India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IIT బాంబేలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 36శాతం మందికి ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాలేదనే వార్త నెట్టింట వైరలైంది. దీనిపై IIT బాంబే క్లారిటీ ఇచ్చింది. ‘30% పైగా IITB విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదని వస్తోన్న వార్తలు అవాస్తవం. 2022-23 సర్వే ప్రకారం కేవలం 6.1% గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు’ అని తెలుపుతూ సర్వే ఫలితాలు పోస్ట్ చేసింది.

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఫైరయ్యారు. ‘ప్రస్తుతం ప్రతి వ్యక్తిపై రూ.2 లక్షల భారం ఉంది. సచివాలయం, గనులను తాకట్టు పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు. నాణ్యతలేని మద్యం అమ్ముతున్నారు. అది తాగి వందలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మే 13 తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలవుతుంది’ అని పేర్కొన్నారు.

ఉప్పల్ స్టేడియంలోని సమస్యలపై HCA మాజీ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ట్వీట్ చేశారు. ‘స్టేడియంలో నెలకొన్న సమస్యల నడుమ IPL 2024 మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. నీటి సౌకర్యం సరిగ్గా లేదు. అనుమతి లేకుండా లోనికి ప్రవేశిస్తున్నారు. ఇవన్నీ విమర్శకులకు కనిపించట్లేదా? బ్లాక్ మార్కెట్ పెరిగింది. CSK మేనేజ్మెంట్‌కి కూడా పాస్‌లు దొరకలేదు. మార్పు ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.

TG: ఉమ్మడి కరీంనగర్ పర్యటనలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ముగ్దంపూర్‌లో ఎండిన పొలాలను పరిశీలించారు. స్థానిక రైతులతో ఆయన మాట్లాడారు. నీటి సమస్యపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం బోయినపల్లిలో పంట పొలాల పరిశీలనకు పయనమయ్యారు. ఆ తర్వాత మధ్య మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు.

IPL 2024లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అత్యధిక టీమ్ స్కోరు రికార్డు బ్రేక్ అవ్వగా.. అత్యంత వేగంగా 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న సీజన్‌గా నిలిచింది. కేవలం 17 మ్యాచుల్లోనే ప్లేయర్లు 300కు పైగా సిక్సర్లు బాదడం గమనార్హం. ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ ఇంత తక్కువ మ్యాచుల్లో ఈ సంఖ్యలో సిక్సర్లు నమోదుకాలేదు. కాగా గత సీజన్‌లో ప్లేయర్లు 1,124 సిక్సర్లు బాదారు.

న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన ఆయన, న్యూస్ రీడర్‌గా తనదైన ముద్ర వేశారని రేవంత్ కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేని రోజుల్లోనే ఆయన చేసిన కృషి ఎంతోమంది వార్తా ప్రసారకులకు స్ఫూర్తినిచ్చిందని జగన్ అన్నారు. ఇక BRS చీఫ్ కేసీఆర్, TDP అధినేత చంద్రబాబు కూడా శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ రిలీజ్ చేసింది రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో అని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ నిధులెలా సమకూర్చుకుందో బయటపడిందన్నారు. పొలిటికల్, ఫైనాన్షియల్ ప్రయోజనాల కోసం సీబీఐ, ఈడీని ప్రయోగించి బెదిరింపులకు పాల్పడిందని రాహుల్ విమర్శించారు.

తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలను AP కాంగ్రెస్ చీఫ్ షర్మిల వెల్లడించారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ చేస్తున్నానని ఆమె తెలిపారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అమ్మాయిలంతా నన్నే చూస్తున్నారు మామా’ ఈ మాటలు మన స్నేహితుల్లో కొందరి నుంచి వింటూ ఉంటాం. అయితే.. ఇలాగే భావించిన చైనీస్ యూనివర్సిటీకి చెందిన లియుకి వింత అనుభవం ఎదురైంది. అతడు చదువులో వెనకబడ్డాడు. ప్రవర్తన మారింది. నిద్రలేదు. చివరికి అతడికి ఉన్నది ఓ మానసిక రుగ్మత అని వైద్యులు తేల్చారు. వీరు వాస్తవిక ప్రపంచంలోకి రాకుండా.. ఊహల్లోనే ఉంటారని చెప్పారు. సైకోథెరపీ తీసుకుంటున్న లియు క్రమంగా కోలుకుంటున్నాడు.

అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే NTR హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమా పార్ట్-1 ఇవాళ థియేటర్లలో సందడి చేసేది. కానీ షూటింగ్ పూర్తికాకపోవడంతో విడుదల తేదీని అక్టోబర్ 10కి మార్చారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఇవాళ తమ హీరో సినిమా థియేటర్లలోకి వచ్చేదని NTR ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
Sorry, no posts matched your criteria.