India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లోక్‌సభ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల్లో భువనగిరి సీటు నుంచి సీపీఎం తరఫున పోటీ చేస్తోన్న ఎండీ జహంగీర్ స్పెషల్. గతంలో జహంగీర్ సర్పంచ్‌గా చేసిన ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఆయన పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించారట. నామినేషన్ కోసం చందాలేసుకొని రూ.25వేలు జమచేసి ఆయనకు అందించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరలవుతోంది.

TG: ఏపీలో అసెంబ్లీతోపాటు MP ఎన్నికలు కూడా జరుగుతుండటంతో హైదరాబాద్‌లోని పలు పార్టీల ఎంపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ స్థానాల్లో సెటిలర్ల ఓట్లు లక్షల్లో ఉన్నాయి. వీరంతా ఓటేయడానికి APకి పయనమవుతున్నారు. కానీ ఇక్కడే ఓటేయాలంటూ తెలంగాణ నేతలు ప్రాధేయపడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.5వేల వరకు ఇస్తున్నట్లు టాక్. డబ్బుతోపాటు బహుమతులు కూడా ఇస్తున్నట్లు సమాచారం.

TG: ఎల్లుండే పోలింగ్ కావడంతో ఓటరు చీటీల పంపిణీ వేగంగా జరుగుతోంది. అయితే చీటీల్లో పోలింగ్ వేళలు పాతవే ఉండటం ఓటర్లను అయోమయానికి గురి చేస్తోంది. సాధారణంగా పోలింగ్ సమయం ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు ఉంటుంది. ఎండాకాలం కావడంతో సమయం పెంచాలన్న రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈసీ సా.6 గంటల వరకు పొడిగించింది. కానీ చీటీల్లో మాత్రం పాత టైమింగ్సే ఉన్నాయి. అప్పటికే చీటీలు ప్రింట్ కావడమే అందుకు కారణమని తెలుస్తోంది.

AP: వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు ఏపీకి తరలివస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం అత్యంత రద్దీగా మారింది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఓటర్లు ఇక్కడ దిగుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో స్థిరపడ్డ వారు సైతం సొంతూళ్లకు తరలివస్తున్నారు. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఈసారి ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

TG: ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ‘బస్సు యాత్ర ద్వారా ఆయన ఏం తెలుసుకున్నారు? ప్రజల మూడ్ ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఎంత ఉంది?’ అనే ప్రశ్నలన్నింటికీ ఆయన ప్రెస్‌మీట్‌లో సమాధానం చెప్పబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.

➢ఓటర్ హెల్ప్‌లైన్: ఓటరు జాబితాలో పేరు పరిశీలన, అభ్యర్థుల సమాచారం, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ ఎంత ఉంది, ఎన్నికల ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
➢సి.విజిల్: ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదు సక్షమ్ ECI: దివ్యాంగుల సహాయార్థం ➢నో యువర్ క్యాండిడేట్: అభ్యర్థుల పూర్తి వివరాలు
➢ఈ-ఎపిక్: ఓటు కార్డు లేని వారు దీని నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఓటు వేయొచ్చు ➢ఓటరు టర్నౌట్: పోలింగ్ రోజు ఓటింగ్ శాతం సమాచారం.

పోలింగ్ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల చూపు పిఠాపురంపై పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గం పేరు ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇతర నటులు పవన్‌కు మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన పవన్.. ఈసారి గెలిచి చట్టసభల్లోకి అడుగుపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జగన్ ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు.

ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈనెల 11 నుంచి 13 వరకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో, విమాన టికెట్ ధరలు 20-30% పెరిగాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి వైజాగ్‌కి ₹4,500 ఉండే టికెట్ ధర ఈనెల 12వ తేదీకి ₹6,500కి చేరింది. హైదరాబాద్-కొచ్చి ధర ₹5వేల నుంచి ₹7వేలకు పెరిగింది. రద్దీని బట్టి ఛార్జీలుంటాయని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

టీ20 వరల్డ్ కప్ కోసం నమీబియా తమ జట్టును ప్రకటించింది. 18 మందితో కూడిన జట్టుకు ఎరాస్మస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టు: ఎరాస్మస్ (C), గ్రీన్, లింగెన్, లీచెర్, రూబెన్, ట్రంపుల్‌మన్, బ్రస్సెల్, షికాంగో, లుంగమేని, డెవిన్, స్మిత్, ఫ్రైలింక్, కొట్జే, డేవిడ్ వీజ్, బెర్నార్డ్, స్కాల్జ్, క్రూగర్, బ్లిగ్నాట్.

AP: వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల పంపిణీని ఈసీ అడ్డుకోవడంపై వైసీపీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించింది. ‘ఏపీలోని పేద, మధ్యతరగతి ప్రజలంటే నీకు ఎందుకంత కక్ష చంద్రబాబు? ఎందుకు పేదింటి మహిళలు, రైతులు, పిల్లలకు వచ్చే సంక్షేమ పథకాలను ఆపాలనుకుంటున్నావ్?’ అని Xలో ప్రశ్నించింది.
Sorry, no posts matched your criteria.