India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజా, ఆయన భార్య నేహాపై కేసు నమోదైంది. ఇటీవల జ్ఞాన్‌వేల్ ఇంట్లో నగలు మాయమయ్యాయి. వాటిని పనిమనిషి లక్ష్మీ తీసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల విచారణతో మనస్తాపానికి గురైన లక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పనిమనిషి కుమార్తె జ్ఞాన్‌వేల్ రాజా, నేహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిని చిత్రహింసలకు గురి చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు జరగ్గా పంజాబ్ కింగ్స్ ఏ జట్టునూ 200 పరుగులు చేయనీయలేదు. బెంగళూరుకు ఇచ్చిన 199 పరుగులే అత్యధికం. మిగతా 9 జట్లూ ప్రత్యర్థులకు 200పైగా స్కోర్లు ఇచ్చుకున్నాయి. పంజాబ్ బౌలింగ్ యావరేజ్ 24.94గా ఉంది. ఆ జట్టు తర్వాత కేకేఆర్‌కు మాత్రమే మెరుగైన బౌలింగ్ యావరేజ్ ఉంది. కాగా పంజాబ్ ఇప్పటివరకు టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనే గెలిచింది.

ఢిల్లీ హైకోర్టులో ఐటీ నిబంధనలపై విచారణ సందర్భంగా వాట్సాప్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతోనే యూజర్లు తమ సమాచారం సేఫ్‌గా ఉందనే ధీమాతో వాట్సాప్ వాడుతున్నారు. ఒకవేళ మమ్మల్ని కేంద్రం ఈ ఎన్‌క్రిప్షన్ తొలగించమంటే ఇండియాలో మా సేవలను రద్దు చేసుకుంటాం. 2021లో తెచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రకారం లక్షల మెసేజ్‌లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాలి. ఈ రూల్ ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని పేర్కొంది.

TG: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది.

AP: YCP అభ్యర్థులు కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్లకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. నామినేషన్ పత్రాల్లో నాని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆర్వోకు TDP ఫిర్యాదు చేసింది. సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది. చివరికి నామినేషన్‌ను ఆమోదించినట్లు ఆర్వో ప్రకటించారు. బుగ్గన తన ఆస్తులను పూర్తిగా వెల్లడించలేదని TDP అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టిన ఆర్వో.. తర్వాత ఆమోదించారు.

విదేశీ మారకపు నిల్వలు మరోసారి క్షీణించాయి. ఏప్రిల్ 19 నాటికి $2.83 బిలియన్లు తగ్గి $640.33 బిలియన్లకు చేరినట్లు RBI వెల్లడించింది. మరోవైపు కరెన్సీ అసెట్స్ $3.79 బిలియన్లు తగ్గి $560.86 బిలియన్లకు క్షీణించింది. కాగా అంతకుముందు వారం (ఏప్రిల్ 12 నాటికి) ఫోరెక్స్ నిల్వలు $5.4 బిలియన్లు తగ్గి $643.16 బిలియన్లుగా నమోదైంది. అయితే బంగారం నిల్వలు మాత్రం $1.01 బిలియన్లు పెరిగి $56.82 బిలియన్లకు చేరాయి.

AP: భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలను వైఎస్ జగన్ అడ్డుకోవాలని చూశారని రాజోలు వారాహి సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘నేను వెళ్లి జగన్‌ను బతిమిలాడతాను అని అనుకున్నాడు. అవసరమైతే ఉచితంగా ఇంటర్నెట్‌లో సినిమాలను వదిలే వ్యక్తిని నేను. నా ఆత్మగౌరవాన్ని తగ్గించుకోను’ అని పవన్ స్పష్టం చేశారు. 18 రోజుల్లో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఆ తర్వాత అవినీతిపరుల భరతం పడతామని పవన్ హెచ్చరించారు.

కోల్‌కతాతో మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచింది. కెప్టెన్ సామ్ కరన్ బౌలింగ్ ఎంచుకున్నారు.
KKR: సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయస్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
** గాయం కారణంగా స్టార్ బౌలర్ స్టార్క్ దూరమయ్యారు.
PBKS: బెయిర్‌స్టో, కరన్, రోసౌ, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, అశుతోష్, బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్

AP: జగన్ లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలాంటి రౌడీలకు తాను భయపడనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘గులకరాయి నిందితులను పట్టుకుంటారు కానీ.. రథాలు కాల్చిన వారిని పట్టుకోలేరు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన YCP ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలేవీ? అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న YCPని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ఇప్పటికే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా SRH 108 సిక్సర్లు బాదింది. 90 సిక్సర్లతో ఆర్సీబీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ (86), ముంబై (85), కోల్‌కతా (69), సీఎస్కే (65), రాజస్థాన్ (64), లక్నో (62), పంజాబ్ (61), గుజరాత్ (39) ఉన్నాయి. అలాగే 143 ఫోర్లు కొట్టి బెంగళూరు అగ్ర స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఢిల్లీ (139) ఉంది. మూడో స్థానంలో గుజరాత్ (137) కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.