news

News October 15, 2024

రాత్రి తినకుండా పడుకుంటున్నారా?

image

రాత్రి పూట భోజనం మానేస్తే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తుంటారు. కానీ భోజనానికి బదులు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. లేదంటే కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలసట, తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తలెత్తుతాయి. పోషకాహార లోపం, నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందుకే కొంచెమైనా తిని పడుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.

News October 15, 2024

APPLY: నెలకు రూ.20,000తో ఇంటర్న్‌షిప్

image

సమ్మర్ ఇంట‌ర్న్‌షిప్‌ ప్రోగ్రామ్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఇండియా అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఏటా 125 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. వేసవికాలంలో నిర్వహించే ఈ ప్రోగ్రామ్‌లో మూడు నెలల పాటు రూ.20వేల చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పీజీ, మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్నవారు లేదా డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News October 15, 2024

పవన్ కళ్యాణ్ ‘OG’ షూటింగ్ షురూ!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘OG’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ చేసింది. ‘ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్ టు క్రియేట్ ది మ్యాడ్‌నెస్’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ మూవీకీ ‘హరిహర వీరమల్లు’ తరహాలోనే అమరావతిలోనే సెట్స్ వేసి కంప్లీట్ చేస్తారా లేక అవుట్‌డోర్ షూట్‌కి పవన్ వెళ్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

News October 15, 2024

ఈ ఫ‌ర్నీచ‌ర్‌ను 8 ర‌కాలుగా వాడుకోవ‌చ్చు

image

తక్కువ స్పేస్ ఉన్న ఇంట్లో అన్నిర‌కాల ఫర్నీచ‌ర్‌ను ఏర్పాటు చేసుకోలేం. దీనికి ప‌రిష్కారంగా IIT గువాహ‌టికి చెందిన ప్రొ.సుప్ర‌దీప్ దాస్ ప‌రిశోధ‌కుల బృందం స్పేస్ సేవింగ్ ఫ‌ర్నీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీన్ని 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. చైర్‌, టేబుల్‌, స్టోరేజ్ యూనిట్‌గా ఉపయోగపడుతుంది. ప‌రిశోధ‌న క్ర‌మంలో దీనికి రూ.35 వేలు ఖ‌ర్చైనా, మాస్ ప్రొడ‌క్ష‌న్‌తో ధ‌ర త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు.

News October 15, 2024

వయనాడ్ ఉపఎన్నిక బరిలో ప్రియాంక

image

కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. వయనాడ్ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఆమె పోటీ చేయనున్నట్లు AICC తెలిపింది. అంతకుముందు ఈ స్థానంలో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో బై ఎలక్షన్ అనివార్యమైంది. కాగా NOV 13న వయనాడ్ ఉపఎన్నిక జరగనుంది. అదే నెల 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పాలక్కడ్ నుంచి రాహుల్ మమ్కుతహిల్, చెలక్కర నుంచి రమ్య పోటీ చేస్తారని కాంగ్రెస్ పేర్కొంది.

News October 15, 2024

సీనియర్‌గా మంత్రి పదవి ఆశిస్తున్నా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్

image

TG: కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌గా తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పారు. పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మహేశ్ గౌడ్‌కు పీసీసీ చీఫ్‌ పదవి అదే ప్రాతిపదికన ఇచ్చారని పేర్కొన్నారు. అయితే దీనిపై అంతిమ నిర్ణయం హైకమాండ్‌దేనని స్పష్టం చేశారు. పైరవీలతో మంత్రి పదవులు ఇవ్వరన్నారు.

News October 15, 2024

హైకోర్టు జడ్జిలుగా ముగ్గురు లాయర్ల పేర్లు సిఫారసు

image

AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు లాయర్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వారిలో కుంచం మహేశ్వరరావు, టి.చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ ఉన్నారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయి.

News October 15, 2024

కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.

News October 15, 2024

KTRపై కేసు నమోదు

image

TG: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. మూసీ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందని, అందులో రూ.25,000 కోట్లు ఢిల్లీకి పంపుతుందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో BNS 352, 353(2), 356(2) చట్టాల కింద KTRపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 15, 2024

కొండా సురేఖ ఫొటో మార్ఫింగ్.. ఇద్దరి అరెస్ట్

image

TG: మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు <<14234406>>ఫొటో మార్ఫింగ్ కేసులో<<>> ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖ, రఘునందన్ ఎడిటెడ్ ఫొటోలు వైరల్ కావడంతో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ ఫిర్యాదుతో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన దేవన్న, మహేశ్‌లను అరెస్ట్ చేశారు.