news

News April 20, 2024

MLAగా రఘురామకృష్ణరాజు పోటీ.. ఎక్కడి నుంచంటే?

image

AP: టీడీపీ నేత రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు అసెంబ్లీ సీటు ఖరారైంది. ప.గో. జిల్లా ‘ఉండి’ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ హైకమాండ్ తనను ఆదేశించిందని రఘురామ తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తానని చెప్పారు. పార్టీ నుంచి బీఫాం అందుకుని ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు.

News April 20, 2024

మేడిగడ్డ నిర్మాణం పూర్తికాకుండానే సర్టిఫికెట్

image

TG: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ‘బ్యారేజీ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆ గడువు పెంచారు. కానీ నిర్మాణం మాత్రం నిర్దేశిత గడువులోనే అయిపోయిందని ఇంజినీర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. దీనిని పొరపాటుగా భావించాలని సంబంధిత ఇంజినీర్లు కోరారు’ అని నివేదికలో పేర్కొన్నారు.

News April 20, 2024

ఈనెల 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 22 నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. ఇందుకు అనుమతించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌రాజ్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ యాత్రలో భాగంగా కేసీఆర్ పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతో పాటు వివిధ వర్గాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

News April 20, 2024

మూడోసారి గెలిస్తే UCC అమలు చేసి తీరుతాం: అమిత్ షా

image

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేసి తీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ‘మన దేశం షరియా చట్టాలపై నడవాలా? వ్యక్తిగత చట్టాలపైన నడవాలా? ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ వ్యక్తిగత చట్టాలకు చోటు లేదు. మరి భారత్‌లో ఎందుకున్నట్టు? పలు ముస్లిం దేశాలే షరియా చట్టానికి దూరంగా ఉంటున్నాయి. మనమూ ముందడుగు వేయాలి’ అని తెలిపారు.

News April 20, 2024

‘సైబర్’ సైన్యాన్ని సిద్ధం చేస్తున్న చైనా!

image

బలమైన సైన్యం ఇప్పటికే పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మిలిటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదే సైబర్ సైన్యం. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్‌గా పిలిచే ఈ విభాగానికి యుద్ధాలను గెలిపించే సామర్థ్యం ఉందని డ్రాగన్ భావిస్తోంది. దీనికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

News April 20, 2024

షమీపై ప్రధాని మోదీ ప్రశంసలు

image

టీమ్‌ఇండియా బౌలర్ మహమ్మద్ షమీపై ప్రధాని మోదీ ప్రశంసలు కురింపించారు. ‘ప్రపంచకప్‌లో షమీ భాయ్ ఎంత బాగానే రాణించారో ప్రపంచమంతా చూసింది. క్రీడల్లో ఆయన చేసిన అద్భుత కృషికి మెచ్చి కేంద్రం అర్జున అవార్డు ఇచ్చి ప్రోత్సహించింది. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో రెండడుగులు ముందుకు వేశారు. యువత కోసం స్టేడియం కట్టిస్తున్నారు’ అని యూపీలో షమీ సొంతూరైన అమ్రోహాలో పర్యటించిన సందర్భంగా పేర్కొన్నారు.

News April 20, 2024

త్రిపుర ప్రజలు గ్రేట్.. దేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం

image

21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిన్న జరిగిన లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో త్రిపుర అత్యధిక పోలింగ్ పర్సెంట్‌ను నమోదు చేసింది. సాయంత్రం 5 గంటలకే 80.40% రికార్డ్ అయింది. అప్పటికి ఇంకా 23వేల మంది బారులు తీరారు. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం మరో 2-3% పెరిగే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ <<13080619>>సరిహద్దులో<<>> ఉంటున్న దాదాపు 2500 మంది భారతీయులు బోర్డర్ దాటి వచ్చి త్రిపురలో ఓటు వేశారు.

News April 20, 2024

ఈ తెగ ప్రజలు మొదటిసారి ఓటేశారు

image

దేశంలో నిన్న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అండమాన్ & నికోబార్ దీవుల్లో షొంపెన్ తెగకు చెందిన ఏడుగురు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బూత్ వద్ద నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లోనూ 56 గ్రామాల ప్రజలు మొదటిసారి ఓటు వేశారు. <<-se>>#Elections2024<<>>

News April 20, 2024

అయ్యో పాపం.. సత్తా ఉన్నా దురదృష్టం అడ్డుకుంది

image

భారత రెజర్లు దీపక్ పూనియా, సుజీత్ కల్కల్‌ను దురదృష్టం వెంటాడింది. కిర్గిస్థాన్‌లో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనేందుకు వారిని నిర్వాహకులు అనుమతించలేదు. స్టేడియంకు ఆలస్యంగా రావడమే కారణం. వరదల కారణంగా దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన వీరు నిన్న ఉదయం 8 గంటలకు కిర్గిస్థాన్‌ చేరుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. అయితే వీరు టర్కీలో జరిగే క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది.

News April 20, 2024

మీ పర్సనల్ డేటా సేఫ్: డిజీ యాత్ర

image

డిజీ యాత్ర యాప్ ప్రయాణికుల పర్సనల్ డేటా సేకరిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఆ సంస్థ స్పందించింది. ”ప్రయాణికుల వ్యక్తిగత వివరాలను యాప్ సేకరించదు. ఆ వివరాలు కేవలం యూజర్ల ఫోన్‌లోనే ఉంటాయి. ఈ డేటాను డిజీ యాత్ర సహా మరెవరూ యాక్సెస్ చేయలేరు” అని స్పష్టం చేసింది. కాగా ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో బోర్డింగ్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు కేంద్రం ఆధ్వర్యంలో ఈ డిజీ యాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి.