news

News April 3, 2024

విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒకే వేదికపై 100 టీ20 మ్యాచులు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచారు. నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో మ్యాచులో కింగ్ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(వాంఖడే-80 మ్యాచులు), ధోనీ(చెపాక్-69 మ్యాచులు) ఉన్నారు.

News April 3, 2024

లోక్‌సభ పోటీ నుంచి తప్పుకున్న తెలుగు నటి

image

ప్రముఖ నటి సుమలత పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య స్థానం నుంచి పోటీ చేయట్లేదని, తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఆమె.. కర్ణాటకలో తొలి స్వతంత్ర మహిళా MPగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హెచ్ డీ కుమార స్వామి కోసం పోటీ నుంచి తప్పుకున్నారు.

News April 3, 2024

ఒడిశాలో ‘ఫ్యామిలీ’, ‘స్టార్’ ఎఫెక్ట్ కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? – 1/2

image

ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కుటుంబం, స్టార్లకే ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. డబుగామ్ అసెంబ్లీ సీటు నుంచి మాజీ MLA భుబ్‌బల్ కుమార్తె లిపికా బరిలో నిలవనున్నారు. ఇక భుజ్‌బల్ నాబరంగపుర్ నుంచి MPగా పోటీ చేయనున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి భక్త చరణ్ దాస్, ఆయన కుమారుడు సాగర్.. నార్ల, భవానీపట్న అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు.
<<-se>>#Elections2024<<>>

News April 3, 2024

ఒడిశాలో ‘ఫ్యామిలీ’, ‘స్టార్’ ఎఫెక్ట్ కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? – 2/2

image

బాలంగిర్‌ అసెంబ్లీ సీటులో నటుడు మనోజ్ మిశ్రాను బరిలో నిలిపింది. తల్సరాలో భారత్ హాకీ మాజీ కెప్టెన్ ప్రబోధ్ తిర్కేను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక చికిటి అసెంబ్లీ సీటులో అన్నదమ్ములు తలపడనున్నారు. అన్న రవీంద్రనారాయణ్ దయాన్‌ను కాంగ్రెస్ బరిలో నిలపగా, BJP అతని తమ్ముడు మనోరంజన్‌కు టికెట్ ఇచ్చింది. ఈ ‘ఫ్యామిలీ’, ‘స్టార్ల’ ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.
<<-se>>#Elections2024<<>>

News April 3, 2024

AA BIRTHDAY: ‘ఆర్య-2’ రీరిలీజ్ వాయిదా!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా థియేటర్లలో రచ్చ చేద్దామనుకున్న ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. ముందుగా అనుకున్నట్లు ఈనెల 8న ‘ఆర్య-2’ రీరిలీజ్ చేయట్లేదని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, జులాయి స్పెషల్ షోల స్క్రీనింగ్ కూడా వాయిదా పడింది. ఆయన బర్త్ డే రోజున ‘పుష్ప-2’ టీజర్ విడుదల కానుంది.

News April 3, 2024

నేను క్యాన్సర్‌తో పోరాడుతున్నా: బీజేపీ ఎంపీ

image

తాను గత 6 నెలల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నానని బిహార్ మాజీ సీఎం, బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించేందుకు ఇదే సరైన సమయమని భావించానని, లోక్‌సభ ఎన్నికల్లో తాను పాల్గొనలేనని ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని పీఎం మోదీకి తెలియజేశానన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

News April 3, 2024

అవినాశ్‌కు సిగ్గుంటే పోటీ నుంచి తప్పుకోవాలి: బీటెక్ రవి

image

AP: YS వివేకా హత్య కుట్ర గురించి షర్మిల కుండబద్దలు కొట్టినట్లు <<12975358>>చెప్పారని<<>> టీడీపీ నేత బీటెక్ రవి వెల్లడించారు. ‘కడప ఎంపీగా పోటీ చేయించేందుకు చిన్నాన్న ఒత్తిడి తెచ్చారని షర్మిల చెప్పారు. ఆమె పోటీకి ఒప్పుకున్నారని వివేకా జగన్‌కు చెప్పారు. ఆ తర్వాతే హత్యకు కుట్ర జరిగింది. అవినాశ్ రెడ్డికి సిగ్గుంటే ఎంపీగా పోటీ నుంచి తప్పుకోవాలి. వివేకాను హత్య చేసిన వ్యక్తిని జగన్ పోటీకి పెట్టారు’ అని ఆరోపించారు.

News April 3, 2024

రేపటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు

image

JEE మెయిన్ సెషన్-2 పరీక్షలు రేపటి నుంచి ఈనెల 12 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, 291 నగరాల్లో 544 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు రాయనున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి షిఫ్ట్, మ.3 నుంచి సా.6 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

News April 3, 2024

కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు

image

TG: మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. తనకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఇప్పటికే కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

News April 3, 2024

పవన్‌కు తీవ్ర జ్వరం.. పర్యటనలు రద్దు

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. నిన్న స్వల్పంగా ఉన్న జ్వరం ఇప్పుడు తీవ్రమైనట్లు జనసేన పార్టీ ప్రకటించింది. దీంతో ఇవాళ్టి తెనాలి, రేపటి నెల్లిమర్ల పర్యటనలను రద్దు చేసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. జ్వరంతో హైదరాబాద్‌కు వెళ్లిన జనసేనానికి కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు ట్వీట్ చేసింది. పర్యటన రీ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.