాయుడు ట్రోఫీలో ముంబైతో జరుగుతున్న మ్యాచులో 463 బంతుల్లో 46 ఫోర్లు, 12 సిక్సర్లతో 426* పరుగులు చేశారు. దీంతో హరియాణా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 732 పరుగులు చేసింది.

News November 9, 2024

‘మినిస్ట్రీ ఆఫ్ సెక్స్’.. రష్యాలో సరికొత్త ప్రతిపాదన

image

రష్యాలో ‘మినిస్ట్రీ ఆఫ్ సెక్స్’ పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన వచ్చింది. GlavPR ఏజెన్సీ చేసిన ఈ ప్రతిపాదనలో జనన మరణాల రేటులో అంతరాలు తగ్గించడం, జననాల రేటు పెంచే కార్యక్రమాలన్నీ ఈ శాఖ పరిధిలో ఉండాలనేది సారాంశం. అలాగే యువత ఫస్ట్ డేట్‌కు, దంపతులు పిల్లల్ని కనేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా సూచించింది. దీనిని రష్యా పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది.

News November 9, 2024

రింకూని సరిగ్గా వినియోగించుకోవడం లేదు: ఆకాశ్ చోప్రా

image

సౌతాఫ్రికాతో T20 సిరీస్‌‌లో రింకూ సింగ్‌ను ఆరో స్థానంలో పంపించడాన్ని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆక్షేపించారు. జట్టు అతణ్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతోందని అభిప్రాయపడ్డారు. ‘టాపార్డర్, పవర్ ప్లేలో అతను రాణించగలడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్న సందర్భాలున్నాయి. రింకూని నం.4లో ఎందుకు ఆడించొద్దు? తను ఫినిషర్ మాత్రమే కాదు.. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు’ అని అన్నారు.

News November 9, 2024

కులగణనకు బీజేపీ అనుకూలమేనా?: పొన్నం

image

TG: కులగణనకు బీజేపీ అనుకూలమా? కాదా? చెప్పాలని ఎంపీ లక్ష్మణ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ఎన్నికలు ముగిశాకే ఈ కార్యక్రమం చేపట్టామని బీజేపీ గ్రహించాలని హితవు పలికారు. కులగణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా? అని ప్రశ్నించారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు.

News November 9, 2024

సాగర్‌ డ్యామ్‌ వద్ద ఎలాంటి వివాదం జరగలేదు: ఏపీ ఇరిగేషన్ శాఖ

image

నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై AP, TG మధ్య ఎలాంటి <<14567529>>వివాదం<<>> జరగలేదని ఏపీ ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్ స్పష్టం చేశారు. అధికారుల మధ్య జల వివాదం జరిగిందన్న వార్తలపై ఆయన స్పందించారు. అధికారులు పరస్పర సమన్వయంతో గేట్ల నిర్వహణను పరిశీలిస్తున్నారని చెప్పారు. కుడి కాలువ రీడింగ్ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్‌తో ఇద్దరు ఉద్యోగుల మధ్య చిన్న వివాదం జరిగిందని, ఆ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.

News November 9, 2024

డిసెంబర్ లోపు రూ.2 లక్షల రుణమాఫీ: మంత్రి పొంగులేటి

image

TG: రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసానిచ్చారు. పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామీనిచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న ఆయన, డిసెంబర్ నెలాఖరులోపు రూ.13 వేల కోట్ల పెండింగ్ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులకు డిసెంబర్‌లో నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు.

News November 9, 2024

దిగ్గజ సారంగి కళాకారుడు రామ్‌నారాయణ్ కన్నుమూత

image

దిగ్గజ వాయిద్యకారుడు పండిట్ రామ్‌ నారాయణ్(96) కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో ఆయన స్వర్గస్థులైనట్లు కుటుంబీకులు తెలిపారు. 1927లో ఉదయ్‌పూర్‌లో జన్మించిన నారాయణ్ హిందుస్థానీ సంగీతంతోపాటు సారంగి వాయిద్యగానంలో నిష్ణాతులు. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో పద్మవిభూషణ్, 1974-75లో సంగీత నాటక అకాడమీ అవార్డుల్ని అందుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

News November 9, 2024

విద్యార్థుల నిరసనపై స్పందించిన మంత్రి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జోడూరు పాఠశాలలో గిరిజన విద్యార్థులు తమకు టీచర్ కావాలంటూ <<14563913>>నిరసన<<>> వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. టీచర్‌ను నియమించాలని ఐటీడీఏ పీవోను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం నుంచి ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారని చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

News November 9, 2024

టెస్టు సిరీస్ ఓటమి రివ్యూలో గంభీర్‌పైనే ఫోకస్?

image

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ కావడంపై BCCI పెద్దలు జై షా, రోజర్ బిన్నీ 6 గంటల పాటు రివ్యూ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్ పాల్గొన్న ఈ మీటింగ్‌లో గంభీర్‌పైనే బోర్డు పెద్దలు ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ‘శ్రీలంకతో వన్డేల్లో, తాజాగా టెస్టుల్లో ఎందుకీ ఫలితాలొచ్చాయి? కారణాలేంటి?’ అంటూ వారు ఆయన్ను నిలదీసినట్లు సమాచారం.

News November 9, 2024

50% రిజర్వేషన్‌ను బ్రేక్ చేస్తాం: రాహుల్ గాంధీ

image

తెలంగాణలో కులగణన ప్రారంభమైనట్లు PM మోదీకి తెలియజేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఈ డేటాను ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తామని చెప్పారు. మహారాష్ట్రలోనూ ఇదే చేస్తామని పరోక్షంగా గెలుపు తమదేనని తెలిపారు. సమగ్ర కులగణన చేయడం BJPకి ఇష్టం లేదని అందరికీ తెలుసన్నారు. త్వరలోనే పార్లమెంటులో కులగణన తీర్మానం చేసి 50శాతం రిజర్వేషన్‌ను బ్రేక్ చేస్తామని పేర్కొన్నారు.