India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలోని 17 MP, సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA స్థానానికి పోలింగ్ జరిగే మే 13న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉండనుంది. తెలంగాణలో ఉంటున్న AP ఓటర్లకూ ఈ సెలవు వర్తిస్తుంది. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్(APR 19), మహారాష్ట్ర(APR 19, 26), కర్ణాటక(మే 7)లో వేర్వేరు రోజుల్లో పోలింగ్ ఉంది. తెలంగాణలో పనిచేస్తున్న ఆ రాష్ట్రాల వారికీ వేతనంతో కూడిన సెలవు ఇస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది.

AP: దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు గుర్తింపు దక్కడం లేదని మాజీ CJI జస్టిస్ NV రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికీకరణ పెరిగి వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయిందన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రైతులు, రైతు కూలీలకు న్యాయం జరగాలంటే వారికి అన్ని శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేదంటే సంపన్నుల ఆధిపత్యంలోనే వ్యవస్థలు ఉండిపోయి కర్షకులకు న్యాయం జరగదు’ అని అభిప్రాయపడ్డారు.

TG: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీని వీడిన ప్రముఖ నేతల్లో ఎంపీ రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, దానం నాగేందర్(కాంగ్రెస్), బీబీపాటిల్, పి.రాములు, జి.నగేశ్, ఆజ్మీరా సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైదిరెడ్డి, ఆరూరి రమేశ్(బీజేపీ) ఉన్నారు. వీరిలో చాలామంది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు దక్కించుకోవడం గమనార్హం.

లోక్‌సభ ఎన్నికల్లో 15 మంది మాజీ CMలు పోటీ చేయనున్నారు. NDA నుంచి 12, ఇండియా కూటమి నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. NDA తరఫున శివరాజ్(MP), సోనోవాల్(AS), బిప్లవ్(త్రిపుర), త్రివేంద్ర(ఉత్తరాఖండ్), మనోహర్(HR), రాజ్‌నాథ్(UP), అర్జున్(ఝార్ఖండ్), జగదీశ్, బసవరాజ్(KA), కిరణ్(AP), కుమారస్వామి, జగదాంబికా పోటీ చేస్తున్నారు. INC నుంచి దిగ్విజయ్, భూపేశ్, నబంతుకి బరిలో ఉన్నారు. <<-se>>#Elections2024<<>>

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. బోట్స్‌వానా నుంచి మోరియా వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలో పండింది. ఈ ఘటనలో 45 మంది మరణించారు. ఈస్టర్ పండుగ కోసం జియాన్ చర్చికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడగా.. ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TG: పలు జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాల వారీగా ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అత్యధికంగా నిజామాబాద్ నుంచి 6.24లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనుంది. HYD మినహా 32 జిల్లాల్లో 7,149 కొనుగోలు కేంద్రాల ద్వారా 75.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.

AP: టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహాశయుల స్ఫూర్తిగా 1982లో NTR పార్టీని స్థాపించారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని.. ప్రజలకు సేవ చేయడమని నేర్పారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా పార్టీ ప్రజల సేవలో నిమగ్నమైంది. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో కృషిచేస్తుంది’ అని ట్వీట్ చేశారు.

ఈ ఏడాది శ్రీలంక ఆతిథ్యమిచ్చే మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి 28 వరకు టోర్నీ జరగనుంది. ఈ సారి ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్-Aలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. జులై 19న యూఏఈతో, 21న పాక్‌తో, 23న నేపాల్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడనుంది.

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.5 గంటలకు కాంగ్రెస్ పీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికలు, ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే సభ ఏర్పాట్లు, ఎంపీ స్థానాలు, 100 రోజుల పాలన వంటి అంశాలపై చర్చించనున్నారు. తుక్కుగూడ సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన ‘టిల్లూస్క్వేర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సిద్ధూ ఎనర్జీ, ఆటిట్యూడ్, కామెడీ టైమింగ్ బాగుందని చెబుతున్నారు. BGM, ఎడిటింగ్, ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఎక్కువ ట్విస్టులు కాస్త ఇబ్బంది పెడతాయని, సెకండాఫ్ స్లో ఉందని అభిప్రాయపడుతున్నారు. కాసేపట్లో వే2 న్యూస్ పూర్తి రివ్యూ.
Sorry, no posts matched your criteria.