news

News March 29, 2024

‘టిల్లూ స్క్వేర్’ రివ్యూ&రేటింగ్

image

అమ్మాయి ట్రాప్‌లో పడ్డ హీరో దాన్నుంచి ఎలా బయటకు వచ్చాడనేదే ‘టిల్లు స్క్వేర్’ స్టోరీ. ఇందులోనూ ‘డీజే టిల్లు’ కామెడీని డైరెక్టర్ కంటిన్యూ చేశారు. హీరో సిద్ధూ యాక్టింగ్, టైమింగ్, అనుపమ గ్లామర్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ నుంచి ఊహించని ట్విస్టులు ఉంటాయి. మ్యూజిక్ ప్లస్ పాయింట్. కొన్ని సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కల్గించడం, సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గడం మైనస్.
RATING: 3/5

News March 29, 2024

రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా 1,300 పెరగడంతో రూ.63,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,420 పెరిగి రూ.68,730కి చేరింది. దీంతో మార్కెట్ చరిత్రలో జీవితకాల గరిష్ఠానికి బంగారం ధరలు చేరాయి. కేజీ వెండి ధర రూ.300 పెరగడంతో రూ.80,800కు చేరింది.

News March 29, 2024

‘ఫేక్’ వైరస్‌ను కట్టడి చేద్దాం

image

కరోనా కంటే వేగంగా వ్యాపించే ఫేక్ న్యూస్‌ను వెంటనే అడ్డుకుందాం. Way2News లోగోతో కొందరు ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. మా వార్తల వెరిఫికేషన్ చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను యాప్‌లో/ fc.way2news.comలో ఎంటర్ చేస్తే మీకు వచ్చిన ఆర్టికల్ కన్పించాలి. లేదంటే ఫార్వర్డ్ అయ్యే వార్త ఫేక్. Way2News పేరుతో వైరల్ అయ్యే ఫేక్ వార్తలను grievance@way2news.comకు పంపండి.

News March 29, 2024

ఇక మన ‘టైమ్‌’

image

భారత్‌లోని గడియారాలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రుబీడియం అటామిక్‌ క్లాక్‌’ను అభివృద్ధి చేసింది. త్వరలో గడియారాలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లను ఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. కాగా ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నాయి.

News March 29, 2024

క్రిప్టో కింగ్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష

image

క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ FTX కో ఫౌండర్ శామ్ బ్యాంక్‌మన్‌కు న్యూయార్క్ కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్థిక మోసాలు, నగదు అక్రమ లావాదేవీల నేరాలకు అతను పాల్పడినట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. కస్టమర్ల డబ్బు ఇతర మార్గాల్లోకి వెళ్తోందనే విషయం తెలిసినా శామ్ అబద్ధం చెప్పారని ఫైరయ్యారు. 2019లో FTXను ఏర్పాటుచేయడంతో అతని సంపద 26 బిలియన్ డాలర్లకు చేరింది. తర్వాత చేసిన తప్పులతో ఆస్తులను కోల్పోయారు.

News March 29, 2024

దర్శకుడిగా స్టార్ హీరో కుమారుడు!

image

తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ సినీ ఇండస్ట్రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. హీరోగా కాకుండా ఆయన దర్శకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌తో సంజయ్ దర్శకత్వానికి ఒప్పందం కుదిరింది. కాగా ఈ సినిమాలో నటీనటులు ఇంకా ఖరారు కాలేదు. క్రికెట్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.

News March 29, 2024

క్యాబ్ డ్రైవర్ల నయా మోసం

image

ఉబర్ క్యాబ్ డ్రైవర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ‘ఫేక్ స్క్రీన్‌షాట్’లతో ఎక్కువ అమౌంట్ చూపించి కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ నుంచి తన ఇంటికి క్యాబ్ బుక్ చేసుకోగా అతడికి రూ.340 ఛార్జీ చూపించింది. తీరా గమ్యం చేరాక ఫేక్ స్క్రీన్ షాట్‌తో ఉబర్ క్యాబ్ డ్రైవర్ రూ.648 డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News March 29, 2024

BRSకు మరో షాక్!

image

ఇప్పటికే నేతల వలసలతో కుంగిపోతున్న BRS పార్టీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి సైతం BRSను వీడనున్నట్లు సమాచారం. నిన్న ఆయన కే.కేశవరావుతో భేటీ అయ్యారు. ఈ నెల 30న ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సైతం కారు దిగి హస్తం గూటికి చేరుతారని సమాచారం.

News March 29, 2024

కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ దక్కేదెవరికి?

image

TG: కరీంనగర్ లోక్‌సభ స్థానానికి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్ మల్లన్న పేర్లను కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈనెల 31న CEC భేటీలో దీనిపై స్పష్టత రానుంది. నియోజకవర్గ నేతల అభిప్రాయాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని.. సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. మల్లన్న నాన్‌లోకల్ అభ్యర్థి కావడంతో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని పలువురు సూచిస్తున్నారట.

News March 29, 2024

రాష్ట్రంలో 4,590 బ్యాక్‌లాగ్ పోస్టులు!

image

TG: ఒకేసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టడం, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మిగతా జాబ్స్‌ను వదిలేస్తుండటంతో బ్యాక్‌లాగ్ పోస్టులు పెరిగిపోతున్నాయి. 3 నెలల్లో 33వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగగా, 4,590 పోస్టులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ 2వేలు, గురుకులాల్లో 1,810, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్లలో 780 ఉద్యోగాలు భర్తీ కాలేదు. వీటికోసం మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది.