India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మైక్రోసాఫ్ట్, ఓపెన్AI కలిసి $100 బిలియన్ల ఖర్చుతో అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే AI సూపర్ కంప్యూటర్ ‘స్టార్‌గేట్’ను 2028లో లాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. ప్రపంచంలో ఉన్న పెద్ద డేటా సెంటర్ల కంటే ఇది 100 రెట్లు ఖరీదైనదని అంచనా. అడ్వాన్స్‌డ్ టాస్క్‌లు పూర్తి చేయగల AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను భర్తీ చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని ఉన్నతోద్యోగులు చెబుతున్నారు.

AP: రాష్ట్రానికి చిట్టచివరి నియోజకవర్గం ఇచ్ఛాపురం(శ్రీకాకుళం జిల్లా). ఇక్కడ 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరగగా, 8 సార్లు TDP గెలిచింది. కాంగ్రెస్ 3, కృషికార్ లోక్ పార్టీ 2, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ చెరొకసారి గెలిచాయి. ఈసారి TDP నుంచి సిట్టింగ్ MLA బెందాళం అశోక్, YCP నుంచి పిరియా విజయ బరిలో ఉన్నారు. హ్యాట్రిక్ కొడతానని అశోక్, గెలుపు బోణీ చేస్తానని విజయ ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

AP: రాష్ట్రంలో మంచి పాలన కొనసాగించడంలో తనకు తోడుగా ఉండాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కర్నూలు జిల్లా తుగ్గలి, రాతన గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు. కుల, మత, పార్టీలకతీతంగా పనిచేశామని చెప్పారు. ప్రతి ఇంటి తలుపు తట్టి సాయం అందించామన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి మార్పులు కనిపించలేదని.. 58 నెలల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు.

ఫ్రెషర్ల నియామకానికి టీసీఎస్ సిద్ధమైంది. ఏప్రిల్ 10 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. 26న పరీక్షలు నిర్వహించనుంది. 2024 బ్యాచ్ బీటెక్, బీఈ, MCA, Msc, MS విద్యార్థులు ఇందుకు అర్హులు. నింజా, డిజిటల్, ప్రైమ్ అనే 3 కేటగిరీలకు ఈ నియామకాలు చేపట్టనుంది. నింజాకు రూ.3.36లక్షలు, డిజిటల్‌కు రూ.7లక్షలు, ప్రైమ్‌కు రూ.9-11.5లక్షల వరకు ప్యాకేజీ ఉండనుంది. అయితే ఎన్ని పోస్టులకు అనేది సంస్థ వెల్లడించలేదు.

AP: సీఎం జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశావని జగన్‌కు సవాల్ విసురుతున్నా. జగన్‌కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు. టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. మేం ‘కియా’ పరిశ్రమ తెస్తే.. జగన్ ‘జాకీ’, ‘అమర్ రాజా’ కంపెనీలను వెళ్లగొట్టారు’ అని విమర్శించారు.

* అన్ని బీమా పాలసీలను డిజిటలైజ్ చేయాలని IRDAI ఆదేశం
* NPS ఖాతాలకు టూ ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్
* పలు SBI డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.75 వరకు పెంపు
* ఈడీఎఫ్‌లో ఏప్రిల్ నుంచి పెట్టుబడులు నిలిపివేయాలని అసెట్ మేనేజర్లకు సెబీ ఆదేశాలు
* SBI, AXIS, YES బ్యాంకుల క్రెడిట్ కార్డుల రూల్స్‌లో మార్పులు
* సిలిండర్ ధరలు వంటివి కూడా మారే అవకాశం ఉంది.

AP: మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేన పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇదివరకే ప్రకటించారు. అటు 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తుండగా.. పాలకొండ, అవనిగడ్డ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

జేఈఈ మెయిన్-2024 సెషన్-2 అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు NTA ప్రకటించింది. https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌లో వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 319 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1 (BE/BTECH) పరీక్షలు ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుండగా, పేపర్-2 పరీక్షలు ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న ఫలితాలు రానున్నాయి.

కర్ణాటకలో దావణగెరె బీజేపీ ఎంపీ అభ్యర్థి గాయత్రీ సిద్దేశ్వర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వంట చేయడం మాత్రమే తెలుసని, ఇక్కడ సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారనే విషయం ఆ ముసలాడికి తెలియదు’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా ఈ స్థానంలో ఎమ్మెల్యే కోడలు ప్రభా మల్లికార్జున్ పోటీ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ఆ మొత్తానికి పన్ను చెల్లించాలంటూ IT శాఖ నోటీసులు పంపడంతో యువకుడు కంగుతిన్నాడు. తన పాన్‌కార్డుతో ఓ కంపెనీ రిజిస్టర్ అయ్యిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2021 నుంచి ముంబై, ఢిల్లీలో ఆ కంపెనీ వ్యాపారాలు చేసిందట. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.