news

News April 25, 2024

ఆ బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్

image

దేశంలోని కీలక బ్యాంకులు సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించాయి. ICICI, ఎస్ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. మే 1 నుంచి సవరించిన కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయి. కాగా ఈ బ్యాంకులు డెబిట్ కార్డు, చెక్ బుక్, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు, ఏటిఎం ట్రాన్సాక్షన్స్, ఇతర లావాదేవీలకు వసూలు చేసే ఛార్జీలను సవరించాయి.

News April 25, 2024

జగన్ ఇక బ్యాండేజీ తీస్తే బెటర్: సునీత

image

AP: సీఎం జగన్ ఇక బ్యాండేజీ తీస్తే బెటర్ అని వైఎస్ సునీత అన్నారు. గాలి ఆడితే ఆ గాయం త్వరగా మానిపోతుందని చెప్పారు. ‘అవినాశ్ రెడ్డి చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నారా? చిన్న పిల్లలకు పదవులెలా ఇచ్చారు? వివేకా మీకేం పాపం చేశారో ప్రజలకు సమాధానం ఇవ్వాలి. చనిపోయేదాకా జగన్ కోసమే ఆయన పనిచేశారు. వివేకా అంటే ఎందుకింత ద్వేషం? కోర్టులు, పోలీసులు అంటే CMకు గౌరవం లేదు’ అని ఆమె మండి పడ్డారు.

News April 25, 2024

అవినాశ్ అమాయకుడు అయితే హంతకుడు ఎవరు?: సత్యకుమార్

image

AP: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ సంచలన ట్వీట్ చేశారు. సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘అవినాష్ రెడ్డీ అమాయకుడు అయితే మరి హంతకుడు ఎవరు? అర్ధరాత్రి మొబైల్ ఫోన్లలో మంతనాలు నడిపింది ఎవరు? గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించమని చెప్పింది ఎవరు? పాత్రధారిని, సూత్రధారిని రక్షిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నది ఎవరు?’ అని ప్రశ్నించారు.

News April 25, 2024

మలి విడత ప్రచారానికి జగన్ సిద్ధం!

image

AP: సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర నిన్నటితో ముగిసింది. ఇవాళ నామినేషన్ వేసిన జగన్.. మలి విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 27 లేదా 28న ప్రచారం ప్రారంభం కానుంది. పోలింగ్ జరిగే నాటికి 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా వైసీపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది.

News April 25, 2024

ఈరోజు SRH ఎంత స్కోర్ చేస్తుంది?

image

నేటి SRHvsRCB మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 287 రన్స్ చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఇదే సీజన్‌లో ముంబైపై 277, ఢిల్లీపై 266 రన్స్ చేయడంతో SRH బ్యాటింగ్ విధ్వంసం చూసి ప్రత్యర్థుల వెన్నులో వణుకు మొదలైంది. ఈరోజు RCBపై SRH ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News April 25, 2024

మోదీజీ.. మేనిఫెస్టో వివరించడానికి టైమ్ ఇవ్వండి: ఖర్గే

image

కాంగ్రెస్ ప్రజల సొమ్మును లాక్కొంటుందని ఆ పార్టీ మేనిఫెస్టో సూచిస్తోందని ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘మీ సలహాదారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. పూర్తిగా విషయం అర్థం చేసుకోకుండా కొన్ని పదాలు వాడి సమాజంలో విభేదాలు తేవడం మీకు అలవాటు అయిపోయింది. టైమ్ కేటాయిస్తే నేనే స్వయంగా మీకు మేనిఫెస్టో వివరిస్తాను’ అని మోదీకి లేఖ రాశారు.

News April 25, 2024

కాంగ్రెస్‌లోకి మండలి ఛైర్మన్ గుత్తా?

image

TG: శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. తాజాగా నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఆయనను కలిశారు. ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని గుత్తాను కోరారు. కాగా తొలుత సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు టాక్.

News April 25, 2024

హామీల అమలు సాధ్యమా? కాదా?

image

TG: రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘కాంగ్రెస్ హామీల అమలు’ గురించే చర్చ. నేతలైతే రాజీనామాల సవాళ్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తామని ఓవైపు BRS నేతలు సవాల్ విసురుతుంటే.. అమలు చేసి చూపిస్తామని కాంగ్రెస్ నేతలు సైతం ప్రతిసవాళ్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే హామీల అమలు అంత కష్టమైందా? అసలు సాధ్యమేనా? అనే సందేహం చాలామందిలో నెలకొంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

News April 25, 2024

ఠారెత్తిస్తున్న ఎండలు.. కారణమిదే!

image

వేసవి మండిపోతోంది. బయటికెళ్తే చాలు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో పరిస్థితేంటోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని ఐక్యరాజ్యసమతి వాతావరణ విభాగం ముందే చెప్పింది. గత ఏడాది మొదలైన ఎల్‌నినోయే దీనిక్కారణమని వివరించింది. ‘పసిఫిక్’పై ఉష్ణోగ్రతలు పెరగడమే ఎల్‌నినో. అయితే, మే చివరికల్లా వానలు వచ్చేస్తాయని నిపుణులు చెబుతుండటం కొంచెం ఊరటనిచ్చే అంశం.

News April 25, 2024

ఎన్నికల బరిలో రచయిత జొన్నవిత్తుల

image

AP: ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సినిమాల్లో 600కు పైగా పాటలు రాసిన జొన్నవిత్తుల.. పేరడీ సాంగ్స్‌తో మరింత పాపులర్ అయ్యారు. గతంలో ఆయన బీజేపీలో చేరి, ఆ తర్వాత బయటికొచ్చారు.