India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాంవ్లి గ్రామానికి చెందిన భారత బాయి(32) అనే మహిళ తన భర్త రోజూ వేదించడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న సాంగే ప్రకాష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి పథకం అమలు తీరు పై శనివారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సిరికొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అనంతపూర్‌కు చెందిన తోడసం నాగు- ఇస్రుబాయి దంపతుల కుమారుడు లాల్ సావ్ (10) శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. శనివారం ఉదయం స్థానికులు గ్రామ పొలిమేరలో గాలించగా బావిలో బాలుడు శవమై కనిపించాడు. దీంతో వారు బాలుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఓ బాలిక (17)ను ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని మోసం చేసిన కేసులో నిందితుడి పై మావల పీఎస్‌లో అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఇర్ఫాన్ పై అట్రాసిటీ, పోక్సో కేసును నమోదు చేశామన్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
కుంటాల మండలం సూర్యపూర్ శివారు ప్రాంతంలో చిరుత దాడిలో ఓ ఆవు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం రైతు సాయన్నకు చెందిన ఆవు గ్రామ శివారులోని అడవిలో మేత మేస్తుండగా చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత రైతు మాట్లాడుతూ.. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నాడు.
బేల మండలంలోని వాడగూడ, జంగుగూడ, మసాలా (బి), సదల్పూర్, మరిన్ని గ్రామాలలో ఏర్పాటు చేసిన దీపావళి దండారి ఉత్సవాల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఆయనకు ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. జోగు రామన్న మాట్లాడుతూ.. దండారీలకు రూ.10 వేల ఆర్థిక సాయం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనే ఆదివాసీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు రామన్న పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా.. పట్టణంలోని YSR కాలనీకి చెందిన నరేశ్(25) తామర పువ్వుల కోసం చెరువుకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. కాగా, బంగల్పేట్ చెరువులో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు జోగుల సీతారాం మేస్త్రిగా గుర్తించారు.
ఆదిలాబాద్ పట్టణంలో గురువారం దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులు నిర్వహించిన లక్ష్మీ పూజలో ఎంపీ గొడం నగేశ్ పాల్గొన్నారు. ఈ మేరకు ఓ ట్రావెల్స్ కార్యాలయంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొని టపాసులు కాల్చారు. అనంతరం జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నవంబర్ 2న ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అండర్ 19 ఖోఖో ఉమ్మడి జిల్లా స్థాయి బాలురులకు ఎంపిక పోటీలను ఎస్జీఎఫ్ సెక్రటరీ బాబురావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ రవీందర్ తెలిపారు. ఈ పోటీలకు ఇంటర్మీడియట్ చదువుతూ 19 సంవత్సరాలలోపు వయసు కలిగిన విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులు బోనఫైడ్, ఆధార్ కార్డు తీసుకుని ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో NHM పథకంలో జిల్లా కార్యక్రమ సమన్వయకర్త, సీనియర్ డాట్స్ ప్లస్ టీబీ, హెచ్ఐవీ(STS), TBHV ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసినట్లు DMHO కృష్ణ తెలిపారు. అలాగే మూడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఒక PMDT, TBHV సమన్వయకర్త పోస్టుల ప్రొవిజనల్ జాబితాను సైతం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. జాబితాలను కార్యాలయ నోటీసు బోర్డుపై ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.