news

News March 29, 2024

జాగ్రత్త.. బయటికి రావొద్దు!

image

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో భానుడి భగభగలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు TN, KA, రాజస్థాన్, GT, మహారాష్ట్ర, కేరళలో వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

News March 29, 2024

కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి: భట్టి

image

TG: మాజీ మంత్రి కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ‘రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి, తిరిగి మమ్మల్ని తిడుతున్నారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’ అని హెచ్చరించారు. బీఆర్ఎస్‌లా తాము పాలనను గాలికి వదిలేసి, సోషల్ మీడియాకే పరిమితం కాలేదని భట్టి విమర్శించారు. ఇక ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

News March 29, 2024

ఈ అవకాశం కల్పించిన టీడీపీకి కృతజ్ఞతలు: నిఖిల్

image

AP: తన కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన టీడీపీకి కృతజ్ఞతలని హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. ‘చీరాల టికెట్ దక్కించుకున్న మా మామయ్య ఎం.ఎం. కొండయ్యకు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. కాగా కాసేపటి క్రితమే నారా లోకేశ్ సమక్షంలో సిద్ధార్థ్ టీడీపీలో చేరారు.

News March 29, 2024

నేను BRSలో చేరడం లేదు: బాబూమోహన్

image

TG: తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సినీనటుడు, ప్రజాశాంతి పార్టీ నేత బాబూమోహన్ స్పష్టం చేశారు. ‘ప్రజాశాంతి పార్టీ తరఫునే వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా. నాకు కేసీఆర్ ఫోన్ చేయలేదు. నేను కేసీఆర్‌తో మాట్లాడి దాదాపు ఆరేళ్లు అవుతోంది. ఇదంతా ఎవరు సృష్టించారో తెలియటం లేదు. నన్ను ఎవరూ కొనలేరు. నన్ను కొనేవారు ఈ భూమి మీద పుట్టలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

News March 29, 2024

ధర రూ.24 కోట్లు.. ఒక్క వికెట్టూ తీయలేదు

image

IPL చరిత్రలో మిచెల్ స్టార్క్ అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచారు. మినీ వేలంలో అతడిని KKR రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 2 మ్యాచులాడిన అతడు.. ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. మొత్తం 8 ఓవర్లు వేసిన స్టార్క్.. ఏకంగా 100 రన్స్ ఇచ్చారు. దీంతో అతడి ప్రదర్శనపై నెట్టింట చర్చ జరుగుతోంది.

News March 29, 2024

BREAKING: టీడీపీలో చేరిన హీరో నిఖిల్

image

AP: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో ఈ ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరఫున ప్రచారం చేయనున్నారు.

News March 29, 2024

GUNTUR EAST: 3 దశాబ్దాలుగా ముస్లిం ఎమ్మెల్యేలే

image

AP: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లింల హవా నడుస్తోంది. 1983 నుంచి ఇక్కడ వరుసగా ముస్లిం అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. చివరిసారిగా 1978లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లింగంశెట్టి ఈశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత మరే హిందూ అభ్యర్థి విజయం సాధించలేదు. ఇక్కడి నుంచి ఉమర్ ఖాన్ పఠాన్, మహ్మద్ జానీ, జియావుద్దీన్, సుబానీ, మస్తాన్ వలీ, ముస్తఫా MLAలుగా ఎన్నికయ్యారు.

News March 29, 2024

966 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 966 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 18లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. జూన్ 4వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. వేతనం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ https://ssc.gov.inను సంప్రదించాలి.

News March 29, 2024

క్షమాపణలు చెప్పిన మహిళా క్రికెటర్

image

భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ క్షమాపణలు చెప్పారు. ‘నా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓ అభ్యంతరకర <<12948946>>పోస్ట్<<>> వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ అది జరిగిన సమయంలో నా ఫోన్ నా వద్ద లేదు. ఇందుకు నన్ను క్షమించాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ‘వసూలి టైటాన్స్’ పేరుతో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా తదితర నేతలు క్రికెట్ ప్లేయర్లుగా ఉన్న పోస్టర్‌ను ఆమె ఇన్‌స్టా స్టోరీగా పెట్టినట్లు తెలుస్తోంది.

News March 29, 2024

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

image

TG: మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు 6,47,589 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేశాం. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది’ అని ఆయన తెలిపారు.