India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD మెట్రో రైలు నిర్వహణ బాధ్యతల నుంచి 2026 తర్వాత తప్పుకోవాలని భావిస్తున్నట్లు L&T ప్రెసిడెంట్ శంకర్ రామన్ వెల్లడించారు. ‘ప్రస్తుత రైడర్‌షిప్ దృష్ట్యా మాపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సగటున రోజుకు 4,80,000 మందే ప్రయాణిస్తున్నారు. ఫ్రీ బస్ స్కీమ్‌తో మెట్రోలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. నాన్ కోర్ బిజినెస్ నుంచి తప్పుకోవాలనుకోవడం కూడా మరో కారణం’ అని తెలిపారు.

పవిత్రమైన అక్షయ తృతీయ రోజున అయోధ్యలోని బాలరాముడికి మామిడి పండ్లను నైవేద్యంగా ఉంచారు. మామిడిపండ్లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, కివి ప్రూట్, గ్రేప్స్‌తో పాటు మ్యాంగో జ్యూస్ బాటిళ్లను సైతం స్వామివారికి సమర్పించారు. గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలకు సైతం పండ్లను వేలాడదీయడం ఆకర్షణీయంగా ఉంది. దీంతోపాటు అస్సాంలో తయారు చేసిన ప్రత్యేక బంగారు వస్త్రాలతో రామయ్యను ముస్తాబు చేశారు.

AP: రాష్ట్రంలో ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో నగదు పంపిణీ లెక్కలు మారిపోతున్నాయి. ఇప్పటికే రూ.3వేల వరకు పంపిణీ జరిగిపోయినట్లు సమాచారం. అయితే ప్రత్యర్థి పార్టీ నగదు మొత్తాన్ని పెంచడంతో అవతలి పార్టీ కూడా మరింత పెంచి ఇస్తోందట. పోటాపోటీగా సాగుతున్న పంపకాల్లో కొన్నిచోట్ల ఓటుకు రూ.5000 దాటి పోయినట్లు తెలుస్తోంది. పెంచిన మొత్తాన్ని ఇవాళ, రేపు ఓటర్లకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

AP: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం ఈ ఎన్నికల్లో వైవిధ్యభరితమైన పాత్ర పోషించనుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈ మండలం NTR జిల్లాలో అంతర్భాగమైనప్పటికీ కృష్ణా జిల్లాతో ఎన్నికల సంబంధాన్ని కలిగి ఉంది. ఈ మండలంలోని 16 గ్రామాలు NTR జిల్లాలో, మరో 9 గ్రామాలు కృష్ణా(D)లోకి చేరాయి. దీంతో ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్‌కి ఓటేయనున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

సంచలనం రేపిన ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారాన్ని బయటపెట్టిన బీజేపీ నేత దేవరాజే గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ స్థలాన్ని విక్రయించే విషయంలో గౌడ తనను లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు. కాగా దేవరాజే గౌడ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో BJP తరఫున పోటీ చేసి ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ చేతిలో ఓడిపోయారు.

ఐపీఎల్-17 సీజన్ మరో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. మరే సీజన్‌లోనూ ఇన్ని శతకాలు నమోదు కాలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు గిల్, సుదర్శన్ సెంచరీలు చేయడంతో ఈసారి శతకాల సంఖ్య 14కు చేరింది. కాగా 2023 సీజన్‌లో 12 సెంచరీలు నమోదయ్యాయి. అలాగే 2022లో 8, 2016లో 7, 2008/11/12/19లో ఆరు శతకాలు రికార్డుల్లోకి చేరాయి.

ఓటేసే సమయంలో కొన్నిసార్లు అన్ని సర్టిఫికేట్లు సరిగ్గా ఉన్నా ఓటర్లపై ఏజెంట్లు సందేహం వ్యక్తం చేసి నకిలీ వ్యక్తని ఓటేయనివ్వరు. అప్పుడు పోలింగ్ అధికారికి రూ.2 చెల్లించి FORM-14లో పేరు, అడ్రెస్ రాసిచ్చి వారి ఐడెంటిటీని నిరూపించుకొని ఓటేయొచ్చు. దీంతోపాటు మీ ఓటు ఆల్రెడీ ఇంకెవరో వేశారంటే వెంటనే పోలింగ్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేయాలి. టెండర్ ఓటును డిమాండ్ చేయొచ్చు. టెండర్ ఓటు పడితే రీపోలింగ్‌కు అవకాశం ఉంది.

నిన్న CSKతో మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా GT కెప్టెన్ గిల్‌కు BCCI రూ.24 లక్షల ఫైన్ వేసింది. అలాగే 10 మంది టీమ్ సభ్యులకు, ఇంపాక్ట్ ప్లేయర్లకు రూ.6 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ సీజన్‌లో GT ప్లేయర్లకు జరిమానా వేయడం ఇది రెండోసారి. కాగా నిన్నటి మ్యాచులో గిల్, సాయిసుదర్శన్ సూపర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో GT 35 రన్స్ తేడాతో గెలుపొందింది.

AP: ఎన్నికల వేళ మద్యం కోసం మందుబాబులు షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఓట్ల కోసం నేతలు డబ్బులు పంచడం, మద్యం అమ్మకాలపై ఈసీ ఆంక్షలు విధించడం, వైన్స్ షాపుల్లో స్టాక్ ఉండకపోవడం దీనికి కారణమని తెలుస్తోంది. నిన్న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ వైన్ షాప్ వద్ద జనం ఇలా లైన్‌లో కనిపించారు. దీంతో మద్యం కోసం చూపే ఈ ఉత్సాహాన్ని ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చూపించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

TG: ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో జీన్స్, టీ షర్టులు వేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫామ్ ధరిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్స్‌లోనే కార్పొరేషన్, డిపోలకు వస్తున్నారు. ఈక్రమంలో అందరూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మల్స్, యూనిఫామ్‌లో రావాలని ఎండీ సూచించారు.
Sorry, no posts matched your criteria.