news

News April 13, 2024

ప్రజల కోసం బతికే నాయకుడు చంద్రబాబు: భువనేశ్వరి

image

AP: చంద్రబాబును అరెస్టు చేసిన రోజును తానెప్పుడూ మర్చిపోలేనని ఆయన సతీమణి భువనేశ్వరి తెలిపారు. తిరువూరులో జరిగిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ.. ‘నిజం అంటే చంద్రబాబు.. అబద్ధం అంటే జగన్. ప్రజల కోసం బతికే నాయకుడిని అక్రమంగా జైలులో పెట్టారు. ఆ 53 రోజులు ఎలా బతికానో నాకే తెలియదు’ అని పేర్కొన్నారు. కాగా ఆమె 94 నియోజకవర్గాల్లోని 203 కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

News April 13, 2024

బీజేపీ మేనిఫెస్టో రెడీ.. రేపే విడుదల

image

సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ రేపు విడుదల చేయనుంది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ‘మోదీ గ్యారంటీ: 2047 నాటికి వికసిత్ భారత్’ థీమ్‌తో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలకు ‘న్యాయ పత్ర‌’ పేరుతో మేనిఫెస్టో రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

News April 13, 2024

తులం బంగారం ఏమైంది?: కేసీఆర్

image

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలను అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇస్తామన్న బంగారం ఎక్కడికి పోయిందని, మార్కెట్లో దొరకట్లేదా? అని ప్రశ్నించారు. హామీలను నెరవేర్చకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ప్రభుత్వం మెడలు వంచి అమలు చేసేలా చూస్తామని కేసీఆర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తాము తెచ్చిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో చూడాలని అన్నారు.

News April 13, 2024

4 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది: KCR

image

TG: అధికారం చేపట్టిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఏ ఒక్క విషయంలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. 15ఏళ్లు పోరాటం చేసి సాధించిన తెలంగాణను మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని అన్నారు.

News April 13, 2024

ALERT: తీవ్రమైన వడగాల్పులు

image

AP: రేపు 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఉ.11-సా4గంటల వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరింది. గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. డీహైడ్రేట్ కాకుండా ORS, ఇంట్లో చేసిన లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని పేర్కొంది. మీ మండలం ఉందో లేదో ఇక్కడ <>క్లిక్<<>> చేసి చూడండి.

News April 13, 2024

IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

image

ఈరోజు ములాన్‌పూర్‌లో పంజాబ్, రాజస్థాన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో RR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
పంజాబ్ జట్టు: బెయిర్‌స్టో, తాయిడే, ప్రభ్‌సిమ్రన్, కరన్, లివింగ్‌స్టన్, జితేశ్, శశాంక్ సింగ్, బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, అర్షదీప్ సింగ్
ఆర్ఆర్ జట్టు: కోటియన్, హెట్మెయిర్, శాంసన్, పరాగ్, జురెల్, పావెల్, బౌల్ట్, మహారాజ్, ఆవేశ్, కుల్‌దీప్ సేన్, చాహల్

News April 13, 2024

రైతులను కోడిపిల్లల్లా కాపాడుకున్నాం: KCR

image

TG: తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులను కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకున్నామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం 5 పథకాలు తీసుకొచ్చామన్నారు. రైతుబంధుతో ఎకరానికి రూ.10వేలు ఇచ్చామన్నారు. 24గంటల నాణ్యమైన కరెంట్, రైతు బీమా కింద రూ.5లక్షలు, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేదని ఆయన అన్నారు.

News April 13, 2024

‘మేఘా’పై FIR నమోదు చేసిన సీబీఐ

image

HYD సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై సీబీఐ FIR నమోదు చేసింది. జగదల్‌పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ పనులకు సంబంధించి ₹174 కోట్ల బిల్లులను క్లియర్ చేయించుకోవడానికి 8 మంది NISP, NMDC అధికారులకు కంపెనీ ₹78 లక్షల లంచం ఇచ్చినట్లు తేలింది. దీంతో వారిపైనా కేసు నమోదయ్యింది. కాగా ₹966 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి.. రెండో అతిపెద్ద కంపెనీగా మేఘా నిలిచిన విషయం తెలిసిందే.

News April 13, 2024

ఎన్నికల్లో పట్టువదలని విక్రమార్కుడు!

image

ఆగ్రాకు చెందిన హన్సురామ్ అంబేడ్కరీ(78)కి ఎన్నికలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985 నుంచి ఇప్పటి వరకు 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కసారీ గెలవలేదు. రానున్న ఎన్నికలకూ ఆగ్రా, ఫతేపుర్ సిక్రీ స్థానాల నుంచి బరిలో ఉన్నారు. ‘పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు అన్ని ఎన్నికలకూ పోటీ చేశా. రాష్ట్రపతి పదవికీ ట్రై చేశా. తిరస్కరించారు. 100సార్లు నామినేషన్ నా లక్ష్యం. అది పూర్తయ్యాక మానేస్తాను’ అని తెలిపారు.

News April 13, 2024

ప్రభుత్వం అంటే ప్రజలకు ధీమా ఉండాలి: కేసీఆర్

image

TG: ప్రభుత్వం అంటే ప్రజలకు ధీమా, ధైర్యం ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తమకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ఉండాలని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అన్నారు. ప్రతిసభలోనూ ఇదే విషయాన్ని తాను ప్రజలకు గుర్తు చేస్తుంటానని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వాలు మారుతుంటాయని ఆయన అన్నారు.