news

News April 13, 2024

తొలిదశ ఎలక్షన్స్.. ధనిక అభ్యర్థి ఎవరంటే!

image

ఈ నెల 19న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్‌లో పోటీ చేసే అభ్యర్థుల్లో నకుల్‌నాథ్(INC) రూ.717 కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థిగా నిలిచినట్లు ADR నివేదిక తెలిపింది. ఈయన మధ్యప్రదేశ్ Ex CM కమల్‌నాథ్ కుమారుడు. ఆ తర్వాత TNలోని AIADMK అభ్యర్థి అశోక్(రూ.662 కోట్లు), BJP నేత దేవనాథన్ (రూ.304 కోట్లు) నిలిచారు. పుదుచ్చేరిలో ఇండిపెండెంట్ అభ్యర్థి సతీశ్(25) రూ.2000 కలిగి ఉన్నట్లు ప్రకటించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 13, 2024

నాలుగు చోట్ల ఎంపీగా గెలుపు!

image

AP: లోక్‌సభ సభ్యునిగా నాలుగు నియోజకవర్గాల నుంచి గెలుపొంది చరిత్రకెక్కారు రాజకీయ ధురంధరుడు గోగినేని రంగనాయకులు(NG రంగా). 1957లో తెనాలి(కాంగ్రెస్), 1962లో చిత్తూరు(ఇండిపెండెంట్), 1967లో శ్రీకాకుళం (ఇండిపెండెంట్), 1980లో గుంటూరు ఎంపీగా కాంగ్రెస్(ఐ) నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1984, 89లోనూ గుంటూరు నుంచి కాంగ్రెస్ తరఫున నెగ్గారు. 1977-80 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 13, 2024

కంగన ప్రత్యర్థిగా విక్రమాదిత్య?

image

నటి కంగన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి BJP ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఆమెపై తన కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ను బరిలోకి దించనున్నట్లు సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ అన్నారు. విక్రమ్ పేరును అధిష్ఠానానికి సూచించానన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.

News April 13, 2024

ఇక బతికినంత కాలం సినిమాల్లోనే: చిరంజీవి

image

తనవంటి వారికి రాజకీయాలు పనికిరావని నటుడు చిరంజీవి అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘మరింత మంచి చేయాలని రాజకీయాల్లోకి వెళ్లాను. కానీ నేటి రాజకీయాల్లో నాలాంటివాడు అనర్హుడు అన్నది వాస్తవం. అందుకే వెంటనే వెనక్కి వచ్చేశాను. తిరిగొచ్చాక నా మీద అదే ప్రేమ ఉంటుందా అన్న అనుమానం ఉండేది. ప్రేక్షకులు అదే ప్రేమను ఇస్తున్నారు. ఇకపై బతికినంతకాలం సినిమాల్లోనే’ అని తెలిపారు.

News April 13, 2024

తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపింది: పవన్ కళ్యాణ్

image

AP: టీటీడీ నిధులను అడ్డగోలుగా వాడుకునే కుట్రలకు వైసీపీ నాయకులు తెరతీశారని, ఈ అంశంపై సమగ్ర సమాచారం తమ వద్ద ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుమల పవిత్రతను రాష్ట్ర ప్రభుత్వం మంటగలిపిందని విమర్శించారు. తులసి వనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తిరుపతిలో దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని కూటమి నాయకులకు సూచించారు.

News April 13, 2024

ALERT: 3 రోజులే ఛాన్స్

image

కొత్త ఓట్ల నమోదుకు ECI విధించిన గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఓటర్ లిస్టులో పేరు లేని 18+ వారంతా ఈనెల 15లోగా ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. <>ఆన్‌లైన్‌లో<<>> లేదా సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో ఫాం-6ను సమర్పించాలని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుందని, కానీ చివరిదాకా ఆగకుండా 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడం మంచిదని చెప్పారు.

News April 13, 2024

వరల్డ్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలు కన్నుమూత

image

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన(62 ఏళ్ల 202 రోజులు) అవిభక్త మహిళా కవలలు లోరీ, జార్జ్ షాపెల్(డోరీ) కన్నుమూశారు. అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరి మరణానికి కారణాలు తెలియరాలేదు. 1961లో జన్మించిన వీరికి శరీరాలు వేరుగా ఉన్నా.. పుర్రెలు మాత్రం కలిసిపోయాయి. వెన్నుముక సమస్య వల్ల నడక సాధ్యం కాకపోవడంతో వీరు కుర్చీలోనే జీవనాన్ని సాగించారు.

News April 13, 2024

ఇక నెల రోజులే

image

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధానికి నెల రోజులే సమయం ఉంది. వచ్చే నెల ఇదే రోజున పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29తో ఉపసంహరణ గడువు ముగియనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. పార్టీల అధినేతలు బస్సు యాత్రలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడచూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

News April 13, 2024

దేవదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు: పురందీశ్వరి

image

AP: దేవదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడంపై BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆ శాఖ ఉద్యోగులెప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు. ఏప్రిల్, మే, జూన్‌లో అనేక పండుగలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఆలయాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువ. ఆలయ సిబ్బంది లేకపోతే భక్తులు ఇబ్బందులు పడతారు. అందువల్ల వీరికి ఎన్నికల విధులపై పునఃపరిశీలన చేయండి’ అని EC, CEOకు లేఖ రాశారు.

News April 13, 2024

ఇంటర్ ఫీజులతో పేరెంట్స్ ఉక్కిరిబిక్కిరి

image

TG: రాష్ట్రంలో ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఫీజులు రెట్టింపయ్యాయి. కార్పొరేట్ కాలేజీలు డేస్కాలర్‌కు రూ.2.25లక్షలు విధిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ గతేడాది రూ.40వేలు ఉండగా.. రూ.70వేలకు చేరింది. దీంతో పిల్లలను చదివించేదెలాగని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. నిర్వహణ ఖర్చు, లెక్చరర్ల జీతాలు పెరగడంతో ఫీజులు పెంచాల్సి వస్తోందని యాజమాన్యాలు అంటున్నాయి.