news

News April 12, 2024

మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందే: హైకోర్టు

image

సాధారణంగా విడాకుల తర్వాత భార్యలకు భర్తలు భరణం ఇవ్వడం గురించి వింటుంటాం. తాజాగా భరణం విషయంలో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సంపాదించే మహిళ.. అనారోగ్యం, వైద్య పరమైన ఇబ్బందులతో జీవనోపాధి పొందలేని స్థితిలో ఉన్న మాజీ భర్తకు భరణం చెల్లించాలని పేర్కొంది. బ్యాంకు మేనేజర్‌ అయిన ఓ మహిళ తన మాజీ భర్తకు భరణం చెల్లించలేనని వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు నెలకు రూ.10వేల భరణం చెల్లించాలంది.

News April 12, 2024

IPL: నేడు లక్నోతో ఢిల్లీ ఢీ

image

IPL-2024లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు టీమ్‌లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా, 3 మ్యాచుల్లోనూ LSG గెలిచింది. ప్రస్తుత సీజన్ పాయింట్స్ టేబుల్‌లో లక్నో 3 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ ఒక్క విజయంతో చివరి స్థానంలో ఉంది.

News April 12, 2024

2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములు: ఇస్రో ఛైర్మన్

image

జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీనికోసం శ్రీహరికోటలోని షార్‌లో మూడో ప్రయోగ వేదిక నిర్మిస్తామన్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2028లో చంద్రయాన్-4ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భవిష్యత్తు ప్రయోగాల కోసం టెక్నాలజీని మెరుగుపరుచుకుంటున్నామని పేర్కొన్నారు.

News April 12, 2024

త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక

image

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ఉపఎన్నికల జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి వారం, 10 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయాలని ఈసీఐ నిర్ణయించింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో శాసనమండలిలో ఈ సీటు ఖాళీ అయింది. ఖాళీ అయిన తర్వాత నుంచి 6 నెలల్లో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ తేదీలపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

News April 12, 2024

IPL: పవర్‌ప్లేలో అత్యధిక స్కోరింగ్ రేటు ఆ జట్టుదే

image

IPL-2024లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరింగ్ రేటు కలిగిన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (11.33) తొలి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్ (10.70), సన్‌రైజర్స్ హైదరాబాద్ (10.67), ఢిల్లీ క్యాపిటల్స్ (9.07), చెన్నై సూపర్ కింగ్స్ (8.77) ఉన్నాయి.

News April 12, 2024

నేడు 62 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలోని 62 మండలాల్లో ఇవాళ వడగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీస్తాయని, రేపు 33 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడగాలుల వీచే మండలాల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 12, 2024

తెలంగాణలో ఎన్నికలకు టీడీపీ దూరం!

image

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకూడదని TDP నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి వెల్లడించారు. APలో NDAలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, TGలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై మహానాడులో నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

News April 12, 2024

ఆ పరీక్షను మళ్లీ నిర్వహించండి: హైకోర్టు

image

TG: గురుకులాల్లో ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి మరోసారి నియామక పరీక్ష నిర్వహించాలని TREI-RBను హైకోర్టు ఆదేశించింది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో పరీక్ష పేపర్ ఇవ్వాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో తెలుగు, ఇంగ్లిష్‌లో పరీక్ష ఉంటుందని పేర్కొని, కేవలం ఇంగ్లిష్‌లోనే పరీక్షను నిర్వహించడంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను మళ్లీ నిర్వహించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది.

News April 12, 2024

ఎన్నికల సిరాను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?

image

ఓటర్ల చేతి వేలికి వేసే సిరాను కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీలో తయారు చేస్తారు. దీని తయారీ ఫార్ములా రహస్యంగా ఉంటుంది. అక్కడ పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు మాత్రమే ఫార్ములా తెలుస్తుంది. వారు తమ రిటైర్మెంట్ సమయంలో నమ్మకస్తులైన తర్వాతి ఉద్యోగులకు దానిని బదిలీ చేస్తారు. ఈసారి ఎన్నికల్లో ₹55కోట్ల విలువైన 26.55 లక్షల ఇంక్ వయల్స్‌ను వినియోగించనున్నారు. <<-se>>#Elections2024<<>>

News April 12, 2024

30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

image

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024 స్క్రీనింగ్ కాంపిటీషన్‌కు భారతీయ సినిమా ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ ఎంపికైంది. మే 14 నుంచి 25 వరకు ఈ ఫెస్టివల్ జరగనుండగా, పోటీలో ప్రదర్శించే సినిమాల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. భారత్ నుంచి 1994లో ‘స్వహం’ అనే మూవీ తొలిసారిగా ఈ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపికైంది. ఆ తర్వాత మళ్లీ 30 ఏళ్లకు ఇప్పుడు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సెలక్ట్ అయింది.