news

News April 13, 2024

హీరో ధనుశ్ తండ్రినని కోర్టుకెక్కిన వ్యక్తి మృతి

image

స్టార్ హీరో ధనుశ్ తన కొడుకే అంటూ 2015లో కేసు వేసిన కతిరేశన్ మృతి చెందారు. ధనుశ్ స్కూల్ నుంచి తమకు చెప్పకుండా పారిపోయి దర్శకుడు కస్తూరి రాజాకు దత్తపుత్రుడు అయ్యాడని కతిరేశన్ దంపతులు పేర్కొనడం అప్పట్లో సంచలనమైంది. ఈ విషయమై వారు కోర్టులను కూడా ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. కాగా గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కతిరేశన్ నిన్న మధురై ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు.

News April 13, 2024

తేజా సజ్జ కొత్త సినిమా ‘సూపర్ యోధ’

image

హనుమాన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన తేజా సజ్జ హీరోగా ‘సూపర్ యోధ’ అనే మూవీ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుపై ఎల్లుండి అధికారిక ప్రకటన చేయనున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ‘చరిత్రను తిరగరాసే రహస్యం’ ఆవిష్కృతం కానుందని పేర్కొంది. కాగా ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తారని సమాచారం. విలన్‌గా మంచు మనోజ్, కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తారని తెలుస్తోంది.

News April 13, 2024

నీటి ఎద్దడిపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

TG: హైదరాబాద్‌లో నీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు 155313 నంబరుకు కాల్ చేయాలని సూచించారు. 700 ట్యాంకర్ల ద్వారా సిటీలో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూర్‌లో నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నామని పొన్నం చెప్పారు.

News April 13, 2024

నేను సీఎంగా ఉండుంటే పోలవరం పూర్తయ్యేది: CBN

image

AP: వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. తిక్కలోడికి ప్రజలు ఓటేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని దుయ్యబట్టారు. సంపద సృష్టించే కేంద్రంగా రాజధాని తయారు చేస్తామని.. కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తాను సీఎంగా ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది అని పేర్కొన్నారు.

News April 13, 2024

‘దంపతులు కలిసి స్నానం చేయండి’.. మేయర్ వింత సూచన

image

కొలంబియా దేశ రాజధాని బొగోటా సిటీ మేయర్ కార్లోస్‌ ఫెర్నాండో గాలన్‌ ప్రజలకు వింత సూచన చేశారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దంపతులు కలిసి స్నానం చేయాలని.. తద్వారా కాస్త నీరు ఆదా అవుతుందని సలహా ఇచ్చారు. అలాగే హాలిడేస్‌లో లేదా బయటకు వెళ్లని రోజుల్లో స్నానం చేయడం మానుకోవాలని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా ఇలాంటి జాగ్రత్తలు తప్పవని పేర్కొన్నారు.

News April 13, 2024

AIADMKకు మద్దతు ప్రకటించిన ఒవైసీ

image

ఈ ఎన్నికల్లో తమిళనాడులోని ప్రతిపక్ష AIADMKకు మద్దతిస్తామని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొత్తు ఉంటుందన్నారు. BJPతో పొత్తు పెట్టుకునేందుకు AIADMK తిరస్కరించిందని, భవిష్యత్తులోనూ ఒప్పుకోబోదని ఒవైసీ అన్నారు. కేంద్రంలోని BJP తీసుకొచ్చిన CAA, NPR, NRCలను సైతం తమిళనాడులోని AIADMK వ్యతిరేకిస్తోందని, అందుకే ఆ పార్టీకి తాము మద్దతిస్తున్నట్లు ఒవైసీ ప్రకటించారు.

News April 13, 2024

19 ఏళ్లలో తొలిసారి.. TCSలో ఉద్యోగులు తగ్గారు

image

ప్రముఖ ఐటీ కంపెనీ TCSలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. 2004లో ప్రారంభమైన ఈ సంస్థలో ఏటా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉండగా, 19 ఏళ్లలో తొలిసారి 2023-24లో సిబ్బంది సంఖ్య 13,249 మేర తగ్గింది. 2022-23లో 6,14,795 మంది ఎంప్లాయీస్ ఉండగా, 2023-24లో ఆ సంఖ్య 6,01,546కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఐటీ రంగానికి డిమాండ్ తగ్గడం, ఆర్థిక తిరోగమనం వల్ల ఈ పరిస్థితి ఉన్నట్లు నిపుణుల అంచనా.

News April 13, 2024

డాక్టర్ కొణిదెల రామ్‌చరణ్

image

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇవాళ ఫ్యామిలీతో కలిసి చెన్నై వెళ్లిన చరణ్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయనకు ఈ గౌరవం అందడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను డాక్టరేట్ అందిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.

News April 13, 2024

కుక్క దాడిలో చిన్నారి మృతి

image

TG: హైదరాబాద్‌లో మరో చిన్నారి కుక్క కాటుకు బలైంది. జీడిమెట్లలో దారుణం జరిగింది. దీపాళి(2)పై వీధి కుక్క దాడి చేసింది. చిన్నారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో కొద్ది నెలలుగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 13, 2024

జాన్సన్ బంతి దెబ్బకు చూపు మసకబారింది: కోహ్లీ

image

ఆసీస్‌తో 2014లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జాన్సన్ బౌలింగ్‌ను సవాలుగా తీసుకుని ఆడినట్లు ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పారు. ‘తొలి మ్యాచ్‌లో జాన్సన్ బంతి నా తలకు తగిలింది. ఎడమ కంటి చూపు కాస్త మందగించడం ప్రారంభమైంది. లంచ్ సమయంలో పోరాడాలా? ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవాలా? అని ఆలోచించా. జాన్సన్‌కు దీటుగా సమాధానం ఇవ్వాలనుకున్నా. చివరకు అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నా’ అని తెలిపారు. ఈ సిరీస్‌లో కోహ్లీ 4 శతకాలు బాదారు.