India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాధారణ వేగంతో రోజుకు 3600 అడుగులు వేయడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం 26శాతం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. బఫెలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 63 నుంచి 99 ఏళ్ల మధ్య వయసు గల 6వేల మంది అమెరికన్ మహిళలపై అధ్యయనం చేశారు. ఏడున్నర ఏళ్ల పాటు అధ్యయనంలో భాగంగా నడిచిన 407 మంది హార్ట్ పేషంట్స్‌లో గుండె ఆగిపోయే ప్రమాదం తక్కువగా ఉందని తెలిసింది.

TG: రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో సమీక్షించిన ఆమె.. ‘3 ప్రధాన జలాశయాల్లో నీటి లభ్యత ఉంది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం నిధులు విడుదల చేశాం. బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తయ్యాయి. SRSP, ఎల్లంపల్లి, సాగర్‌లో నీటి నిల్వలున్నాయి. ఏప్రిల్ 2వ వారంలో జలాశయాల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ నిర్వహిస్తాం’ అని తెలిపారు.

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఓడ ఢీకొన్న ఘటనలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్పకూలిన విషయం తెలిసిందే. కాగా ఈ ఓడలోని సిబ్బంది అంతా భారతీయులేనని గుర్తించారు. మొత్తం 22 మంది ఉన్నట్లు యూఎస్ పోలీసులు నిర్ధారించారు. సింగపూర్ ఫ్లాగ్ ఉన్న ఆ నౌక బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా బ్రిడ్జి ఘటనపై అమెరికా పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇది ఉగ్రదాడిగా సందేహం వ్యక్తం చేస్తోంది.

మనీ లాండరింగ్‌ను ఉద్దేశిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ట్విటర్‌లో వాషింగ్ మెషీన్ ఫొటోను షేర్ చేసింది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతాలోని పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, రూ.2.54 కోట్లు లభ్యమైనట్టు తెలిపింది. వాటిని సీజ్ చేసి, 47 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది.

తమిళంలో హిట్‌గా నిలిచిన ‘లవర్’ సినిమా OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జై భీమ్, గుడ్‌నైట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.మణికందన్ ఈ సినిమాలో నటించగా.. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ సినిమా ఇవాళ అర్ధరాత్రి(మార్చి 27) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. తెలుగులో ఫిబ్రవరి 10న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

AP: ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా CFMS ద్వారా గుత్తేదారులకు చెల్లింపులు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు ఈ మేరకు లేఖ రాసిన ఆయన.. ‘ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, OSD ధనుంజయ్ రెడ్డి CFMSను అధీనంలోకి తీసుకుని నిధులు మళ్లిస్తున్నారు. ఈ చెల్లింపులపై విచారణ జరపాలి. వాళ్లిద్దరిని విధుల నుంచి తప్పించాలి’ అని ఫిర్యాదు చేశారు.

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్లు క్వింటన్ డికాక్, అన్రిచ్ నోకియాకు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది. 2024-25 సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వీరిద్దరినీ తప్పించింది. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు లిస్టులో వీరిద్దరి పేర్లను చేర్చలేదు. అలాగే బర్గర్, జార్జి తొలిసారి కాంట్రాక్టు దక్కించుకున్నారు. కాగా ఐపీఎల్‌లో LSGకి డికాక్, DCకి నోకియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 13 వరకు గడువు ఉంది. ECE – 5, EEE – 7, మెకానికల్ – 13, CSE – 5 పోస్టులున్నాయి. జీతం రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక <
> SHARE

జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మండ్య పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మండ్య, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని కుమారస్వామి స్పష్టం చేశారు. 28 ఎంపీ స్థానాలు ఉన్న కర్ణాటకలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది.

అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ ఈ నెల 24న భూమిని తాకింది. గత 6 ఏళ్లలో భూమిని తాకిన అతి బలమైన భూ అయస్కాంత తుఫాన్ ఇదేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీని కారణంగా విద్యుత్ గ్రిడ్‌లు, నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్‌లలో చిన్న చిన్న అంతరాయాలు కలిగాయని NOAA స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది.
Sorry, no posts matched your criteria.