news

News April 2, 2024

రికార్డు సృష్టించిన ముంబై ఇండియన్స్

image

ఐపీఎల్‌లో 250 మ్యాచులు ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచుతో ఈ మైలురాయిని అందుకుంది. ఇప్పటివరకు 16 సీజన్లలో MI ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై తర్వాతి స్థానాల్లో వరుసగా బెంగళూరు (244), ఢిల్లీ (241), కోల్‌కతా (239), పంజాబ్ (235), చెన్నై (228) ఉన్నాయి.

News April 2, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 2, మంగళవారం
బహుళ షష్ఠి: ఉదయం 07:54 గంటలకు
విశాఖ: మధ్యాహ్నం 02:42 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 06:24-07:59 గంటల వరకు
వర్జ్యం: సాయంత్రం 06:54- 08:35 గంటల వరకు

News April 2, 2024

TODAY HEADLINES

image

* MLC కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
* KCR పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు: భట్టి
* చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్: కేటీఆర్
* జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా జరగాలి: సుప్రీం
* నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు: పవన్ కళ్యాణ్
* కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల
* రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దు: ఈసీ
* కేజ్రీవాల్‌‌కు ఈనెల 15 వరకు జుడీషియల్ రిమాండ్
* IPL: MIపై RR గెలుపు

News April 1, 2024

నిరుద్యోగులకు GOOD NEWS: రేపు SSC ఉద్యోగ నోటిఫికేషన్

image

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్-2024కు SSC షార్ట్ నోటీసు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టుల సంఖ్య, దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, పరీక్ష తేదీల వివరాలతో రేపు పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయనుంది.
వెబ్‌సైట్: <>https://ssc.nic.in/<<>>

News April 1, 2024

ముంబైకి మూడో ఓటమి

image

ముంబై వరుసగా మూడో మ్యాచులోనూ ఓడిపోయింది. తొలి 2 మ్యాచులు ఇతర వేదికల్లో జరగ్గా.. ఇవాళ సొంతగడ్డపైనా సత్తా చాటలేకపోయింది. బ్యాటర్లు విఫలం కావడంతో మూడో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత ముంబై 125 రన్స్ చేయగా.. రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి మరో 27 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. RR యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ (54*) తన జట్టుకు విజయాన్ని అందించారు. ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ 3 వికెట్లు తీశారు.

News April 1, 2024

మేం రూపాయి పన్ను చెల్లిస్తే 29 పైసలే తిరిగొస్తోంది.. ఎందుకు?: స్టాలిన్

image

కచ్చతీవు అంశంలో DMKపై PM మోదీ చేసిన <<12965771>>విమర్శలకు<<>> తమిళనాడు సీఎం స్టాలిన్ Xలో కౌంటర్ ఇచ్చారు. ‘పదేళ్లుగా కుంభకర్ణ నిద్రలో ఉండి హఠాత్తుగా మత్స్యకారులపై దొంగ ప్రేమ చూపుతున్న వారికి 3 ప్రశ్నలు. రాష్ట్రం చెల్లిస్తున్న రూపాయి పన్నుకు కేంద్రం 29 పైసలు మాత్రమే ఎందుకిస్తోంది?. 2023లో వరద సాయంగా ఒక్క రూపాయీ ఎందుకివ్వలేదు?. 10ఏళ్లలో రాష్ట్రాభివృద్ధికి ఒక్క పథకమైనా అమలుచేశారా?’ అని ప్రశ్నించారు.

News April 1, 2024

తిహార్ జైలు ఎక్కడుంది?

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత, కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించడంతో ఈ జైలు పేరు మార్మోగుతోంది. వెస్ట్ ఢిల్లీలోని తిహార్ విలేజ్‌కి 3KM దూరంలో 400 ఎకరాల విశాల ప్రాంతంలో దీన్ని నిర్మించారు. దేశంలోని అతిపెద్ద జైళ్లలో ఇదీ ఒకటి. సంజయ్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, సుబ్రతా రాయ్, చోటా రాజన్, ఛార్లెస్ శోభరాజ్, అన్నా హజారే, మిల్కా సింగ్, డీకే శివకుమార్, సంజయ్ దత్ వంటి ప్రముఖులు ఈ జైలుకు వెళ్లొచ్చారు.

News April 1, 2024

టాలీవుడ్‌లో విషాదం.. రచయిత కన్నుమూత

image

టాలీవుడ్ డబ్బింగ్ డైలాగ్ రైటర్ శ్రీ రామకృష్ణ(74) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తేనాపేటలోని అపోలో హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. శ్రీరామకృష్ణ స్వస్థలం తెనాలి కాగా 50 ఏళ్ల కిందట చెన్నైలో స్థిరపడ్డారు. బొంబాయి, జెంటిల్‌మాన్,‌ చంద్రముఖితో సహా 300 చిత్రాలకు పైగా రచయితగా పనిచేశారు. బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరిగా రజనీకాంత్ ‘దర్బార్’కు డైలాగ్స్ రాశారు.

News April 1, 2024

నా బయోపిక్‌లో నటిస్తున్నా: యువరాజ్ ట్వీట్

image

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నటుడిగా మారుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘నా సొంత బయోపిక్‌లో నటించాలని నిర్ణయించుకున్నా. దర్శకుడు, నిర్మాత, స్క్రిప్ట్ రైటర్‌గా మారబోతున్నా. నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. రాబోయే కొన్నేళ్లలో బిగ్ స్క్రీన్‌పై తుది ఫలితాన్ని చూస్తారు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తా’ అని తెలిపారు. అయితే, యూవీ ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News April 1, 2024

మైసూరు మహారాజుకు సొంతిల్లు, కారు లేవట!

image

కర్ణాటకలోని మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త వడియార్ మైసూరు- కొడగు ఎంపీ స్థానంలో BJP తరఫున నామినేషన్ దాఖలు చేశారు. తన మొత్తం ఆస్తులు ₹4.99 కోట్లని వెల్లడించారు. అయితే సొంత ఇల్లు, భూమి, కారు లేవని పేర్కొన్నారు. తన భార్య త్రిషిక కుమారి పేరిట ₹1.04 కోట్లు, పిల్లల పేరిట ₹3.64 కోట్లు ఉన్నాయన్నారు. కాగా మైసూరు రాజ్యాన్ని వడియార్ ఫ్యామిలీ 1339 నుంచి 1950 వరకు పాలించింది.
<<-se>>#ELECTIONS2024<<>>