India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికాలోని టెక్సస్, కాన్సాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని ఆవుల పాలల్లో బర్డ్ ఫ్లూ ఉందన్న విషయం బయటపడింది. ఇది పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ఆవులు H5N1 టైప్-A బారిన పడ్డాయని, జంతువుల్లో ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందడం ఇదే తొలిసారి అని వైద్య వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన ఆవుల్లో బద్ధకం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నాయి.

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కాలిబాట సమీపంలో అటవీశాఖ సిబ్బంది చిరుతను గుర్తించారు. నిన్న రాత్రి చిరుత కెమెరాలకు చిక్కడంతో అధికారులు భక్తులను, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. నడకదారిలో భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు.

తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. కొయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 2019లో డీఎండీకే తరఫున ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచిన గణేశమూర్తికి ఈసారి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన మార్చి 24న పురుగు మందు తాగారు.

తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ YSR కడప, నంద్యాల, మన్యం, అల్లూరి, కాకినాడ జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఎన్నికలు దగ్గర పడటంతో <

* తొలి మ్యాచ్- RCBvsCSK, వేదిక చెన్నై, CSK విజయం
*2వ మ్యాచ్- DCvsPK, వేదిక చండీగఢ్, PK గెలుపు
*3వ మ్యాచ్- KKRvsSRH, వేదిక కోల్‌కతా, KKR విజయం
*4వ మ్యాచ్- RRvsLSG, వేదిక జైపూర్, RR గెలుపు
*5వ మ్యాచ్- GTvsMI, వేదిక అహ్మదాబాద్, GT విజయం
*6వ మ్యాచ్- PKvsRCB, వేదిక బెంగళూరు,RCB గెలుపు
*7వ మ్యాచ్- CSKvsGT, వేదిక చెన్నై, CSK విజయం
*8వ మ్యాచ్- SRHvsMI, వేదిక హైదరాబాద్, SRH గెలుపు

కర్ణాటక ఆర్టీసీ బస్సులో చిలుకలకు టికెట్ కొట్టిన వార్త వైరల్ అవుతోంది. ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. ‘శక్తి’ పథకంలో భాగంగా వారికి ఫ్రీ టికెట్ ఇచ్చిన కండక్టర్.. చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ₹444 ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ అరుదైన రికార్డు సాధించింది. మార్కెట్లో ఆ సంస్థ విలువ తాజాగా రూ.20లక్షల కోట్లకు చేరుకుంది. నిన్న సంస్థ షేర్ వాల్యూ రూ.2987ను తాకడంతో రిలయన్స్ విలువ రూ.70,039 కోట్ల మేర పెరిగి రూ.20,21,486 కోట్లను తాకింది. కాగా.. రిలయన్స్ తర్వాతి స్థానాల్లో TCS(రూ.14 లక్షల కోట్లు), HDFC (రూ.11 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్(రూ.7 లక్షల కోట్లు) ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లోని తాషీగంగ్‌లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గ్రామంలో 52 మంది ఓటర్లున్నారు. ఆ రాష్ట్రంలో 10 వేల నుంచి 12 వేల అడుగుల ఎత్తులో ఏకంగా 65 పోలింగ్ కేంద్రాలు, 12 వేల అడుగులకు పైగా ఎత్తులో 20 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు అధికారులు రెండు రోజుల మందుగానే చేరుకుంటారు.
<<-se>>#ELECTIONS2024<<>>

తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వ ఆఫీసులు భవనాలను, అతిథి గృహాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. కొనసాగించాలనుకుంటే అద్దె కట్టక తప్పదు. ఖాళీ చేయడమా లేక అద్దె చెల్లించి ఉండటమా అనే అంశంపై ఏపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూన్ 2 నాటికి ఏపీలో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ఛాన్స్ లేని నేపథ్యంలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
Sorry, no posts matched your criteria.