India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాటల <<14183092>>యుద్ధం<<>> నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా? జస్ట్ ఆస్కింగ్’ అని ఆయన రాసుకొచ్చారు. పవన్‌ను ఉద్దేశించే ఈ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

AP: తిరుపతి జిల్లాలో అక్టోబర్ 24 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు జగన్ తిరుమలకు రానున్న సందర్భంగా వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుమల వెళ్లొద్దంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష తదితర నేతలకు నోటీసులిచ్చారు.

INFY, TCS సహా ఐటీషేర్ల అండతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. NSE నిఫ్టీ తొలిసారి 26,271 స్థాయిని టచ్ చేసింది. ప్రస్తుతం 50 పాయింట్ల లాభంతో 26,265 వద్ద కొనసాగుతోంది. 85,966 వద్ద రికార్డు సృష్టించిన BSE సెన్సెక్స్ 100 పాయింట్లు ఎగిసి 85,923 వద్ద ట్రేడవుతోంది. హిందాల్కో, టైటాన్, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఇన్ఫీ టాప్ గెయినర్స్. LT, పవర్ గ్రిడ్, ఎయిర్‌టెల్, దివిస్ టాప్ లూజర్స్.

రియాసీ బస్ అటాక్ కేసులో NIA దూకుడు ప్రదర్శిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని 7 ప్రాంతాల్లో ఉదయం నుంచి రైడ్స్ చేపట్టింది. రియాసీ, రాజౌరి జిల్లాలో హైబ్రీడ్ టెర్రరిస్టులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్ల కోసం వెతుకుతోంది. ఇదే కేసులో జూన్ 30న సైతం NIA రైడ్స్ చేయడం గమనార్హం. జూన్ 9న సాయంత్రం శివ్‌ఖోరి నుంచి కత్రా వెళ్తున్న అమర్నాథ్ యాత్రికుల బస్సును టెర్రరిస్టులు వెంబడించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9మంది మరణించారు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి టెస్టు ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతోంది. భారత్: రోహిత్ (C), జైస్వాల్, గిల్, కోహ్లీ, రిషభ్ పంత్(WK), KL రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్ దీప్, బుమ్రా, సిరాజ్. >బంగ్లా: ఇస్లాం, జకీర్ హసన్, శాంటో(సి), మోమినుల్ హక్, ముష్ఫికర్, షకీబ్, లిటన్, మిరాజ్, తైజుల్, మహమూద్, ఖలీద్.

తెలుగు ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను దేవుళ్లలా చూస్తారని నటుడు సైఫ్ అలీఖాన్ అన్నారు. వారి సినిమాల్లో నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. ‘అక్కడి దర్శకనిర్మాతలు కూడా ఫ్యాన్స్‌కు ఏంకావాలో అదే చేస్తారు. అభిమానుల కోణంలోనే సినిమాను తెరకెక్కిస్తారు. వారు హీరోలను చూపించే తీరే వేరుగా ఉంటుంది. సౌత్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాలీవుడ్‌లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

బిజీబిజీ లైఫ్‌లో కాస్త టైం ఫ్యామిలీకీ కేటాయిద్దాం. అలా బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుందాం. అప్పుడే వర్క్-ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. APలో అరకులోయ, బెలుం, బొర్రా గుహలు, అంతర్వేది, ఆక్టోపస్ వ్యూ, పాపికొండలు ఉన్నాయి. TGలో HYD, 1000స్తంభాల గుడి, కుంటాల జలపాతం, ఉమా మహేశ్వరం.
> నేడు వరల్డ్ టూరిజం డే.

ఈ ఏడాది అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య రికార్డు సృష్టించనుంది. ఆగస్టు నాటికే 15.5 లక్షల మంది వెళ్లారు. ట్రెండ్ ఇలాగేఉంటే గతేడాది నమోదైన 17.6 లక్షల రికార్డు బ్రేకవ్వడం ఖాయమే. స్టూడెంట్ సీజన్ సెప్టెంబర్లో ముగుస్తుంది. US సెటిలర్స్‌ను చూసేందుకు వెళ్లే కుటుంబీకులు, బిజినెస్, ఎంప్లాయిస్ ట్రిప్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే 20 లక్షలు దాటడం సులువే. కొవిడ్‌కు ముందు 2019లో 14.7 లక్షల మంది అక్కడికి వెళ్లారు.

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో కూటమి సర్కార్ ఆంక్షలు విధిస్తోందని YCP మండిపడింది. ‘జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉందంటూ మా నాయకులకు అర్ధరాత్రి నుంచే నోటీసులు జారీ చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి జరుగుతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు’ అని ట్వీట్ చేసింది.

AP: దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దివ్యాంగుల ఇళ్లకే వెళ్లి సేవలు అందించనుంది. ఇందుకోసం మొబైల్ ప్రోస్థటిక్స్ & ఆర్థోటిక్స్ వ్యాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోనే అవసరమైన పరికరాలతో పాటు తయారీ నిపుణులుంటారు. కృత్రిమ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకే వెళ్లి కొలతలు తీసుకుని ఒకరోజులోనే తయారు చేసిస్తారు.
Sorry, no posts matched your criteria.