India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: జనసేన పార్టీకి కామన్ సింబల్ గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇంతకుముందు గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు జై భారత్ నేషనల్ పార్టీకి ‘టార్చ్ లైట్’ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP: ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎంపీ కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్నిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశ్ పెద్ద మోసగాడు.. అతడూ మోసగాడు. వారిద్దరికీ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయ్యుండొచ్చు. భవిష్యత్తులో తనకు బినామీగా పనికొస్తాడని లోకేశ్ అనుకున్నాడేమో’ అని అన్నారు. కాగా.. విజయవాడ పార్లమెంటు స్థానంలో నాని వైసీపీ నుంచి, సోదరుడు చిన్ని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

TG: వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రారు. సొంత నిర్ణయాలు తీసుకోను. పదేళ్ల తర్వాత పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేపడతా. ప్రజలెవరూ బీఆర్ఎస్ మీటింగ్‌లకు వెళ్లడం లేదు. కేసీఆర్‌లో ఇప్పటికైనా మార్పు రావాలి. పవర్ కట్‌పై కేసీఆర్ ఆరోపణలు అన్నీ అవాస్తవం. ప్రతిపక్షనేతగా ఆయన హుందాగా వ్యవహరించడం లేదు’ అని ఆయన విమర్శించారు.

గుజరాత్‌తో మ్యాచ్‌లో RCB ఆల్‌రౌండర్ విల్ జాక్స్ (41 బంతుల్లో 100) సెంచరీతో అరాచకం సృష్టించారు. అర్ధ సెంచరీ తర్వాత 10 బంతుల్లోనే శతకం బాదారు. అంతకుముందు 31 బంతుల్లో జాక్స్ ఫిఫ్టీ చేశారు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. మోహిత్ వేసిన ఓవర్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు.. రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు. అతడి ధాటికి బంతి ఎక్కడ వేయాలో తెలియక రషీద్ ఖాన్ బెంబేలెత్తిపోయారు.

TG: గుడిలో ఉండాల్సిన దేవుడిని బీజేపీ నేతలు రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీలను మోసం చేసేందుకు మోదీ సిద్ధమయ్యారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది. రాష్ట్రానికి నిధులు అడిగితే జై శ్రీరామ్ అంటున్నారు. షెడ్డుకు పోయిన కారు ఇక రాదు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ బయల్దేరారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 44 రన్స్ తేడాతో గెలిచింది. మొదట భారత్ 145/7 స్కోర్ చేయగా, అనంతరం బంగ్లా 101/8కే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యస్తికా 36, షఫాలీ 31, హర్మన్ ప్రీత్ 30 రన్స్ చేశారు. బౌలర్లలో రేణుక సింగ్ 3, పూజా వస్త్రాకర్ 2 వికెట్లు తీయగా, శ్రేయాంక, దీప్తి, రాధ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 మ్యాచ్ ఎల్లుండి జరగనుంది.

తమ ఉత్పత్తుల్లో పురుగుమందు ఆనవాళ్లు ఉన్నట్లు సింగపూర్, హాంకాంగ్ చేసిన ఆరోపణలను మసాలా దినుసుల కంపెనీ MDH ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆరోపణలకు రుజువు లేదని పేర్కొంది. మరోవైపు ఎవరెస్ట్ కంపెనీ మాత్రం తమ ఫుడ్ ప్రొడక్ట్స్ సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ పరిశీలనలో ఉన్నట్లు తెలిపింది.

TG: తాను తలచుకుంటే ఎవరూ బయట తిరగలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను పోలీస్ రాజ్యం నడపను. రేవంత్ అనే పదం కొందరికి లైఫ్ లైన్‌గా మారింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. అది ఎక్కడికెళ్లి ఆగుతుందో తెలియదు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెబుతాం. BJP నేతల మాటల్లోనే భయం కనిపిస్తోంది. నేను పాలనపై దృష్టి పెడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

TG: తాను బరాబర్ గుంపు మేస్త్రీనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KCRలాగా చిల్లర పనులు చెయ్యను. నా కూతురు పెళ్లికి నన్ను కేసీఆర్ జైల్లో పెడితే.. ఆయన కూతురు కవిత ఇప్పుడు జైల్లో ఉంది. కేసీఆర్‌లాగా నేను పోలీసులను వాడను. ఆయన సలహాలిస్తానంటే ఇంటికెళ్లి కలుస్తా. పదేళ్లు సీఎం పదవి మాదే. ఏ ఎమ్మెల్యేను పార్టీలోకి రావాలని నేను కోరలేదు. వారే స్వయంగా పార్టీలోకి వచ్చారు’ అని ఆయన పేర్కొన్నారు.

AP: ఎన్డీఏ మేనిఫెస్టోను ఎల్లుండి ప్రకటించనున్నట్లు JSP అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. TDP-JSP-BJP కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని అన్నారు. ‘PM మోదీ దగ్గర ఏదైనా మాట్లాడాలంటే జగన్‌కు భయం. ఆయన దగ్గరకు వెళ్లి కేసులు కొట్టేయాలని కోరుతారు. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. మోదీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. కష్టాల్లో ఉన్న రైతుల కన్నీరు తుడవడమే నాకు ఆనందం’ అని ఏలేశ్వరం సభలో వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.